Begin typing your search above and press return to search.

జాన్వీ కపూర్.. అందంలో మరో మాయ

బాలీవుడ్‌లో తనదైన స్టైల్‌తో ఎదుగుతూ వస్తోన్న జాన్వీ కపూర్‌ తాజాగా రెడ్‌ బ్రైడల్‌ లుక్‌లో మెరిసింది.

By:  M Prashanth   |   7 Aug 2025 8:00 PM IST
జాన్వీ కపూర్.. అందంలో మరో మాయ
X

బాలీవుడ్‌లో తనదైన స్టైల్‌తో ఎదుగుతూ వస్తోన్న జాన్వీ కపూర్‌ తాజాగా రెడ్‌ బ్రైడల్‌ లుక్‌లో మెరిసింది. ప్రముఖ డిజైనర్ మసాబా రూపొందించిన ఈ లెహంగాలో జాన్వీ ఫోటోషూట్‌లో పాల్గొంది. ఎర్ర రంగు, గోల్డ్ ఎంబ్రాయిడరీతో కూడిన బ్రైడల్ లెహంగా, దీపం వంటి నెక్‌లైన్ కలిగిన బ్లౌజ్, పెద్ద స్కర్ట్‌ వోరు లుక్స్‌ను మరింత ప్రత్యేకంగా చూపించాయి. కవర్ చేసిన దుపట్టా, వేల్‌తో కవర్ చేసిన హెడ్‌పీస్ ఆమెను సంప్రదాయ రాజకుమారిలా మార్చేశాయి. ఒక్కో ఫోటోలో ఒక్కో యాంగిల్ లో కవర్ చేసిన పోజులు ఫ్యాషన్ ప్రేమికులను ఆకట్టుకున్నాయి.


జాన్వీ ఫోటోల్లో కనిపించే పర్సనాలిటీ, ఎక్స్‌ప్రెషన్స్‌లో ఒక కొత్తదనం ఉంది. ఆమె బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ, తన స్టైల్, ఫ్యాషన్ ఎంపికల్లో ట్రెండ్ సెట్ చేస్తూ వస్తోంది. తాజాగా వచ్చిన ఈ బ్రైడల్ లుక్‌ మాత్రం మరింత ఫ్రెష్‌గా, రాయల్‌గా కనిపించింది. మెరిసే దుపట్టా, గ్లోని మేకప్, సింపుల్ జ్యూవెలరీతో, సంప్రదాయాన్ని ఆధునికతతో మేళవిస్తూ తన అందాన్ని హైలైట్ చేసింది.


ఇక కెరీర్ విషయానికి వస్తే, జాన్వీ 2018లో 'ధడక్' చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత కొన్ని బాలీవుడ్‌ సినిమాల్లో నటించి, తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. గతంలో కొన్ని హిట్స్, కొన్ని ఫ్లాప్స్ ఎదురైనా, తన శైలిని మాత్రం ఎప్పుడూ మార్చుకోలేదు. ఫ్యాషన్‌లోనూ, సినిమాల్లోనూ ప్రయోగాలు చేయడంలో ముందుంటుంది.


ప్రస్తుతం జాన్వీ టాలీవుడ్‌లో కూడా బిజీ అవుతోంది. రామ్‌చరణ్‌తో కలిసి 'పెద్ది' చిత్రంలో నటిస్తోంది. అలాగే సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి 'పరమ్ సుందరి' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్స్‌తో పాటు మరికొన్ని బాలీవుడ్ సినిమాలు కూడా జాన్వీ చేతిలో ఉన్నాయి. ఇక ఈ ఫోటోషూట్ ద్వారా జాన్వీ మరోసారి తన మల్టీ డైమెన్షనల్ స్టైల్, గ్లామర్‌తో అభిమానుల మనసు దోచుకుంది.