చికిరీల మధ్య టింగురంగడు ఎవరీయన?
జాన్వీ లెహంగా తరహా ఇండో-వెస్ట్రన్ గౌన్ లో ఎంతో అందంగా కనిపించగా, ఖుషి తన సోదరితో పోటీపడుతూ డిజైనర్ లుక్ లో మెరిసిపోయింది.
By: Sivaji Kontham | 7 Dec 2025 10:44 AM ISTప్రస్తుతం ఏ నోట విన్నా చికిరీ చికిరీ... `పెద్ది` సాంగ్ లో జాన్వీ ఒంపు సొంపుల వయ్యారాల వడ్డనల గురించి పదే పదే ముచ్చటిస్తున్నారు. ముఖ్యంగా చరణ్ ఫ్యాన్స్ హృదయాలలో గిలిగింతలు పెడుతోంది చికిర. అతిలోక సుందరి శ్రీదేవికి సిసలైన నటవారసురాలు! అంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. ఇలాంటి సమయంలో జాన్వీ ఎక్కడైనా తగ్గుతుందా?
ఇప్పుడు అంబానీల క్రిస్మస్ పార్టీలోను దుమ్ము దులిపేసింది. ప్రపంచ కుభేరుడు ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ హోస్ట్ చేసిన ఆర్టిసానల్ క్రిస్మస్ వేడుకలో జాన్వీ కపూర్ అదిరిపోయే అల్ట్రా స్టైలిష్ లుక్ తో ఎంట్రీ ఇచ్చింది. జాన్వీతో పాటు, ఈ వేదిక వద్ద ఖుషీ కపూర్ కూడా మెరుపులా తోడైంది. ఇక ఆ ఇద్దరినీ డిజైన్ చేసిన మనీష్ మల్హోత్రా వారితో కలిసి అందమైన స్నాప్ లో ఒద్దికగా ఇమిడిపోయాడు.
జాన్వీ లెహంగా తరహా ఇండో-వెస్ట్రన్ గౌన్ లో ఎంతో అందంగా కనిపించగా, ఖుషి తన సోదరితో పోటీపడుతూ డిజైనర్ లుక్ లో మెరిసిపోయింది. ఈ ఇద్దరు సిస్టర్స్ ని చూడగానే చికిరి -1, చికిరి -2 అంటూ ప్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. ఖుషీ ఖుషీగా జాన్వీ హొయలు గురించి చర్చించుకుంటోంది యూత్. ప్రస్తుతం అంబానీల స్పెషల్ పార్టీలో షో స్టాపర్స్ గా నిలిచిన కపూర్ సిస్టర్స్ ఫోటోలను అభిమానులు వైరల్ గా షేర్ చేస్తున్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే, జాన్వీ ఇప్పటికే స్టార్ రేంజుకు చేరిపోయింది. మామ్ శ్రీదేవి కన్న కలల్ని నిజం చేసే దిశగా అడుగులు వేస్తోంది. దేవర తర్వాత పెద్దితో బంపర్ హిట్టు కొట్టి తన రేంజు తక్కువేమీ కాదని నిరూపించబోతోంది.మరోవైపు తన సోదరి జాన్వీతో పోటీపడాలని ఉవ్విళ్లూరుతోంది ఖుషీ. ప్రస్తుతం `మామ్ 2` చిత్రీకరణలో బిజీగా ఉంది.
