తన AI ఫోటోలపై జాన్వీ కపూర్ సీరియస్ కౌంటర్
ఇప్పటికే డీప్ ఫేక్ అనేది సెలబ్రిటీలను ఎంతగా ఇబ్బందికి గురి చేస్తుందో తెలిసిందే. ఇప్పుడు ఏఐ ని ఉపయోగించి సెలబ్రిటీల రకరకాల ఫోటోలను క్రియేట్ చేస్తున్నారు.
By: Ramesh Palla | 16 Sept 2025 4:24 PM ISTఇప్పటికే సోషల్ మీడియాలో సెలబ్రిటీలను ట్రోల్ చేయడం, చిన్న దానికి కూడా తీవ్రంగా విమర్శిస్తూ కామెంట్స్ చేయడం, బూతులు తిట్టడం, ప్రతి విషయంలోనూ తప్పులు వెతకడం వంటివి చేస్తున్నారు. సోషల్ మీడియాలో వాటిని తట్టుకుని నిలబడలేక కొందరు ఇండస్ట్రీని వదిలి వెళ్తున్నారు లేదంటే సోషల్ మీడియా నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా వచ్చిన ఏఐ మొత్తం మార్చేస్తుంది. ఫోటోలు, వీడియోలను క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సెలబ్రిటీలకు నెటిజన్స్ సరికొత్త సమస్యలను క్రియేట్ చేస్తున్నారు. ఒరిజినల్ కి ఏమాత్రం తగ్గకుండా చాలా నీట్‌గా సెలబ్రిటీల ఫోటోలను ఏఐ ద్వారా క్రియేట్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఇప్పటికే డీప్ ఫేక్ అనేది సెలబ్రిటీలను ఎంతగా ఇబ్బందికి గురి చేస్తుందో తెలిసిందే. ఇప్పుడు ఏఐ ని ఉపయోగించి సెలబ్రిటీల రకరకాల ఫోటోలను క్రియేట్ చేస్తున్నారు.
జాన్వీ కపూర్ ఏఐ ఫోటో వైరల్
ఇటీవల జాన్వీ కపూర్ యొక్క ఏఐ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె ధరించని ఔట్ ఫిట్ ధరించినట్లు, ఆమె ఇవ్వని ఫోజ్ ఇచ్చినట్లుగా జాన్వీ కపూర్ ఫోటోను ఏఐ ద్వారా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా అంతా షాక్ అయ్యారు. నిజంగానే ఆ ఫోటో జాన్వీ కపూర్‌ది అనుకున్నారు. చివరకు జాన్వీ పీఆర్ టీం ఆ ఫోటోను డిలీట్ చేయించాల్సి వచ్చింది. తాజాగా జాన్వీ కపూర్ తన సన్నీ సంస్కారికి తులసి కుమారి సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఏఐ ఫోటో పై స్పందించింది. ఇలాంటి ఫోటోలు సెలబ్రిటీల జీవితాలను ప్రభావితం చేస్తాయి అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. వారి కెరీర్ పరంగానూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే జాన్వీ కపూర్ ఇలాంటి ఏఐ మేకింగ్ ఫోటోలపై సీరియస్‌గా స్పందించింది. మళ్లీ ఇలాంటివి జరగకూడదు అంటూ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చినట్లుగా మాట్లాడింది.
ఆ ఫోటోలపై జాన్వీ కపూర్ సీరియస్ రియాక్షన్
జాన్వీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ అలాంటి ఫోటోలను చూస్తారు, వారు నేను నిజంగానే అలాంటి డ్రెస్‌లను ధరించాను అనుకుంటారు, వారు నన్ను ఖచ్చితంగా ఆసమయంలో ఏంటి ఇలా అని తప్పుగా అనుకుంటారు. క్రియేటివిటీ ఉండాలి కానీ, అది హద్దులు దాటడం వల్ల ఖచ్చితంగా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సెలబ్రిటీలను ఏఐ ఉపయోగించి మరింతగా ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని జాన్వీ కపూర్ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఏఐ ను ఉపయోగించి చాలా ప్రయోజనాలు పొందుతున్నారు. కానీ కొందరు మాత్రం ఇలా తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నారు. ఏఐ అనేది ఇష్టానుసారంగా వాడకుండా కూడా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రతి విషయాన్ని పరిశీలిస్తున్నారు అనే విషయంను ప్రతి ఒక్కరూ గుర్తించాలి.
రామ్ చరణ్ పెద్ది సినిమాలో జాన్వీ కపూర్
జాన్వీ కపూర్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఈ అమ్మడు పరమ్ సుందరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో చాలా అందంగా కనిపించింది, ముఖ్యంగా రెయిన్ డాన్స్ తో రెచ్చి పోయింది. అయినా కూడా జాన్వీ కపూర్‌కి ఆ సినిమా హిట్ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో ఆ పాట గురించి, సినిమా గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. కానీ జాన్వీ కపూర్ కి బాలీవుడ్‌లో నిరాశ మిగిలింది. హిందీలో ఈమె తదుపరి సన్నీ సంస్కారికి తులసి కుమారి సినిమాతో పలకరించబోతుంది. బాలీవుడ్‌లో ఈమె ఇప్పటి వరకు కమర్షియల్ బ్రేక్ దక్కించుకోలేక పోయింది. దాంతో ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో వైపు టాలీవుడ్‌లో బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ కి జోడీగా ఈ అమ్మడు నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
