సహనటుడితో జాన్వీ సరసంగా.. ఆ చీర ప్రత్యేకతే అది!
అందమైన చీర రవికెలో హృదయాలను కొల్లగొట్టడంలో క్లాసిక్ డే నటీమణులకు ఉన్న ప్రత్యేకతే వేరు.
By: Sivaji Kontham | 23 Sept 2025 4:09 PM ISTఅందమైన చీర రవికెలో హృదయాలను కొల్లగొట్టడంలో క్లాసిక్ డే నటీమణులకు ఉన్న ప్రత్యేకతే వేరు. ఆ రోజుల్లో చీరకు ప్రాధాన్యత అధికం. చాలా మంది సీనియర్ నటీమణుల బాటలో శ్రీదేవి కూడా చీర ధరించి ఎక్కువగా వేదికలపై ప్రత్యేకంగా కనిపించేవారు. చీరలో శ్రీదేవి అందం, అభినయం గురించి ఎక్కువగా యువతరం వర్ణించడంలో బిజీగా ఉండేది.
ఇటీవల హోంబౌండ్ సినిమాను 2026 ఆస్కార్స్ లో ప్రమోట్ చేస్తున్న సమయంలో కొలీగ్ జిమ్ సరాఫ్ తో కలిసి కనిపించింది.. ఆ సమయంలో కళ్లన్నీ జాన్వీ కపూర్ ధరించిన నావీ బ్లూ శారీపైనే. చీరలో జాన్వీ ఎంతో మగ్ధ మనోహరంగా కనిపించింది.
అయితే ఈ చీరకు ఓ ప్రత్యేకత ఉంది. ఇద చీరలో జాన్వీ తల్లిగారైన శ్రీదేవి 2017లో విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ జంట విందు కార్యక్రమంలో కనిపించారు. ఇప్పుడు మళ్లీ ఆ చీరను ధరించి హోంబౌండ్ ఈవెంట్ కి రావడం ఆసక్తిని కలిగించింది. జాన్వీ కపూర్ వీలున్న ప్రతి వేదికపైనా మామ్ శ్రీదేవిని గుర్తు చేస్తూనే ఉంది. సందర్భానుసారం తన తల్లిగారిని స్ఫురణకు తెచ్చుకునేలా అభిమానులకు రిమైండ్ చేస్తోంది.
నీరజ్ ఘయ్వాన్ దర్శకత్వం వహించిన హోంబౌండ్ కి క్రిటిక్స్ నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ఆస్కార్ బరిలో ఈ చిత్రం అవార్డును కొల్లగొట్టాలని జాన్వీ అభిమానులు కోరుకుంటున్నారు. ఓ గ్రామానికి చెందిన ఇద్దరు బాల్య స్నేహితులు పోలీసులు కావాలని కలలు కంటారు. కానీ కులమతాల కారణంగా ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు? అనే సామాజిక ఇతివృత్తం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈనెల 26న ఈ చిత్రం విడుదల కానుంది.
