Begin typing your search above and press return to search.

పెద్ది రిలీజ్.. తిరుమల శ్రీవారిని దర్శించిన జాన్వీ కపూర్.. లేటెస్ట్ లుక్ వైరల్!

సెలబ్రిటీలు తమ జీవితంలో ఏదైనా ప్రత్యేకమైన సందర్భం ఉందంటే కచ్చితంగా తమకు ఇష్టమైన దైవాన్ని ఆరాధిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే దేవాలయాలను సందర్శిస్తూ ఉంటారు.

By:  Madhu Reddy   |   4 Jun 2026 1:13 PM IST
పెద్ది రిలీజ్.. తిరుమల శ్రీవారిని దర్శించిన జాన్వీ కపూర్.. లేటెస్ట్ లుక్ వైరల్!
X

సెలబ్రిటీలు తమ జీవితంలో ఏదైనా ప్రత్యేకమైన సందర్భం ఉందంటే కచ్చితంగా తమకు ఇష్టమైన దైవాన్ని ఆరాధిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే దేవాలయాలను సందర్శిస్తూ ఉంటారు. అలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించి స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో బ్యూటీ తిరుమలలో సందడి చేసింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. నేడు ఆమె నటించిన పెద్ది సినిమా విడుదల కావడంతో సినిమా పెద్ద సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ.. కుటుంబంతో కలిసి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అమ్మడి లేటెస్ట్ లుక్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.

పెద్ది విడుదల..

అసలు విషయంలోకి వెళ్తే .. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన చిత్రం పెద్ది. శివ రాజ్ కుమార్ , జగపతిబాబు , దివ్యేందు శర్మ తదితరులు కీలకపాత్రను పోషించిన ఈ సినిమా నిన్న రాత్రి ప్రీమియర్ షో లతో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది.. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది.

శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్..

అలాంటి ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవాలని స్వామివారిని కోరుకోవడానికి జాన్వీ కపూర్ తిరుపతి వెళ్ళినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ అందర్నీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. ఆమె కాలినడకన స్వామి వారిని చేరుకుంది. అలిపిరి మెట్ల మార్గంలో నడుచుకుంటూ తిరుమలకు చేరుకుంది .మొత్తం 3,550 మెట్లు ఎక్కి స్వామి వారిపై తనకున్న భక్తిని చాటుకుంది. ముఖ్యంగా మెట్ల మార్గంలో జాన్వీ కపూర్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ సమయంలో ఆమె సాధారణ గులాబీ రంగు ఎత్నిక్ సూట్ ధరించి కనిపించింది.

పట్టు వస్త్రాలలో సంప్రదాయంగా..

తిరుమల చేరుకున్న జాన్వీ కపూర్ స్వామివారి దర్శనం అనంతరం బయటకు వచ్చింది. ఇక ఈమె లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అందులో సాంప్రదాయంగా పర్పుల్ కలర్ పట్టు చీరలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా నడుముకు వడ్డానం పెట్టుకొని మెడకు చౌకర్ ధరించి తన అందాలను రెట్టింపు చేసుకుంది. మొత్తానికి అయితే జాన్వి కపూర్ లేటెస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.

సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన మహేశ్వరి..

ఇకపోతే ఇక్కడ జాన్వి కపూర్ మాత్రమే కాదు ఆమె కుటుంబ సభ్యులు, ప్రముఖ హీరోయిన్ మహేశ్వరి కూడా జాన్వికపూర్ తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. చాలా రోజుల తర్వాత మహేశ్వరి కూడా మీడియా కంట పడడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే జాన్వీ కపూర్ శ్రీవారిని దర్శించుకోవడం ఇదేమి మొదటిసారి కాదు.. ఆమె తల్లి పుట్టిన రోజు, అలాగే ఆమె పుట్టినరోజు సందర్భంగా కూడా తిరుమల శ్రీవారిని దర్శిస్తూ ఉంటుంది. మొత్తానికైతే జాన్వీ కపూర్ కోరిక నెరవేరాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.