టాలీవుడ్‌లో జాన్వీ కపూర్ కొత్త ఆఫర్ల పరిస్థితి ఏంటి?
‘దేవర’, ‘పెద్ది’ సినిమాల్లో పరిమిత స్క్రీన్ స్పేస్‌తో కనిపించిన జాన్వీ కపూర్‌కు టాలీవుడ్‌లో ఆశించిన గుర్తింపు దక్కలేదనే చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్–అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’లో ఆమె నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నా అధికారిక ప్రకటన లేదు. భారీ పారితోషికం కారణంగా తెలుగు నిర్మాతలు ఆమెను సంప్రదించేందుకు వెనుకాడుతున్నారనే ప్రచారం కూడా ఉంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిన నేపథ్యంలో కోలీవుడ్ ఎంట్రీపై జాన్వీ దృష్టి పెట్టే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
By: Ramesh Palla | 17 Nov 2026 1:00 AM ISTఅతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ ఆశించిన స్థాయిలో సక్సెస్‌లను దక్కించుకోలేక పోయింది. అయితే లక్‌తో పాటు అందం, అభినయంతో ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తోంది. ఈ ఏడాది రామ్ చరణ్‌తో కలిసి పెద్ది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. పెద్ది సినిమా సక్సెస్ అయినప్పటికీ సినిమాలోని ఆమె పాత్ర, స్క్రీన్ స్పేస్ విషయంలో విమర్శలు ఎదుర్కొంది. ఇలాంటి పాత్రలకు జాన్వీ కపూర్ ఎలా ఒప్పుకుంటుంది అంటూ చాలా మంది విమర్శిస్తున్నారు. ఇంతకు ముందు నటిగా తనను తాను నిరూపించుకున్న జాన్వీ కపూర్ ఎందుకు కమర్షియల్ పాత్రలు ఎక్కువ చేస్తుందంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌లో చేసిన దేవర, పెద్ది సినిమాల్లో జాన్వీ కపూర్ కనిపించింది కొద్ది సమయం కావడంతో తెలుగు ప్రేక్షకులు ఆమె నుంచి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్‌ను కోరుకుంటున్నారు.
అల్లు అర్జున్ రాకా సినిమాలో జాన్వీ కపూర్...
అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాకా' సినిమాలో జాన్వీ కపూర్ కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాలేదు, కానీ జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం కన్ఫర్మ్ అని ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. ఇప్పటికే రాకా సినిమాలో దీపికా పదుకునే, మృణాల్ ఠాకూర్‌తో పాటు మరో హీరోయిన్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. జాన్వీ కపూర్ కూడా రాకా లో ఉంటే ఆమె పాత్ర ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రాకా పై అంచనాలు భారీగా ఉన్నాయి. కనుక సినిమాలో చిన్న పాత్ర అయినా కచ్చితంగా జాన్వీ కపూర్ కెరీర్ కి ప్లస్ అవుతుంది అనేది కొందరి మాట. మొత్తానికి రాకా సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను జాన్వీ కపూర్ పలకరించేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా కాకుండా హిందీలో రెండు సినిమాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.
పెద్ది సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా...
జాన్వీ కపూర్ గత ఏడాది వరకు వరుస సినిమాల్లో నటించింది. ఏడాదిలో జాన్వీ కపూర్ నటించిన రెండు మూడు సినిమాలు విడుదల కావడం మనం చూశాం. కానీ ఈ ఏడాదిలో పెద్ది సినిమా తప్ప మరే సినిమాలోనూ జాన్వీ కపూర్ కనిపించలేదు. జాన్వీ కపూర్ వచ్చే ఏడాదిలో రెండు సినిమాలతో వచ్చే అవకాశం ఉందని ఆమె అభిమానులు నమ్మకంతో ఉన్నారు. కానీ పరిస్థితులు చూస్తూ ఉంటే రాకా సినిమా కాకుండా జాన్వీ కపూర్ మరే సినిమాతోనూ వచ్చే పరిస్థితి లేనట్లే అనిపిస్తోంది. రాకా సినిమాలోనూ హీరోయిన్ పాత్ర కాకపోవడంతో ఆమె ఫ్యాన్స్‌కి నిరాశ తప్పదని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేవర సినిమాకు ముందు వరకు జాన్వీ కపూర్‌తో నటించేందుకు చాలా మంది టాలీవుడ్ హీరోలు, ముఖ్యంగా యంగ్ స్టార్ హీరోలు ఆసక్తి చూపించారు. దేవర, పెద్ది సినిమాల తర్వాత జాన్వీ కపూర్‌ను టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు అనిపిస్తోంది.
టాలీవుడ్, కోలీవుడ్‌లో జాన్వీ కపూర్...
పెద్ది, దేవర సినిమాలకు జాన్వీ కపూర్ భారీ పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. రెండు సినిమాల్లోనూ చిన్న పాత్రలే అయినా ఆమెకు దక్కిన పారితోషికం పెద్దది కావడంతో ఇప్పుడు అదే స్థాయిలో తెలుగు ఫిల్మ్ మేకర్స్ నుంచి జాన్వీ కపూర్ పారితోషికం డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే జాన్వీ కపూర్‌ను సంప్రదించాలన్నా కాస్త భయంగా ఉందని తెలుగు నిర్మాతలు కొందరు మాట్లాడుతున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం ఉంది. బాలీవుడ్‌లో తక్కువ పారితోషికంకు నటించే జాన్వీ కపూర్ సౌత్ సినిమాలకు భారీగా డిమాండ్ చేయడం ఏంటని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. టాలీవుడ్ నుంచి ప్రస్తుతానికి ఆఫర్లు ఏమీ లేని కారణంగా కోలీవుడ్ నుంచి వచ్చే ఆఫర్లకు అయినా ఈమె ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి. గతంలో తమిళ్ సినిమాల్లోనూ నటించాలని ఉందని జాన్వీ చెప్పింది. కనుక ఈ సమయంలో కోలీవుడ్‌లో జాన్వీ కపూర్ ఎంట్రీ ఇవ్వడం మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
