పెళ్లి ప్లానింగ్స్ పై జాన్వీ ఏమంటున్నారంటే?
రీసెంట్ గా పరమ్ సుందరితో ప్రేక్షకుల్ని పలకరించిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో ఖాళీ లేకుండా ఉన్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 16 Sept 2025 12:40 PM ISTరీసెంట్ గా పరమ్ సుందరితో ప్రేక్షకుల్ని పలకరించిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో ఖాళీ లేకుండా ఉన్నారు. పరమ్ సుందరి తర్వాత జాన్వీ ఇప్పుడు తన తర్వాతి సినిమా సన్నీ సంస్కారీ కి తులసి కుమారి ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నారు. జాన్వీ గురించి ఏ వార్త వచ్చినా దాన్ని క్షణాల్లో వైరల్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్.
సన్నీ సంస్కారీకి తులసి కుమారి ప్రమోషన్స్ లో బిజీగా..
తాజాగా సన్నీ సంస్కారీ కి తులసి కుమారి ట్రైలర్ లాంచ్ జరగ్గా ఆ ఈవెంట్ కు వరుణ్ ధావన్, సన్యా మల్హోత్రా, మనీష్ పాల్ తో కలిసి జాన్వీ కపూర్ కూడా హాజరయ్యారు. ఈవెంట్ లో భాగంగా జాన్వీని పెళ్లి, దాని ప్లానింగ్ గురించి అడగ్గా, ప్రస్తుతం తన ప్లానింగ్ మొత్తం సినిమాల గురించేనని, పెళ్లి కోసం ప్లానింగ్స్ చేయడానికి ఇంకా చాలా టైముందని చెప్పారు.
శిఖర్ పహారియాతో రిలేషన్‌లో జాన్వీ
అయితే జాన్వీ కపూర్ శిఖర్ పహారియాతో చాలా కాలంగా రిలేషన్ లో ఉందనే విషయం తెలిసిందే. వారిద్దరూ కలిసి చాలా ఈవెంట్స్ లో కలిసి కనిపించడంతో పాటూ అతని పేరుతో ఉన్న నెక్లెస్ ను కూడా జాన్వీ తన మెడలో ధరించారు. కానీ ఇప్పటివరకు తమ రిలేషన్‌షిప్ ను మాత్రం జాన్వీ ఎప్పుడూ బయటపెట్టింది లేదు. ఎలాగూ రిలేషన్ లో ఉంది కాబట్టి త్వరలోనే పెళ్లి చేసుకుంటుందేమో అని అనుకున్న అందరికీ జాన్వీ తన ఆన్సర్ తో చెక్ పెట్టేశారు.
సినిమాలపైనే ఫోకస్
జాన్వీ మాటల్ని బట్టి ఇప్పట్లో ఆమె పెళ్లి గురించి ఆలోచన కూడా చేసేట్టు కనిపించడం లేదు. పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న జాన్వీ తెలుగులో కూడా వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ది సినిమా చేస్తున్న జాన్వీ, అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటించనున్నారు. ఈ రెండింటితో పాటూ ఎన్టీఆర్ తో దేవర2 కూడా లైనప్ లో ఉంది.
