Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : పచ్చదనంతో అందాల జాన్వీ పులకింపు

సోషల్‌ మీడియాలో జాన్వీ కపూర్‌ రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో ఆమె నుంచి వచ్చిన ప్రతి ఫోటో షూట్‌ వైరల్‌ అవుతోంది.

By:  Ramesh Palla   |   28 Aug 2025 3:29 PM IST
పిక్‌టాక్‌ : పచ్చదనంతో అందాల జాన్వీ పులకింపు
X

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌. తల్లి శ్రీదేవి మరణంకు ముందే జాన్వీ కపూర్‌ మొదటి సినిమా ప్రారంభం అయింది. కానీ జాన్వీ నటించిన మొదటి సినిమా 'ధడక్‌' విడుదలకు ముందే శ్రీదేవి చనిపోయింది. హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌కి కమర్షియల్‌ బ్రేక్‌ రాకున్నా అందం కారణంగా వరుస ఆఫర్లు వస్తున్నాయి. 2018 నుంచి జాన్వీ కపూర్‌ బ్రేక్‌ కోసం ఎదురు చూస్తుంది. తెలుగులో మొదటి సినిమా దేవర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది, కానీ ఆ సినిమాలో జాన్వీ కపూర్‌ పాత్ర విషయంలో చాలా మంది విమర్శలు చేశారు, ప్రాధాన్యత లేని పాత్ర అని, హీరోయిన్‌ పాత్ర కాదు అంటూ జాన్వీ కపూర్‌ను చాలా మంది చాలా రకాలుగా ట్రోల్‌ చేసిన విషయం తెల్సిందే. అయినా జాన్వీ కపూర్‌ వాటి గురించి ఎప్పుడూ స్పందించదు.


జాన్వీ కపూర్‌ అందాల ఆరబోత

దేవర సినిమా తర్వాత తెలుగులో జాన్వీ కపూర్‌ చేస్తున్న మూవీ 'పెద్ది'. రామ్‌ చరణ్ హీరోగా బుచ్చి బాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రంగస్థలం సినిమా రేంజ్‌లో అంతకు మించి అన్నట్లుగా ఉంటుంది అంటూ బుచ్చిబాబు సన్నిహితులు చెబుతున్నారు. రామ్‌ చరణ్‌, జాన్వీ కపూర్‌ కాంబో రొమాంటిక్ లవ్‌ సీన్స్‌ సైతం ఆకట్టుకుంటాయి అంటున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా అంటే హీరోయిన్‌కి గుర్తింపు, క్రేజ్‌ ఉంటుంది. అందుకే ఈ సినిమా తప్పకుండా భారీ విజయాన్ని కట్టబెడుతుంది అనే విశ్వాసం ను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. జాన్వీ కపూర్‌కి మరో బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని పెద్ది కట్టబెట్టడం ఖాయం అని ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు.


సోషల్‌ మీడియాలో జాన్వీ ఫోటో షూట్‌

సోషల్‌ మీడియాలో జాన్వీ కపూర్‌ రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో ఆమె నుంచి వచ్చిన ప్రతి ఫోటో షూట్‌ వైరల్‌ అవుతోంది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఔట్‌ ఫిట్‌ను ధరించడం ద్వారా జాన్వీ కపూర్‌ ఎప్పటికప్పుడు వైరల్‌ కావడం మనం చూస్తూ ఉంటాం. తాజాగా మరోసారి జాన్వీ కపూర్‌ తన అందమైన ఫోటోలను షేర్‌ చేసింది. ఈసారి గ్రీన్‌ డ్రెస్‌లో చూపు తిప్పనివ్వడం లేదు అన్నట్లుగా ఉంది. జాన్వీ కపూర్‌ ఎప్పుడు ఎలాంటి ఫోటోలు షేర్‌ చేసినా చాలా స్పెషల్‌గా అనిపిస్తాయి. ఈసారి కూడ ఆ గ్రీన్‌ డ్రెస్‌లో ఒక మూవీ ప్రమోషన్‌లో పాల్గొన్న జాన్వీ కపూర్‌ అక్కడి ప్రకృతికి పులకించినట్లుగా ఫోటోలకు ఫోజ్‌ ఇచ్చింది. పెద్దగా స్కిన్‌ షో చేయకున్నా కూడా ఇలాంటి అందంతో కన్నుల విందు చేస్తుందని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.


పరమ్‌ సుందరితో హిట్ ఖాయం

జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో బ్యాక్‌ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఎట్టకేలకు ఆమెకు ఒక కమర్షియల్‌ హిట్‌ పడబోతుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. హిందీలో ఈమె సిద్దార్థ్‌ మల్హోత్ర తో కలిసి చేసిన పరమ్‌ సుందరి సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి. జాన్వీ కపూర్‌ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమాలో మరింత అందంగా కనిపిస్తోందని నెటిజన్స్‌ అంటున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో జాన్వీ చేసిన ఒక రెయిన్‌ డాన్స్‌ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. యూట్యూబ్‌లోనే సెన్షేషనల్‌ సక్సెస్‌ ను దక్కించుకున్న ఆ పాట వెండి తెరపై ఖచ్చితంగా మెరుపులు మెరిపించడం ఖాయం. ఆ రెయిన్‌ సాంగ్‌ లో మొత్తం ప్రేక్షకులు తడిచి పోతారు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు. ఆగస్టు 29న పరమ్‌ సుందరి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌ పాజిటివ్‌గా ఉన్నాయి. అత్యధిక వసూళ్లు సాధించబోతున్న సినిమాగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.