Begin typing your search above and press return to search.

రెడ్ అలర్ట్.. కుమ్మేసిన పరమ్ సుందరి!

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈమధ్య తన అందంతోనే కాదు నటనతో కూడా అందరిని ఆకట్టుకుంటోంది .

By:  Madhu Reddy   |   23 Aug 2025 1:32 PM IST
రెడ్ అలర్ట్.. కుమ్మేసిన పరమ్ సుందరి!
X

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈమధ్య తన అందంతోనే కాదు నటనతో కూడా అందరిని ఆకట్టుకుంటోంది . దీనికి తోడు భాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన ఈమె హిందీలో తాజాగా నటించిన చిత్రం 'పరమ్ సుందరి'. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్ర ప్రధాన పాత్రలో రాబోతున్న ఈ ప్రేమ కథ చిత్రాన్ని తుషార్ జలోటా తెరకెక్కించారు. ఇటీవలే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

రెడ్ అలర్ట్ అంటూ హుక్ స్టెప్ తో అదరగొట్టేసిన జాన్వీ

ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగంగా చేపట్టారు చిత్ర బృందం. అందులో భాగంగానే 'డేంజర్' అనే మరో పాటను అభిమానులతో పంచుకుంది చిత్ర బృందం. ఇందులో "రెడ్ అలర్ట్ " అంటూ మొదలైన ఈ గీతంలో హుక్ స్టెప్పులతో సిద్ధార్థ్ మల్హోత్రా , జాన్వీ కపూర్ అదరగొట్టేశారు.. మునుపెన్నడూ చూడని పెర్ఫార్మెన్స్ జాన్వీ లో కనిపించింది అని.. ప్రతి ఒక్కరూ కామెంట్లు చేస్తున్నారు. "నువ్వు సుందరివే కానీ నీ ఎరుపు రంగు చీరే ప్రమాదకరంగా కనిపిస్తోంది" అని తన ప్రేయసితో సిద్ధార్థ్ కబుర్లు చెప్పడం హైలైట్ గా నిలిచింది. మొత్తానికి అయితే ఈ పరమ్ సుందరి అందంతోనే కాదు హుక్ స్టెప్పులతో కూడా అదరగొడుతూ మెస్మరైజ్ చేస్తోందని చెప్పవచ్చు.

ట్రైలర్ తో రికార్డు సృష్టించిన పరమ్ సుందరి..

పరమ్ సుందరి సినిమా విషయానికి వస్తే.. తుషార్ జలోటా దర్శకత్వంలో సిద్ధార్థ్ మల్హోత్రా , జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పరమ్ సుందరి. జూలై 25న విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడి ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. మ్యాడాక్ ఫిలిమ్స్ బ్యానర్ పై దినేష్ విజన్ నిర్మించిన ఈ సినిమాను సుమారుగా రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇప్పటికే పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న ఈ సినిమా విడుదలయ్యాక ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. అటు ఇటీవల విడుదలైన ట్రైలర్ కి కూడా సుమారుగా 40 మిలియన్ కి పైగా వ్యూస్ రావడం గమనార్హం.

జాన్వీ కపూర్ సినిమాలు..

జాన్వీ కపూర్ విషయానికి వస్తే.. దివంగత నటీమణి శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఒకవైపు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే.. మరొకవైపు పలు యాడ్స్ లో చేస్తూ మరింత క్రేజ్ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ లో సినిమాలలో నటిస్తున్నప్పుడే ఇటు దేవర సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమా కమర్షియల్ గా భారీ విజయం అందుకుంది. ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో జాన్వీ చాలా చక్కగా ఒదిగిపోయిందని చెప్పవచ్చు. అలాగే సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాలో కూడా హీరోయిన్గా చేస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.