జాన్వి ఆశలన్నీ దాని మీదే..!
శ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్ ఇప్పటికే బాలీవుడ్ లో తన హవా కొనసాగిస్తుంది. ఐతే తన తల్లి లానే సౌత్ లో కూడా తన సత్తా చాటాలని చూస్తుంది అమ్మడు.
By: Ramesh Boddu | 17 Aug 2025 2:00 PM ISTశ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్ ఇప్పటికే బాలీవుడ్ లో తన హవా కొనసాగిస్తుంది. ఐతే తన తల్లి లానే సౌత్ లో కూడా తన సత్తా చాటాలని చూస్తుంది అమ్మడు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వి. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆ సినిమాలో జాన్వి కపూర్ తంగం పాత్రలో నటించింది. సినిమాలో ఆమెకు ఉన్నవి చాలా తక్కువ సీన్స్. అందులోనే ఆమె గ్లామర్ షో తో మెప్పించింది. దేవర 1 కాదు దేవర 2 లో ఆమెకు మంచి స్కోప్ ఉందని టాక్.
దేవర 2 క్యాన్సిల్..
ఐతే ఇప్పుడు పరిస్తితి చూస్తుంటే దేవర 2 దాదాపు క్యాన్సిల్ చేశారనే అంటున్నారు. దేవర 1 రిజల్ట్ కూడా ఆశించిన స్థాయిలో లేదు కాబట్టి దేవర 2 దాదాపు అటకెక్కించారని తెలుస్తుంది. ఐతే దేవర 2 మీద చాలా హోప్స్ పెట్టుకుంది జాన్వి. ఇప్పుడు అది క్యాన్సిల్ అయ్యింది. ఇక ప్రస్తుతం అమ్మడు చరణ్ తో పెద్ది సినిమా చేస్తుంది. ప్రస్తుతం ఆమెకున్న ఆప్షన్ అదొక్కటే.
బుచ్చి బాబు సన డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. దేవర తో టాలీవుడ్ లో స్టార్ రేంజ్ కి వెళ్లాలని అనుకున్న జాన్వి ఆశలు నెరవేరలేదు. అందుకే నెక్స్ట్ చేస్తున్న పెద్ది సినిమా మీద అమ్మడు అంచనాలు పెట్టుకుంది. ఎలాగు బుచ్చి బాబు ఉప్పెనలో హీరోయిన్ రోల్ ని బాగా రాసుకున్నాడు. పెద్ది కమర్షియల్ సినిమా అయినా కూడా జాన్వికి తగిన ప్రాధాన్యత ఉంటుందట.
జాన్వి కపూర్ పెద్ది లక్కీ మూవీ..
సో జాన్వి కపూర్ పెద్దినే తన లక్కీ మూవీగా భావిస్తుంది. తెలుగులో పెద్ది తర్వాత ఇంకా చాలా ప్లాన్స్ తోనే ఉందట అమ్మడు. అటు తమిళ్ లో కూడా సినిమాలు చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఐతే తమిళ్ మేకర్స్ మాత్రం జాన్విని తీసుకోవట్లేదు. జాన్వి కపూర్ అటు బాలీవుడ్ లో కూడా మంచి రోల్స్ చేయాలని చూస్తుంది.
బీ టౌన్ ఆడియన్స్ ని తన గ్లామర్ తో ఆల్రెడీ బుట్టలో వేసుకున్న జాన్వి కపూర్ ఇక మీదట పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న రోల్స్ కూడా చేసి మెప్పించాలని చూస్తుంది. సౌత్ లో పెద్ది తర్వాత మళ్లీ వరుస ఛాన్స్ లు ఆశిస్తున్న అమ్మడు అటు నార్త్, సౌత్ అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకోవాలని చూస్తుంది.
