Begin typing your search above and press return to search.

తిరుప‌తి కుర్రాడైతే ఇంకా బాగుంటుందేమో!

అతిలోక సుందరి శ్రీదేవి తనయ, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తన మనసులోని ఓ ఆసక్తికర కోరికను బయటపెట్టింది.

By:  Srikanth Kontham   |   3 May 2026 5:00 AM IST
తిరుప‌తి కుర్రాడైతే ఇంకా బాగుంటుందేమో!
X

అతిలోక సుందరి శ్రీదేవి తనయ, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తన మనసులోని ఓ ఆసక్తికర కోరికను బయటపెట్టింది. వివాహం తర్వాత తాను తిరుపతిలో సెటిల్ అవ్వాలని అనుకుంటున్నట్లు వెల్ల‌డించింది.

తిరుప‌తి అందాల‌ను...శ్రీవారిపై త‌న‌కున్న భ‌క్తిని చాటి చెబుతూనే పెళ్లి త‌ర్వాత ముంబై వీడితే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డింది. మామ్ శ్రీదేవికి తిరుమల వేంకటేశ్వర స్వామికి అమిత‌మైన భ‌క్తురాలు. ఏడాదిలో మూడు నాలుగుసార్లు అయినా కుటుంబంతో శ్రీవారిని ద‌ర్శించుకునేవారు. ఇప్పుడా ప‌ద్ద‌తిని జాన్వీక‌పూర్ వారసత్వంగా ముందుకు తీసుకెళ్తుంది.

సోద‌రి ఖుషీ క‌పూర్, డాడ్ బోనీక‌పూర్ ల‌తో క‌లిసి తిరుప‌తి కి విచ్చేస్తుంది. ఈనేప‌థ్యంలోనేతన జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం తర్వాత ఆధ్యాత్మిక నగరిలో ప్రశాంతంగా గడపాలని అమ్మ‌డు ఆశిస్తోంది. జాన్వీ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ అవ్వ‌డంతో? అభిమానులు మరో అడుగు ముందుకేసి సరికొత్త చర్చకు తెరలేపారు. జాన్వీకి తిరుపతికి చెందిన కుర్రాడే భర్తగా దొరికితే ఆమె కోరిక మరింత సులువుగా నెరవేరుతుందనే కామెంట్లు చేస్తున‌నారు. అత్తగారి ఊరు తిరుపతి అయితే ఆమెకు ఆ నగరంతో ఉన్న అనుబంధం మరింత బలపడుతుందని శ్రీవారి సేవలో తరించే భాగ్యం నిరంతరం దక్కుతుందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

ముంబై బినిజెస్ మ్యాన్...ఓ పెద్ద న‌టుడు కంటే? జాన్వీ స్థానికంగా ఉండే తిరుప‌తి వాసిని పెళ్లి చేసుకుంటే? మ‌రింత బాగుంటుందంటూ కామెంట్లు పెడుతున్నారు. మ‌రి ఈ కామెంట్ల‌పై జాన్వీ ఎలా స్పందిస్తుందో చూద్దాం. శ్రీదేవి కుటుంబానికి తిరుమలతో దశాబ్దాల అనుబంధం ఉంది. ఏ చిన్న సందర్భం వచ్చినా ఆ కుటుంబం తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. జాన్వీ కపూర్ కూడా ప్రతి తన పుట్టినరోజున లేదా సినిమా ప్రారంభోత్సవాల సమయంలో సాంప్రదాయబద్ధంగా పట్టుచీర కట్టుకుని కొండపైకి కాలినడకన వెళ్తుంది. తిరుపతిపై ఆమెకున్న మమకారం కేవలం భక్తి మాత్రమే కాదు.

తన తల్లి జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న ఒక భావోద్వేగం. తిరుపతిపై జాన్వీ కపూర్ కున్న ప్రత్యేక అభిమానం తెలుగు ప్రజలకు మరింత దగ్గర చేస్తోంది. స్టార్ హీరోయిన్ అయి ఉండి కూడా గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఆధ్యాత్మిక వాతావరణంలో స్థిరపడాలనుకోవడం విశేషం. భవిష్యత్తులో నిజంగానే తిరుపతి కుర్రాడు ఆమెకు భర్తగా దొరికి తిరుపతి కోడలిగా మారితే పెద్ద సంచలనమే అవుతుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉంది. తెలుగులో రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న `పెద్ది` సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ లో కూడా వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. అయితే ఫోక‌స్ అంతా మాత్రం టాలీవుడ్ పైనే ఉంది. తెలుగు సినిమా పాన్ ఇండియాలో స‌త్తా చాటుతోన్న త‌రుణంలో ఇక్క‌డే చ‌క్రం తిప్పాల‌ని చూస్తోంది.