Begin typing your search above and press return to search.

జాన్వీ కపూర్ ని మళ్ళీ చూసేదీ ఎప్పుడో?

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ కి కాలం కలిసి రావడం లేదు. సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు 8 ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకు కమర్షియల్ హిట్ ను సొంతం చేసుకోలేక పోయింది.

By:  Ramesh Palla   |   3 July 2026 2:41 PM IST
జాన్వీ కపూర్ ని మళ్ళీ చూసేదీ ఎప్పుడో?
X

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ కి కాలం కలిసి రావడం లేదు. సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు 8 ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకు కమర్షియల్ హిట్ ను సొంతం చేసుకోలేక పోయింది. నటిగా నిరూపించుకుందాం అని చేసిన ప్రయత్నాలు సైతం నిరాశను మిగిల్చాయి. కమర్షియల్ పాత్రలు చేస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందాల ఆరబోతకు తప్ప జాన్వీ కపూర్ దేనికీ పనికి రావడం లేదు అంటూ చాలా మంది విమర్శిస్తున్నారు. ఆ మధ్య వచ్చిన దేవర సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర ఏంటి, ఆమె గురించి వచ్చిన కామెంట్స్ ఏంటో తెలిసిందే. ఆ తర్వాత బాలీవుడ్ నుంచి వచ్చిన సన్నీ సంస్కారి కి తులసి కుమారి సినిమా విషయమై జాన్వీ కపూర్ ఎదుర్కొన్న విమర్శల గురించి కూడా అందరికీ తెలిసిందే. తాజాగా పెద్ది సినిమా విషయంలోనూ జాన్వీ కపూర్ అదే విమర్శలు ఎదుర్కొంది.

జాన్వీ కపూర్ పెద్ది సినిమా వివాదం...

జాన్వీ కపూర్ పెద్ది సినిమాతో టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్ గా మారడం ఖాయం అని అంతా అనుకున్నారు. బుచ్చి బాబు సినిమాలో హీరోయిన్ కి మంచి ప్రాధాన్యత ఉంటుంది. కనుక పెద్ది తర్వాత జాన్వీ కపూర్ టాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు దక్కించుకోవడం కన్ఫర్మ్ అని అంతా భావించారు. కానీ పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర వివాదాస్పదం అయింది. దాంతో చాలా సీన్స్ తగ్గించారు. సినిమాలో జాన్వీ స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ ఉంది. వివాదాస్పద సీన్స్ కట్ చేయడంతో అసలు జాన్వీ ఉందా? లేదా? అన్నట్లుగా పరిస్థితి మారిందని ప్రేక్షకులు అంటున్నారు. పెద్ది సినిమా ఫలితంతో సంబంధం లేకుండా జాన్వీ కపూర్ కి వరుస ఆఫర్లు వస్తాయని అంతా భావించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జాన్వీ కపూర్ తో వర్క్ చేయడానికి టాలీవుడ్ హీరోలు ఆసక్తి కనబర్చడం లేదట.

ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాల్లో...

బాలీవుడ్ లో జాన్వీ కపూర్ గత ఆరు ఏడు ఏళ్లుగా చాలా సినిమాలు చేసింది. కానీ వాటిల్లో ఏ ఒక్కటి హిట్ కాలేదు. హీరోలకు జోడీగా నటించిన సినిమాలు, ఆమె లేడీ ఓరియంటెడ్ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయినా కూడా టాలీవుడ్లో శ్రీదేవికి ఉన్న ఫాలోయింగ్ కారణంగా జాన్వీ కపూర్ కి ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్స్ తో నటించే అవకాశం దక్కింది. కానీ ఆ రెండు సినిమాలు సైతం హిందీ సినిమాల మాదిరిగా నిరాశ ను మిగల్చడంతో జాన్వీ కపూర్ కి అక్కడ, ఇక్కడ దారులు మూసుకు పోయినట్లే అనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్లో జాన్వీ అడుగు పెట్టక ముందు తెలుగు నిర్మాతలు భారీ పారితోషికం ఆఫర్ చేసి మరీ తమ సినిమాల్లో నటింపజేసేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. అసలు జాన్వీ కపూర్ ను తమ సినిమాల్లో అవసరమా అన్నట్లు నిర్మాతలు ఆలోచిస్తున్నారట.

బాలీవుడ్ సినిమాలో జాన్వీ కపూర్..

జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్లో ఒక వెబ్ సిరీస్ చేసేందుకు గాను రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో ఒక హిందీ సినిమా సైతం సైన్ చేసిందని, త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ తెలుగులో మాత్రం జాన్వీ కపూర్ కి కొత్త ఆఫర్ ఒక్కటి కూడా తలుపు తట్టిన దాఖలాలు లేవు. జాన్వీ కపూర్ విషయంలో బాలీవుడ్ నిర్మాతలు ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ టాలీవుడ్ నిర్మాతలు మాత్రం కేవలం రెండు సినిమాలకే బాబోయ్ నీకో దండం తల్లి అన్నట్లుగా దూరం జరుగుతున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో జాన్వీ కపూర్ కనిపించాలి అంటే కచ్చితంగా బాలీవుడ్లో కనీసం ఒకటి రెండు అయినా హిట్స్ పడాల్సిందే. మరి జాన్వీ కి అక్కడ హిట్ పడేది ఎప్పుడో... టాలీవుడ్లో మళ్లీ ప్రేక్షకులు చూసేది ఎప్పుడో కాలమే నిర్ణయించాలి.