రిలేషన్ కన్ఫర్మ్ చేసిందా?
జాన్వి కపూర్ గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. శిఖర్ పహారియా అనే ఒక వ్యాపారవేత్తతో ప్రేమ వ్యవహారం సాగుతున్నట్లు చాలా కథనాలు వినిపించాయి.
By: Madhu Reddy | 13 Nov 2025 2:00 PM ISTనటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ 2018లో విడుదలైన దడక్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రీదేవి కూతురు కాబట్టి జాన్వీ మీద కూడా విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అనే విషయం తెలిసిందే. పాత్రలకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను కెరియర్ మొదట్లో చేసినా కూడా అవేవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో సక్సెస్ అందివ్వలేదు.
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఆ సినిమా ద్వారా చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ కు విపరీతమైన లాభాలు వచ్చాయి. ఆ సినిమాతోనే తెలుగులో మంచి సక్సెస్ అందుకుంది జాన్వి కపూర్.
రిలేషన్ కన్ఫామ్ చేసిందా
జాన్వి కపూర్ గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. శిఖర్ పహారియా అనే ఒక వ్యాపారవేత్తతో ప్రేమ వ్యవహారం సాగుతున్నట్లు చాలా కథనాలు వినిపించాయి. మరోవైపు శిఖర్ పహారియాకి మంచి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది. కేంద్ర మాజీ హోం మంత్రి సుశీల్ కుమార్ సిండే మనవడు కావడం విశేషం.
శిఖర్ పహారియా సోదరుడు వీర్ పహారియా సినిమా రంగంలో నటుడుగా చేస్తున్నాడు. శిఖర్ మాత్రం సినిమాలకు దూరంగా ఉంటూ బిజినెస్ పనులు చూసుకుంటాడు. గతంలో జాన్వీ కపూర్ తో శిఖర్ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. అయితే వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది అని అందరికీ ఒక సందేహం ఉండేది.
ఈ సందేహాలు అన్నిటికీ కూడా జాన్వికపూర్ మరోసారి కన్ఫామ్ చేసినట్లు అనిపిస్తోంది. బోనికపూర్ బర్త్డే సెలబ్రేషన్స్ వేడుకల్లో ఆ ఫ్యామిలీకి చెందిన వారంతా పాల్గొన్నారు. అయితే వాళ్లలో శిఖర్ పహారియా కూడా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. గెస్ట్ లా కాకుండా ఒక కుటుంబ సభ్యుడి లాగా ఆ ఈవెంట్లో తెలిసి పోయాడు. ఆ ఫోటోలు బట్టి చూస్తే జాన్వి కపూర్ కన్ఫామ్ చేసింది అని అందరూ అనుకుంటున్నారు.
రామ్ చరణ్ పెద్ది
ఇక ప్రస్తుతం జాన్వి కపూర్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న పెద్ది సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
రంగస్థలం సినిమా మించి ఈ సినిమా ఉండబోతుంది అని చాలామంది అంచనా వేస్తున్నారు. బుచ్చిబాబు కూడా మేకింగ్ విషయంలో అసలు కాంప్రమైజ్ లేకుండా చేస్తున్నాడు అని తెలుస్తుంది. ఈ సినిమా మార్చి 2026 లో రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేయనున్నారు.
