Begin typing your search above and press return to search.

వీడియో : జాన్వీ మినీ స్కర్ట్‌తో గుండె జారి గల్లంతు..!

జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో అడుగు పెట్టి సంవత్సరాలు గడుస్తోంది. ఇప్పటి వరకు ఆమె నటించిన ఏ ఒక్క సినిమా కమర్షియల్‌గా భారీ విజయాన్ని సొంతం చేసుకోలేదు.

By:  Ramesh Palla   |   28 Aug 2025 10:00 PM IST
వీడియో : జాన్వీ మినీ స్కర్ట్‌తో గుండె జారి గల్లంతు..!
X

జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో అడుగు పెట్టి సంవత్సరాలు గడుస్తోంది. ఇప్పటి వరకు ఆమె నటించిన ఏ ఒక్క సినిమా కమర్షియల్‌గా భారీ విజయాన్ని సొంతం చేసుకోలేదు. వందల కోట్ల వసూళ్లు సాధించిన సినిమాలు కూడా లేవు. హిందీలో ఈమె చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతూనే ఉన్నాయి. ఇటీవల కూడా ఈమె నటించిన హోమ్‌ బౌండ్‌ సినిమా సైతం ఆశించిన స్థాయిలో అలరించలేదు. సాధారణంగా హీరోయిన్స్ వరుస సినిమాలతో ఫ్లాప్‌ ను చవిచూస్తే కెరీర్‌ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. జాన్వీ కపూర్‌ మాత్రం ఇన్నాళ్లుగా ఫ్లాప్స్ పడుతున్నా కెరీర్‌లో ముందుకు సాగుతూనే ఉంది. బాలీవుడ్‌లో ఏడాదికి కనీసం ఒకటి రెండు సినిమాల చొప్పున విడుదల చేస్తూ వస్తుంది. ఇదే సమయంలో టాలీవుడ్‌లో దేవర సినిమాలో నటించింది, ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా వెంటనే పెద్ది సినిమాలోనూ ఎంపిక అయింది. రామ్‌ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ సినిమాలో జాన్వీ నటించడం చాలా స్పెషల్‌గా చెప్పుకోవచ్చు.


సోషల్‌ మీడియాలో జాన్వీ కపూర్‌ అందాల ఆరబోత

శ్రీదేవి నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు, గౌరవం దక్కించుకోవడం ద్వారా జాన్వీ కపూర్‌ ఇండస్ట్రీలో ఉండగలుగుతుంది. సినిమాలు హిట్ కాకున్నా జాన్వీ కపూర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే అందమైన ఫోటోలు, వీడియోల కారణంగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తద్వార జాన్వీ కపూర్‌ కు ఎప్పటికప్పుడు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఇండస్ట్రీలో చాలా మంది నటన ప్రతిభ, అదృష్టం, సినిమాలు హిట్ కావడం వల్ల వరుస సినిమాలు చేస్తున్నారు, కానీ జాన్వీ కపూర్‌ మాత్రం సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా పాపులారిటీ దక్కించుకుని సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఈ విషయాన్ని ఆమె ఫ్యాన్స్‌ కూడా చాలా మంది ఒప్పుకుంటారు. జాన్వీ కపూర్‌ హిట్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది.


మినీ స్కర్ట్‌ లో జాన్వీ కపూర్‌ అందం

తాజాగా జాన్వీ కపూర్ మరో వీడియో నెట్టింట వైరల్‌ అయింది. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో జాన్వీ కపూర్‌ ఇలా పొట్టి డ్రెస్‌లో కనిపించింది. వైట్‌ కలర్‌ టీ షర్ట్‌ ధరించి, నడుము కొంత కనిపించే విధంగా చేసి, ఆరెంజ్ కలర్‌ మినీ స్కర్ట్‌ ధరించింది. విభిన్నమైన ఆ మినీ స్కర్ట్‌ వద్ద సన్నని వడ్డానంను సైతం పెట్టడంతో జాన్వీ కపూర్‌ చూపు తిప్పనివ్వడం లేదు. జాన్వీ కపూర్‌ ఇంత అందంగా ఉండటం వల్లే ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి అంటున్నారు. ఇప్పటికే జాన్వీ కపూర్‌ తన అందంతో స్టార్‌ హీరోయిన్స్‌కి పోటీగా నిలిచింది. ఇప్పుడు ఆమె మరింత అందంగా కనిపిస్తుందని, సినిమాల్లో హిట్స్ పడితే ముందు ముందు బాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌ హీరోయిన్స్‌ లో ముందు వరుసలో నిలిచినా ఆశ్చర్యం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.


పరమ్‌ సుందరి రెయిన్‌ సాంగ్‌

ప్రస్తుతం జాన్వీ కపూర్‌ పరమ్‌ సుందరి సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉంది. గత రెండు మూడు వారాలుగా పరమ్‌ సుందరి కోసం జాన్వీ కపూర్ ఎక్కని గడప లేదు, తొక్కని గడప లేదు అన్నట్లుగా ప్రమోషన్ చేస్తుంది. సిద్దార్థ్‌ మల్హోత్ర హీరోగా నటించిన పరమ్‌ సుందరి సినిమాకు ఇప్పటికే పాజిటివ్‌ బజ్ క్రియేట్‌ అయింది. పరమ్‌ సుందరి సినిమాలో ఉన్న భీగీ సారి పాట తో ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టి అటు మల్లింది. యూట్యూబ్‌ ను షేక్ చేసిన ఆ పాట వెండి తెరపై చూస్తామా అని ప్రేక్షకులు అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఆ పాట ఉందని తేలింది. ఆ పాట కారణంగా యూ/ఎ సర్టిఫికెట్‌ను ఇవ్వడం జరిగింది. ఆ పాట ఉంటే ఖచ్చితంగా మంచి ఓపెనింగ్స్ వస్తాయని అంతా విశ్వసిస్తున్నారు.