Begin typing your search above and press return to search.

అందాల 'జాన్వీ'.. తెలుగులో సరైన ఛాన్స్ పడితే..

కానీ నటిగా తన టాలెంట్ ప్రూవ్ చేసుకునే విషయంలో మాత్రం ఆమె ఇంకా వెయిటింగ్ స్టేజ్ లో ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

By:  M Prashanth   |   10 Jun 2026 2:00 PM IST
అందాల జాన్వీ.. తెలుగులో సరైన ఛాన్స్ పడితే..
X

స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కోసం ఎంతో మంది హీరోయిన్లు ఎదురుచూస్తుంటారు. కానీ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ కు మాత్రం టాలీవుడ్‌ లో తొలి రెండు ఛాన్సులు ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల పక్కన దక్కాయి. కెరీర్ పరంగా చూస్తే ఇది మంచి స్టార్టింగే. కానీ నటిగా తన టాలెంట్ ప్రూవ్ చేసుకునే విషయంలో మాత్రం ఆమె ఇంకా వెయిటింగ్ స్టేజ్ లో ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

దివంగత అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌ లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ట్రై చేస్తున్నారు. హిందీలో విభిన్నమైన కథలు, ఎమోషన్స్ కు ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ చేస్తూ నటిగా తన యాక్టింగ్ తో మంచి మార్కులు సంపాదించారు. అదే సమయంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా వరుస క్రేజీ ప్రాజెక్టులతో వచ్చారు.

ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవరతో జాన్వీ టాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రంలో ఆమె తంగం పాత్రలో కనిపించారు. అయితే ఆ రోల్ లో కథలో ఆశించిన స్థాయిలో ఇంపార్టెన్స్ లేకపోవడంతో, జాన్వీ యాక్టింగ్ ను కంప్లీట్ రేంజ్ లో చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కలేదు. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన పెద్దిలో ఆమె అచ్చియమ్మ రోల్ చేశారు.

ఆ సినిమాపై కూడా అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ విడుదల తర్వాత మరోసారి జాన్వీ పాత్ర గురించే చర్చ మొదలైంది. యాక్టింగ్ కు పెద్ద స్కోప్ లేకుండా, గ్లామర్‌ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనే విమర్శలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీంతో జాన్వీ రోల్స్ సెలక్షన్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు స్టార్ హీరోల సినిమాల్లో భాగమవ్వడం కూడా పెద్ద విజయమేనని చెబుతుంటే, మరికొందరు మాత్రం ఆమె తన యాక్టింగ్ ను చూపించే పాత్రలను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు.

వరుసగా రెండు తెలుగు చిత్రాల్లోనూ పూర్తి స్థాయి పాత్రలు దక్కకపోవడం అభిమానులను కొంత నిరాశకు గురి చేసింది. అయితే దీనిని పూర్తిగా జాన్వీ నిర్ణయాల వల్లే జరిగిందని అనుకోకూడదని పలువురు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే హిందీలో ఆమె ఇప్పటికే పలు విభిన్న పాత్రలు చేసి తన స్టామినా ప్రూవ్ చేసుకున్నారు. రోల్ కోసం కష్టపడే యాక్ట్రెస్ గా అనే పేరు కూడా సంపాదించారు.

అయితే ఇప్పుడు పెద్ది తర్వాత జాన్వీ ఇక తెలుగు సినిమాలకు దూరమవుతారనే ప్రచారం జరుగుతోంది. కానీ అది నిజమని ఇప్పుడు తేల్చేయలేం. స్ట్రాంగ్ కథ, యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్ర దొరికితే ఆమె మరో తెలుగు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా అసలు సమస్య జాన్వీలో కాదు.. ఆమెకు దక్కిన పాత్రల్లోనే ఉందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అందం మాత్రమే కాదు, అభినయం కూడా తన బలం అని ప్రూవ్ చేసే అవకాశం టాలీవుడ్ ఆమెకు ఇంకా ఇవ్వాల్సి ఉంది. సరైన దర్శకుడు చేతిలో, స్ట్రాంగ్ రోల్ దొరికితే జాన్వీ మరో యాంగిల్ ను తెలుగు ప్రేక్షకులు చూసే రోజు త్వరలోనే ఉండొచ్చు.