Begin typing your search above and press return to search.

జాన్వీ కపూర్‌ ఫ్యామిలీలో గొడవలు లేవు.. ఇదే సాక్ష్యం

కపూర్ వారి ఫ్యామిలీలో విభేదాలు అంటూ జాతీయ మీడియాలోనూ ప్రముఖంగా వార్తలు రావడంతో పాటు, జాన్వీ కపూర్‌ స్పందన కోసం అంతా ఎదురు చూస్తున్నారు. కాస్త ఆలస్యంగా పుకార్లకు చెక్‌ పెట్టారు.

By:  Ramesh Palla   |   4 Oct 2025 2:57 PM IST
జాన్వీ కపూర్‌ ఫ్యామిలీలో గొడవలు లేవు.. ఇదే సాక్ష్యం
X

తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల అభిమానం దక్కించుకున్న హీరోయిన్‌ శ్రీదేవి ఇప్పుడు లేకున్నా ఆమె వారసురాలు జాన్వీ కపూర్‌ ఆమె లేని లోటును భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. హిందీ సినిమా ఇండస్ట్రీలో కెరీర్‌ను ప్రారంభించిన ఈమె టాలీవుడ్‌లో దేవర సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇప్పుడు పెద్ది సినిమాలో రామ్‌ చరణ్‌ కు జోడీగా నటిస్తున్న విషయం తెల్సిందే. ఎప్పుడూ ఏదో ఒక సినిమాతో లేదా ఇన్‌స్టాలో షేర్‌ చేసే అందమైన ఫోటోల కారణంగా వార్తల్లో ఉండే జాన్వీ ఈసారి ఫ్యామిలీ విషయం కారణంగా వార్తల్లో నిలిచింది. కపూర్ వారి ఫ్యామిలీలో విభేదాలు అంటూ జాతీయ మీడియాలోనూ ప్రముఖంగా వార్తలు రావడంతో పాటు, జాన్వీ కపూర్‌ స్పందన కోసం అంతా ఎదురు చూస్తున్నారు. కాస్త ఆలస్యంగా పుకార్లకు చెక్‌ పెట్టారు.

అన్షులా కపూర్‌, రోషన్‌ థక్కర్‌ల వివాహ నిశ్చితార్థం

జాన్వీ కపూర్‌ సవతి సోదరి అన్షులా కపూర్‌ వివాహ నిశ్చితార్థం ఇటీవల ముంబైలోని బోనీ కపూర్‌ నివాసంలో జరిగింది. అతి కొద్ది మంది అతిథులు హాజరు అయిన ఈ కార్యక్రమంకు మీడియా వారికి ఆహ్వానం లేదు. సోషల్‌ మీడియాలో అన్షులా కపూర్‌, రోహన్‌ థక్కర్‌ల వివాహ నిశ్చితార్థంకు సంబంధించిన ఫోటోలు వైరల్‌ అయ్యాయి. కానీ ఆ ఫోటోల్లో జాన్వీ కపూర్‌, ఖుషి కపూర్ కనిపించక పోవడంతో రచ్చ మొదలైంది. ఆ ఇద్దరు సోదరీమణులు ఆ నిశ్చితార్థంకు వెళ్లకుండా ఎక్కడకు వెళ్లారు అంటూ బాలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం మొదలైంది. వీరిద్దరూ ఇండియాలో లేకపోవడం వల్లే కార్యక్రమంకు హాజరు కాలేదేమో అని కొందరు మొదట ప్రచారం చేశారు, ఆ తర్వాత జాన్వీ, ఖుషి ముంబైలోనే ఉండి వివాహ నిశ్చితార్థం కు వెళ్లలేదు అంటూ కొందరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చేశారు. అసలు విషయం ఏంటంటే అన్షులా నిశ్చితార్థం కు జాన్వీ, ఖుషి ఇద్దరూ వెళ్లారు.

అన్షులాతో జాన్వీ కపూర్‌, ఖుషి కపూర్‌ ఫోటో వైరల్‌

సోషల్‌ మీడియాలో అన్షులా వివాహం గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో ఖుషి కపూర్‌ నుంచి క్లారిటీ వచ్చింది. అన్షులా వివాహ నిశ్చితార్థంకు తాము ఇద్దరం కలిసి వెళ్లాము అంటూ స్వయంగా ఖుషి కపూర్‌ ఈ ఫోటోలను షేర్ చేయడం ద్వారా పుకార్లకు చెక్‌ పెట్టింది. శ్రీదేవి మరణించినప్పటి నుంచి అన్షులా, అర్జున్‌ కపూర్‌లతో జాన్వీ కపూర్‌, ఖుషి కపూర్‌ సన్నిహితంగా కొనసాగుతున్నారు. పలు పార్టీలకు వెళ్లడం మాత్రమే కాకుండా, ఇంట్లో కార్యక్రమాలను కలిసి సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. తండ్రి బోనీ కపూర్‌తో కలిసి రెగ్యులర్‌గా ఏదో ఒక కార్యక్రమంలో అంతా పాల్గొంటున్నారు. అయినా అన్షులా నిశ్చితార్థంకు జాన్వీ, ఖుషి వెళ్లకుండా ఎలా ఉంటారని ఈ ఫోటో చూసిన వారు కామెంట్‌ చేస్తున్నారు.

రామ్‌ చరణ్ పెద్ది సినిమాలో జాన్వీ కపూర్‌

అన్షులా నిశ్చితార్థంకు హాజరు అయిన అతిథులు చాలా తక్కువ మంది. వారు షేర్‌ చేసిన ఫోటోల్లో జాన్వీ కపూర్‌, ఖుషి కపూర్‌ లేదు అనగానే చాలా మంది గొడవలు అంటూ ప్రచారం చేయడ మొదలు పెట్టారు. బాలీవుడ్‌కి చెందిన కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు సైతం ఈ విషయాన్ని ప్రచారం చేయడం విడ్డూరంగా అనిపించింది. మీడియాలో వస్తున్న పుకార్లకు చెక్‌ పెట్టేందుకు, తాము కలిసే ఉన్నాం అని సాక్ష్యంగా ఖుషి కపూర్‌ ఈ ఫోటోలను షేర్ చేసి ఉంటుంది అనేది కొందరి అభిప్రాయం. ఇదే సమయంలో జాన్వీ కపూర్‌ అభిమానులు ఎప్పుడు ఇలాగే ఫ్యామిలీ అంతా ఆనందంగా ఉండాలి అంటూ కోరుకుంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. జాన్వీ కపూర్‌ నటించిన సన్నీ సంస్కారికి తులసి కుమారి సినిమా విడుదల అయింది. త్వరలో రామ్‌ చరణ్‌ తో కలిసి నటిస్తున్న పెద్ది సినిమాతో జాన్వీ కపూర్‌ రాబోతున్న విషయం తెల్సిందే. మరో వైపు జాన్వీ కపూర్‌ సైతం బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ వస్తోంది.