Begin typing your search above and press return to search.

త‌ప్పిపోతే నా ప్రియుడికి అప్ప‌జెప్పండి ప్లీజ్!

ప్రస్తుత తరం తారలు తమ సంబంధాలను నేరుగా ప్ర‌క‌టించ‌క‌పోయినా? వినూత్న మార్గాల్లో మనసులోని భావాలను వ్యక్తపరిచి అభిమా నులను ఆశ్చర్యపరుస్తున్నారు.

By:  Srikanth Kontham   |   22 Jun 2026 9:42 AM IST
త‌ప్పిపోతే  నా ప్రియుడికి అప్ప‌జెప్పండి ప్లీజ్!
X

సెలబ్రిటీల ప్రేమాయణాలు.. వారి డేటింగ్ వ్యవహారాలు నిరంతరం వార్తల్లో నిలుస్తుంటాయి. ప్రస్తుత తరం తారలు తమ సంబంధాలను నేరుగా ప్ర‌క‌టించ‌క‌పోయినా? వినూత్న మార్గాల్లో మనసులోని భావాలను వ్యక్తపరిచి అభిమా నులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ సరికొత్త శైలితో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

సోషల్ మీడియా వేదికగా జాన్వీ కపూర్ నైట్ దుస్తుల్లో ఉన్న ఓ పిక్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. అందులో ఆమె ధరించిన నైట్‌సూట్ అందరినీ ఆకట్టుకుంటుంది. గులాబీ రంగు నైట్‌సూట్‌పై గ్రే కలర్ జాకెట్ ధ‌రించిన అమ్మ‌డు ఆ దుస్తులపై చమత్కారమైన సందేశాన్ని ముద్రించుకుంది.

`ఒకవేళ నేను తప్పిపోతే దయచేసి శిఖర్ పహారియాకు అప్పగించండి` అని రాసి ఉన్న ఆ టెక్స్ట్ ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రియుడు శిఖర్ పహారియాపై ఉన్న ప్రేమను జాన్వీ ఈ విధంగా వినోదాత్మకంగా ప్రద ర్శించడం పట్ల అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక‌రు `ఎంతో ముద్దుగా ఉంది` అని కామెంట్ చేయగా.. మరికొందరు `రిలేషన్‌షిప్ గోల్స్` అంటూ అభినందిస్తున్నారు. జాన్వీ- శిఖర్ పహారియా కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

తమ బంధాన్ని వీరు అధికా రికంగా ఎక్కడా ప్రకటించనప్పటికీ పలు సందర్భాల్లో జోడీ ఇచ్చే హింట్లు విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గతంలో జాన్వీ మెడలో శిఖర్ అనే పేరున్న నెక్లెస్ ధరించి కనిపించగా.. శిఖర్ సైతం జాన్వీ నటించిన చిత్రాలను సోషల్ మీడియాలో ప్రశంసిస్తూ మద్దతుగా నిలిచారు. గత ఏడాది కేన్స్ చలనచిత్రోత్సవంలో జాన్వీ నటించిన హోమ్‌బౌండ్ ప్రీమియర్ సమయంలో కూడా శిఖ‌ర్ జాన్వీతో కలిసి సందడి చేసిన సంగ‌తి తెలిసిందే. ఇలా జాన్వీ వ్యక్తిగత జీవితంలో మధురమైన క్షణాలను ఆస్వాదిస్తూనే మరోవైపు కెరీర్‌లోనూ దూసుకుపోతోంది.

ఇటీవల రామ్ చరణ్ సరసన నటించిన `పెద్ది` సినిమాతో భారీ విజ‌యాన్ని అందుకుంది. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి జాన్వీ ఖాతాలో మరో మైలురాయిగా నిలిచింది. దీంతో జాన్వీ క‌పూర్ త‌దుప‌రి చిత్రంపై ఆస‌క్తి నెల‌కొంది. అయితే అమ్మ‌డు తెలుగు సినిమా చేస్తుందా? బాలీవుడ్ సినిమాల‌తో బిజీ అవుతుందా? అన్న‌ది చూడాలి. కొంత కాలంగా టాలీవుడ్ టార్గెట్ గానే సినిమాలు చేస్తోంది. ఈనేప‌థ్యంలో జాన్వీ త‌దుప‌రి తెలుగు హీరో ఎవ‌రవుతారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.