వీడియో: వైట్ టాప్‌లో మతులు పోగొట్టిన జాన్వీ
ప్రస్తుతం జాన్వీ కపూర్ యూనిక్ వీడియో ఇంటర్నెట్ లో వైరల్‌గా షేర్ అవుతోంది. ముఖ్యంగా జాన్వీ ఫ్యాషన్ సెన్స్ పరంగా రోజురోజుకు కొత్తదనంతో షైన్ అవుతోందని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
By: Sivaji Kontham | 17 Aug 2025 4:40 PM ISTనెలవంకను తలపించే లేగకళ్లు.. అందంగా విరబోసిన శిరోజాలు.. గాలికి ఊగిసలాడే భారీ చెవి లోలాకులు.. వైట్ కలర్ టైట్ టాప్, కాంబినేషన్ ఫ్లోరల్ పరికిణీ,.. ఈ వేషధారణ ఎవరిది? అని అనుకుంటున్నారా? నిస్సందేహంగా అది జాన్వీకపూర్. పబ్లిక్ లో ఇంత అందంగా తనను తాను ప్రెజెంట్ చేసుకునే స్కిల్ జాన్వీకి మాత్రమే ఉంది. అతిలోక సుందరి నటవారసురాలు అలా నవ్వులు చిందిస్తూ ఫోటోగ్రాఫర్లకు హాయ్ చెబుతూ లేదా శిరోజాలను అందంగా సవరిస్తూ, ఎంత ముచ్చటగా కనిపిస్తోంది.
ప్రస్తుతం జాన్వీ కపూర్ యూనిక్ వీడియో ఇంటర్నెట్ లో వైరల్‌గా షేర్ అవుతోంది. ముఖ్యంగా జాన్వీ ఫ్యాషన్ సెన్స్ పరంగా రోజురోజుకు కొత్తదనంతో షైన్ అవుతోందని అభిమానులు ప్రశంసిస్తున్నారు. జెన్ జెడ్ కిడ్స్ లో జాన్వీ ఫ్యాషన్ సెన్స్ యూనిక్ గా ఉంటుందని కొందరు కీర్తించారు. పబ్లిక్ అటెన్షన్ తనవైపు తిప్పేసుకోవడంలో జాన్వీని మించిన వారే లేరు! అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... జాన్వీకపూర్ తదుపరి రామ్ చరణ్ `పెద్ది`లో నటిస్తోంది. ఉప్పెన ఫేం బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే జాన్వీ బ్యాక్ టు బ్యాక్ సినిమా అవకాశాలు వచ్చినా ప్రస్తుతానికి అడపాదడపా మాత్రమే హిందీలో నటిస్తోంది. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి పరమ్ సుందరి రిలీజ్ ప్రమోషన్స్ లో జాన్వీ బిజీ బిజీగా ఉంది. తన తాజా చిత్రం ప్రమోషన్స్ కోసం లక్నో బయల్దేరుతున్నప్పటి వీడియో ఇది. బాలీవుడ్ మీడియా వెంటపడి మరీ జన్వీని ఇంత అందంగా ప్రెజెంట్ చేసింది. స్టిల్ ఫోటోగ్రాఫర్లు లేదా వీడియో జర్నలిస్టులు వెంబడించి విసిగించినా కానీ, అది సెలబ్రిటీలను హైప్ చేయడం కోసం మాత్రమేననేది ఆలియా లాంటి ప్రముఖులు కాస్తయినా గ్రహించాలి. అప్పుడప్పుడు జరిగే తప్పులను క్షమించాలి.
