ట్రెడిషనల్ లుక్‌లో జాన్వీ కపూర్ మ్యాజిక్.. కలర్ ఫుల్ లెహంగాలో కళ్ళు చెదిరే అందం!
బాలీవుడ్ అండ్ టాలీవుడ్ బ్యూటీ, అలనాటి అతిలోక సుందరి శ్రీదేవి తనయ, జాన్వీ కపూర్ తాజాగా పంచుకున్న పండుగ ఫోటోలు నెట్టింట విపరీతంగా హల్‌చల్ చేస్తున్నాయి.
By: Madhu Reddy | 15 Sept 2026 3:58 PM ISTబాలీవుడ్ అండ్ టాలీవుడ్ బ్యూటీ, అలనాటి అతిలోక సుందరి శ్రీదేవి తనయ, జాన్వీ కపూర్ తాజాగా పంచుకున్న పండుగ ఫోటోలు నెట్టింట విపరీతంగా హల్‌చల్ చేస్తున్నాయి. వినాయక చవితి సందర్భంగా సాంప్రదాయ దుస్తుల్లో చందమామలా మెరిసిపోతూ ఆమె ఇచ్చిన పోజులు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే టాలీవుడ్‌లో 'పెద్ది' తో అలరించిన ఈ భామ, తాజాగా పంచుకున్న ఈ రాయల్ పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ నెటిజన్లను విపరీతంగా మైమరపిస్తున్నాయి.
కల్కి ఫ్యాషన్ లెహంగాలో దేవకన్యలా జాన్వీ :
తాజా ఫోటోషూట్ కోసం జాన్వీ కపూర్ 'కల్కి ఫ్యాషన్' కౌచర్ లైన్‌కు చెందిన మల్టీ-కలర్డ్ ఎంబ్రాయిడరీ లగ్జరీ లెహంగా చోలీని ఎంచుకుంది. ఈ అవుట్‌ఫిట్ ఆమెకు రాయల్ లుక్‌ని తెచ్చిపెట్టింది. ఇక డార్క్ పింక్ మజెంటా బేస్‌పై ఫ్లోరల్ డిజైన్లు, మ్యాచింగ్ దుపట్టాతో జాన్వీ ఎంతో ఎలిగెంట్‌గా కనిపించింది.
ట్రెడిషనల్ జ్యువెలరీ అండ్ క్యూట్ లుక్స్ :
ఈ సంప్రదాయ లెహంగాకు జతగా జాన్వీ హెవీ గోల్డ్ జుంకాలు, మ్యాచింగ్ పాపిడి బిళ్ళ, చేతులకు మెటాలిక్ గాజులు ధరించి నిండుగా కనిపించింది.ఇక పండుగ వాతావరణంలో అమాయకమైన చూపులతో ఆమె ఇచ్చిన పోజులు కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఇక ఈ క్యూట్ అండ్ సాంప్రదాయ పిక్స్‌కి నెటిజన్ల నుంచి లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది.
'దేవర', 'పెద్ది' విజయాలు.. సినిమాల ఎంపికపై కీలక నిర్ణయం :
'ధడక్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ, రీసెంట్‌గా ఎన్టీఆర్‌తో 'దేవర', రామ్ చరణ్‌తో 'పెద్ది' చిత్రాలతో సౌత్ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలు మంచి విజయం సాధించినప్పటికీ, నటిగా తన పాత్రలకు ఎక్కువ స్కోప్ దక్కలేదనే టాక్ నడిచింది. ఇక దీంతో ఇకపై కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కథలో తన క్యారెక్టర్ ప్రాధాన్యతను చూసుకున్నాకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని జాన్వీ డిసైడ్ అయినట్లు ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది.
కథానాయికగా కొత్త రూట్ లో పయనం :
స్టార్ హీరోల సినిమాలు ఎంత పెద్దవైనా, కథలో తన క్యారెక్టర్ బలంగా ఉంటేనే ప్రాజెక్ట్ ఒప్పుకోవాలని నిర్ణయించుకున్న జాన్వీ, నటిగా తనలోని విభిన్న కోణాలను చూపించేందుకు సిద్ధమవుతోంది. ఇక తన అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌తో పాటు నటనలోనూ కొత్త దారులు వెతుక్కుంటున్న జాన్వీ కపూర్, రాబోయే రోజుల్లో ఎలాంటి పాత్రలతో అలరిస్తుందో చూడాలి.
