గ్లామర్ లోనే కాదు.. లవ్ ఎక్స్‌ప్రెషన్‌లోనూ జాన్వీ స్టైలే వేరు!
మరో సందర్భంలో శిఖర్ ఫోటోలతో కూడిన కస్టమ్-మేడ్ టీ-షర్ట్‌ను ధరించి తన ప్రేమను మరింత బోల్డ్‌గా వ్యక్తపరిచింది.
By: Srikanth Kontham | 5 Oct 2026 7:50 PM ISTఒకప్పుడు తారలు ప్రేమ వ్యవహారాలను గోప్యంగా ఉంచేవారు. కెరీర్‌పై ప్రభావం పడుతుందనే భయంతోనో, పబ్లిక్ డిస్కషన్స్ ఇష్టంలేకో డేటింగ్‌లను రహస్యంగా ఉంచడానికే ఇష్టపడేవారు. కానీ నేటి ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా యంగ్ జనరేషన్ స్టార్స్ తమ వ్యక్తిగత జీవితాలను, ప్రేమలను దాచుకోవడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. తాజాగా జాన్వీ కపూర్ ఎయిర్‌హోస్టెస్‌తో దిగిన ఫోటోలో వేసుకున్న టీ-షర్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. దానిపై `If lost, please return to Shikar Pahariya` అని ముద్రించి ఉండటం ఆశ్చర్య పరిచింది.
మరో సందర్భంలో శిఖర్ ఫోటోలతో కూడిన కస్టమ్-మేడ్ టీ-షర్ట్‌ను ధరించి తన ప్రేమను మరింత బోల్డ్‌గా వ్యక్తపరిచింది. తన రిలేషన్‌షిప్‌ను దాచుకోకుండా, దుస్తుల రూపంలో ఇలా ఓపెన్‌గా ప్రకటించడం బాలీవుడ్‌లో సరికొత్త చర్చకు దారితీసింది. సోషల్ మీడియా యుగంలో ప్రేమను వ్యక్తపరచడానికి సెలబ్రిటీలు అనుసరిస్తున్న సరికొత్త మార్గాల్లో ఇది ఆకర్షణీయమైనదిగా మారింది. ఈ తరహా పబ్లిక్ డిస్‌ప్లే ఆఫ్ ఎఫెక్షన్ అన్నది ఫ్యాషన్ లేదా పబ్లిసిటీ స్టంట్ అనుకుంటే పొరపాటే. శిఖర్ పహారియాతో జాన్వీ బంధం ఎంత బలమైనదో చెప్పడానికి ఈ పనులే నిదర్శనమని కొందరు అభిప్రాయ పడుతున్నారు. త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారనే ప్రచారంలో ఉన్న జంట తమ బంధంపై ఎంత నమ్మకంతో ఉందో? ఈ సంఘటనలు చెప్పకనే చెబుతున్నాయి.
సెలబ్రిటీలు చేసే ప్రతి పనీ యంగ్ జనరేషన్‌పై ప్రభావం చూపుతుంది. తాజాగా జాన్వీ కపూర్ అనుసరించిన స్టైల్ ట్రెండ్‌సెట్టర్‌గా మారే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో లవర్స్ తమ పేర్లు లేదా ఫోటోలతో కూడిన కస్టమ్ టీ-షర్ట్స్ ధరించి ప్రేమను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఫ్యాషన్‌గా మారినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
ఏ విషయంలోనైనా ట్రెండ్‌ను అనుసరించడం కంటే కొత్త ట్రెండ్‌ను సృష్టించడానికే జాన్వీ కపూర్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. సినిమాల ఎంపికలో అయినా? ఫ్యాషన్ సెలెక్షన్స్‌లో అయినా? ఆమె శైలి ఎప్పుడూ విభిన్నంగానే ఉంటుంది. తాజాగా తన వ్యక్తిగత జీవితాన్ని కూడా అంతే ధైర్యంగా, అందరితో పంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. మొత్తానికి జాన్వీ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ మూవ్స్‌తో మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు.
