పాపం.. ట్రైలర్‌తోనే జాన్వీని ఏకి పారేస్తున్నారు
అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ మరోసారి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.
By: Ramesh Palla | 17 Sept 2025 3:48 PM ISTఅతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ మరోసారి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ మధ్య కాలంలో జాన్వీ కపూర్‌కి విమర్శలు అనేవి కొత్తేం కాదు, కానీ ఈసారి సినిమా విడుదల కాకుండానే కేవలం ట్రైలర్ ను చూసి విమర్శిస్తున్నారు. జాన్వీ కపూర్ నటన ఆపేసి ఫోటో షూట్స్ చేసుకోవాల్సిందే అంటూ చాలా మంది తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఒక వర్గం జనాలు చేస్తున్న కామెంట్స్ జాన్వీ కపూర్ అభిమానులను తీవ్రంగా బాధిస్తున్నారు. ఆ ట్రోల్స్‌కి జాన్వీ అభిమానులు సమాధానం ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో జాన్వీ కపూర్ పై కొందరు కావాలని పెయిడ్ పీఆర్ చేయించి బ్యాడ్ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటున్నారు. జాన్వీ కపూర్ మరీ ఇంత దారుణమైన ట్రోలింగ్ కి అర్హురాలు కాదు అనే అభిప్రాయం ను వ్యక్తం చేస్తున్నారు.
సన్నీ సంస్కారికి తులసి కుమారి ట్రైలర్
అసలు విషయం ఏంటంటే జాన్వీ కపూర్ నటించిన కొత్త సినిమా సన్నీ సంస్కారికి తులసి కుమారి సినిమా విడుదలకు సిద్ధం అయింది. వచ్చే నెల మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు వేగం అయ్యాయి. విడుదలకు మరో రెండు వారాలు ఉన్న నేపథ్యంలో భారీ ఈవెంట్ నిర్వహించి సినిమా యొక్క ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ట్రైలర్ ఆవిష్కరణ సమయంలో జాన్వీ కపూర్ చాలా మాట్లాడారు. ఆ సమయంలో జాన్వీ ఈ సినిమాపై చాలా నమ్మకం వ్యక్తం చేశారు. అంతే కాకుండా సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ పాజిటివ్‌గా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ సినిమా కోసం తాము చాలా కష్టపడ్డామని కూడా జాన్వీ చెప్పారు. అలా చెప్పిన జాన్వీ కపూర్ పైనే ఇప్పుడు దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి.
జాన్వీ కపూర్, వరుణ్ ధావన్‌లపై విమర్శలు
సన్నీ సంస్కారికి తులసి కుమారి సినిమా ట్రైలర్ విడుదలైన వెంటనే హీరో వరుణ్ ధావన్, హీరోయిన్ జాన్వీ కపూర్ యొక్క నటన గురించి విమర్శలు మొదలు అయ్యాయి. దాదాపు మూడు నిమిషాలు ఉన్న ట్రైలర్ లో వీరిద్దరు కనిపించేది కొద్ది సమయం మాత్రమే. అందులో కొన్ని డాన్స్ మూమెంట్స్, కొన్ని యాక్షన్ మూమెంట్స్ ఉంటాయి, అక్కడ యాక్టింగ్ చూపించేందుకు స్కోప్ ఎక్కడ ఉంటుంది. అలాంటి ట్రైలర్‌లో జాన్వీ కపూర్ నటన లోపాలను వెతికిన వారు ఉన్నారు. ఈ షాట్‌లో జాన్వీ యాక్షన్ బాగాలేదు, రియాక్షన్ సరిగ్గా ఇవ్వలేదు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట ఈ అమ్మడిని బ్యాడ్ చేయాలి అనే ఉద్దేశంతో కొందరు ఈ ట్రోల్స్ చేస్తున్నారా అన్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు సినిమా విడుదల తర్వాత జాన్వీ కపూర్ విమర్శలు ఎదుర్కొంది. కానీ ఈసారి చాలా ముందుగానే ట్రోల్స్ ను ఆమె ఎదుర్కోవాల్సి వస్తుంది.
రామ్ చరణ్ పెద్ది సినిమాలో జాన్వీ కపూర్..
జాన్వీ కపూర్ పదే పదే ఇలాంటి విమర్శలు ఎదుర్కోవడం అభిమానులకు నిరుత్సాహంను కలిగిస్తుంది. ఇప్పటి వరకు బాలీవుడ్‌లో జాన్వీ కి కమర్షియల్ హిట్ లేదు. అందుకే ఇలాంటి సందర్భాల్లో ఆమెను రెగ్యులర్ ఆడియన్స్ సైతం కార్నర్ చేసే విధంగా మాట్లాడుతున్నారు అనే అభిప్రాయంను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. జాన్వీ కపూర్ గత చిత్రం పరమ్ సుందరిలో ఎంతో అందంగా కనిపించింది, నటన విషయంలోనూ పాజిటివ్ మార్కులు పడొచ్చు. ఇక రెయిన్ డాన్స్ లో తన పూర్తి ఎఫర్ట్ పెట్టింది. అయినా కూడా ఆమెను విమర్శించారు. ఇప్పుడు ఈ సినిమాకు విమర్శలు చేస్తున్నారు. అందుకే చాలా మంది పాపం జాన్వీ కపూర్ అంటూ తమ మద్దతు తెలుపుతున్నారు. హిందీలో హిట్ పడకున్నా కనీసం రామ్ చరణ్ తో చేస్తున్న పెద్ది సినిమా అయినా జాన్వీకి కమర్షియల్‌గా బిగ్ బ్రేక్‌ను ఇస్తుందా అనేది చూడాలి.
