వీడియో : ఉట్టి కొట్టిన పరమ్ సుందరి
అతిలోక సుందరి జాన్వీ కపూర్ ప్రస్తుతం తన హిందీ సినిమా పరమ్ సుందరి ప్రమోషన్‌లో పాల్గొంటుంది.
By: Ramesh Palla | 17 Aug 2025 2:40 PM ISTఅతిలోక సుందరి జాన్వీ కపూర్ ప్రస్తుతం తన హిందీ సినిమా పరమ్ సుందరి ప్రమోషన్‌లో పాల్గొంటుంది. సిద్దార్థ్ మల్హోత్ర హీరోగా నటించిన పరమ్ సుందరి సినిమాపై అంచనాలు పెంచే విధంగా ప్రమోషన్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా జాన్వీ కపూర్, సిద్దార్థ్ ఈ సినిమా గురించి ప్రచారం చేస్తున్నారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా జాన్వీ కపూర్ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంది. తాజాగా శ్రీకృష్ణ జన్మాష్టమి కావడంతో అభిమానులతో కలిసి ఆమె ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొంది. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ చేస్తూనే జాన్వీ కపూర్ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పరమ్ సుందరి సినిమాతో బాలీవుడ్‌లో మొదటి కమర్షియల్ హిట్‌ను కొట్టబోతున్నట్లు ఆమె చాలా నమ్మకంగా ఉంది.
జాన్వీ కపూర్ పరమ్ సుందరి
తాజాగా జాన్వీ కపూర్ ఉట్టి కొట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఉట్టి కొడుతూ భారత్ మాతాకి జై అంటూ జాన్వీ కపూర్ నినదించడం అందరి దృష్టిని ఆకర్షించింది. జాన్వీ కపూర్ అందంతో పాటు, దేశ భక్తి మెండుగా ఉందంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ప్రతిభ ఉన్న జాన్వీ కపూర్‌కి ఇప్పటి వరకు హిందీలో కమర్షియల్ హిట్ పడలేదు. అయినప్పటికీ ఆమె నటిగా ఇండస్ట్రీలో కొనసాగడంకు కారణం ఆమె అందం అనడంలో సందేహం లేదు. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ ఈమె సొంతం అంటూ ఉంటారు. అందుకు కారణం ఈమె రెగ్యులర్‌గా వర్కౌట్స్ చేయడం అంటూ ఉంటారు. జిమ్‌లో ఈమె ఎక్కువ సమయం గడుపుతూ ఉంటుంది. అందుకే ఈమె చాలా అందంగా ఉంటుంది అంటూ అభిమానులు అంటూ ఉంటారు.
ఉట్టి కొట్టిన జాన్వీ కపూర్
పరమ్ సుందరి సినిమా ప్రమోషన్‌లో భాగంగా జాన్వీ కపూర్ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటుంది. గతంలో తాను నటించిన సినిమాలు చాలానే విడుదల అయ్యాయి. వాటికి కూడా జాన్వీ కపూర్ ప్రమోషన్స్ చేసింది. కానీ ఈ స్థాయిలో ప్రమోషన్స్ చేసిన దాఖలాలు తక్కువగా ఉన్నాయి. అందుకే జాన్వీ కపూర్ పరమ్ సుందరి పై ఎంత నమ్మకంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. పరమ్ సుందరి ప్రమోషన్‌లో చివరకు ఇలా ఉట్టి కూడా కొట్టడం ద్వారా జాన్వీ అందరి దృష్టిని ఆకర్షించింది. అంతే కాకుండా ఆమె సినిమాకు మంచి రీచ్ దక్కింది అని చెప్పవచ్చు. మరో వైపు అమ్మాయిలు ఉట్టి కొట్టడం కరెక్టేనా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. జాన్వీ కపూర్ వంటి హీరోయిన్ ఉట్టి కొట్టడం అనేది ఎంత వరకు కరెక్ట్ అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
రామ్ చరణ్, బుచ్చిబాబు పెద్ది సినిమా
సెలబ్రిటీలు ఏం చేసినా విమర్శించే వారు, ట్రోల్ చేసే వారు ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు జాన్వీ కపూర్ ను కొందరు విమర్శిస్తున్నారు. పరమ్ సుందరి తో జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో ఒక మంచి హిట్ కొడుతుంది అంటూ ఆమె ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఇక తెలుగులో ఈమె రామ్ చరణ్ హీరోగా బుచ్చి బాబు దర్శకత్వంలో రూపొందుతున్న 'పెద్ది' సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ చకచక జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్ వరకు సినిమా రాబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న పెద్ది సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటించడం ద్వారా అంచనాలు పెరిగాయి. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించడం ద్వారా సినిమా స్థాయి అమాంతం పెరిగింది.
