ఇలా ఇంకెంత కాలం ఊరిస్తారు జాన్వీ!
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు.
By: Srikanth Kontham | 2 Aug 2026 1:46 PM ISTబాలీవుడ్ నటి జాన్వీ కపూర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా? బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియాతో గడిపే మధురమైన క్షణాలను అమ్మడు అభిమానులతో పంచుకోవడంలో ఏమాత్రం ఆలోచించరు. తాజాగా వాళ్లిద్దరికీ సంబంధించిన కొన్ని అందమైన క్యాండిడ్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలను జాన్వీ స్వయంగా షేర్ చేసింది. వాటికి జాన్వీ ఇచ్చిన క్యాప్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రాలు చూసేందుకు ఎంతగానో ముద్దుగా ఉన్నాయని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉండలేకపోయానని పేర్కొన్నారు.
ఈ క్యూట్ కామెంట్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ పోస్ట్‌పై అభిమానులు ప్రేమను కురిపిస్తూ పెద్దఎత్తున లైకులు, కామెంట్లు చేస్తున్నారు. జాన్వీ కపూర్, శిఖర్ పహారియా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ బాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధికారికంగా వారు తమ బంధం గురించి ఎప్పడు స్పందిచకపోయినా? పలు సందర్భాల్లో కలిసి కనిపించడం, ఫ్యామిలీ ఈవెంట్స్‌లో పాల్గొనడం ద్వారా ఇద్దరి మధ్య ఉన్న బంధం స్పష్ట మవుతోంది. సోషల్ మీడియా వేదికగా పంచుకునే ఫోటోలు ఎప్పటికప్పుడు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.
అయితే బంధాన్ని అధికారికం చేయకపోవడమే అభిమానుల్లో కాస్త నిరూత్సాహాన్ని కలిగిస్తుంది. జాన్వీ-శిఖర్ రిలేషన్ షిప్ లో దాయాల్సిన అవసరం దేనికంటూ? కొన్ని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలకు తావు ఇవ్వడం కంటే అధికారికంగా ప్రకటించి ఆ రిలేషన్ షిప్ ని పెళ్లి వరకూ తీసుకెళ్తే ఎంంతో అందంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇక జాన్వీ సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నారు. బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లో కూడా సత్తా చాటుతూ పాన్-ఇండియా రేంజ్‌లో దూసుకుపోతున్నారు.
ఇటీవలే `పెద్ది` తో భారీ విజయాన్ని అందుకున్నారు. దీంతో జాన్వీ కపూర్ తదుపరి ఏ తెలుగు హీరోతో నటిస్తుంది? అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగు అవకాశాలు వస్తున్నాయని సొంత పరిశ్రమను అమ్మడు ఏనాడు లైట్ తీసుకోలేదు. రెండు పరిశ్రమల అవకాశాలను బ్యాలెన్స్ చేస్తూ కెరీర్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే కోలీవుడ్ ఎంట్రీ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. జాన్వీ కపూర్ తో పాటు సిస్టర్ ఖుషీ కపూర్ కూడా తమిళ ఇండస్ట్రీలో లాంచ్ అవ్వాలని ఎదురు చూస్తోంది.
