ఫోటో స్టోరి: కుందనపు బొమ్మ జాన్వీ
బికినీలు మోనోకినీలు స్విమ్ సూట్లు.. ఎంపిక ఏదైనా శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ బో*ల్డ్ గ్లామ్ లుక్స్ కి ఇప్పటికే భారీ ఫాలోయింగ్ ఏర్పడింది.
By: Sivaji Kontham | 12 Aug 2025 9:33 AM ISTబికినీలు మోనోకినీలు స్విమ్ సూట్లు.. ఎంపిక ఏదైనా శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ బో*ల్డ్ గ్లామ్ లుక్స్ కి ఇప్పటికే భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకు భిన్నంగా సాంప్రదాయ చీరకట్టులో కనిపించినా జాన్వీ కపూర్ ప్రత్యేకతే వేరు అని ప్రూవ్ అయింది. అలాంటి ఒక ప్రత్యేకత తాజాగా జాన్వీ షేర్ చేసిన ట్రెడిషనల్ శారీ లుక్ లో కనిపించింది.
షైనీ గోల్డ్ అండ్ పింక్ డిజైనర్ శారీ, దానికి కాంబినేషన్ క్రిస్టలైన్ డిజైనర్ బ్లౌజ్ లో జాన్వీ కపూర్ ఎంతో అందంగా కనిపించింది. ఎంపిక చేసుకున్న డిజైనర్ దుస్తులకు మ్యాచింగ్ గా మెడలో అందమైన ఆభరణం, నడుముకు వడ్డాణం.. ఆ చెవులకు లోలాకులు ప్రతిదీ జాన్వీ అందాన్ని పదింతలు పెంచాయి అంటే అతిశయోక్తి లేదు.
ముఖ్యంగా జాన్వీ ఎంపిక చేసుకున్న డిజైనర్ బ్లౌజ్ ని ముత్యాలతో బ్యాక్ లెస్ లుక్ లో రూపొందించిన తీరు ఆకట్టుకుంది. బంగారు రంగు ధగధగల బ్లౌజ్ ని ముత్యాలు రత్నాలతో అలంకరించిన తీరు, దాని కోసం జాన్వీ లాంటి యంగ్ ఎనర్జిటిక్ బ్యూటీని ఎంపిక చేసుకోవడం పర్ఫెక్ట్ యాప్ట్ అన్న ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈ అందమైన ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. జాన్వీ ఈ కొత్త లుక్ లో కుందనపు బొమ్మను తలపిస్తోంది అంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇది ఈ పెళ్లిళ్ల సీజన్ లో వధువులను ఆకర్షించే పర్ఫెక్ట్ శారీ అండ్ డిజైనర్ లుక్ అనడంలో సందేహం లేదు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే, జాన్వీకపూర్ ప్రస్తుతం టాలీవుడ్ లో రామ్ చరణ్ సరసన `పెద్ది` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. పరమ్ సుందరి, సన్ని సంస్కారీ కి తులసీ కుమారి అనే రెండు హిందీ చిత్రాల్లోను నటిస్తోంది. పరమ్ సుందరిలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ఆడిపాడుతోంది. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. తమిళంలోను జాన్వీ ఎంట్రీ ఇస్తోందని కథనాలొస్తున్నాయి. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
