పరమ్ సుందరి...విమర్శలకు జాన్వీ చెక్ పెట్టిందలా!
సిద్దార్ధ్ మల్హోత్రా-జాన్వీ కపూర్ జంటగా తుషార్ జలోటా దర్శకత్వంలో 'పరమ్ సుందరి' చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది.
By: Srikanth Kontham | 26 Aug 2025 12:19 PM ISTసిద్దార్ధ్ మల్హోత్రా-జాన్వీ కపూర్ జంటగా తుషార్ జలోటా దర్శకత్వంలో 'పరమ్ సుందరి' చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది. మరికొన్ని గంటల్లోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో జాన్వీ కపూర్ మలయాళి యవతి పాత్రలో మెప్పించబోతుంది. దీక్షా పట్టా సుందరై దామోదరం పిళ్లై పాత్రలో జాన్వీ కనిపించనుంది. అయితే జాన్వీ కపూర్ ఇలా మలయాళ యువతి పాత్రలో నటించడంపై విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఓ హిందీ నటి మాప్రాంతానికి చెందిన అమ్మాయి పాత్రలో నటించడం ఏంటని మాలీవుడ్ నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది.
శ్రీదేవి కుమార్తె కావడంతోనేనా:
దీనిలో భాగంగా కొంతమంది మాలీవుడ్ నటీమణులు జాన్వీని విమర్శించారు. ఆ పాత్రలో నటించే అవకాశం తుషార్ తమకు ఇవ్వకుండా హిందీ యువతికి ఇవ్వడం ఏంటని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. జాన్వీకంటే గొప్పగా తాము నటించగలమని..ఆ పాత్ర తమతోనే సాద్యమవుతుందని ధీమా వ్యక్తం చేసారు. జాన్వీ లాంటి పెద్ద కుటుంబం నుంచి వచ్చిన నటీమణులు వల్ల తమ లాంటి వారికి అవకాశం రావడం లేదని ఆవేదన చెందారు. మొత్తంగా ఈ సినారే లో జాన్వీ ఎక్కువగా హైలైట్ అయింది.
అలా బుట్టలో వేసింది:
తాజాగా ఈ విమర్శలకు జాన్వీ తెలివిగా పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. పరమ్ సుందరి తాను కేవలం కేరళ యువతి పాత్రలో మాత్రమే కాకుండా తమిళ యువతిగాను కనిపిస్తానంది. తన మూలాలు కేరళలో లేవని...తనది కానీ, తన తల్లి శ్రీదేవి గాను మలయాళీలు కాదంది. కానీ అక్కడ సంస్కృతి, సంప్రదాయాలు తానుప్పుడూ గౌరవిస్తానని...అక్కడ వాతావరణం....క్రమశిక్షణ ఎంతో గొప్పగా ఉంటుందన్నారు. ఆ ప్రాంతానికి చెందిన అమ్మాయి పాత్రలో తాను నటించడం ఓ అదృష్టంగా పెర్కొంది.
పరమ్ సుందరికి ప్రీ పబ్లిసిటీ:
'ఓనం' పండుగ ప్రత్యేకత గురించి చెప్పుకొచ్చింది. అవకాశం వస్తే అక్కడ పరిశ్రమలోనూ సినిమాలు చేస్తానంది. దీంతో జాన్వీపై వ్యక్తమవుతోన్న విమర్శలకు తాత్కాలికంగా పుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. అయినా ఏ సినిమాలోనైనా హీరోయిన్ గా ఎవర్ని తీసుకోవాలన్నది? ఆ సినిమా డైరెక్టర్ మీద ఆధార పడుతుంది. ఏ ప్రాంతం నటి పాత్రలోనైనా నటీమణులు నటించే స్వేచ్ఛ ఉంది. కానీ ఇక్కడ జాన్వీ శ్రీదేవి కుమార్తె కావడంతో? ఆమెనే టార్గెట్ గా విమర్శలు చేసినట్లు హైలైట్ అవుతుంది. ఏది ఏమైనా ఈ నెగివిటీ వల్ల పరమ్ సుందరి కి మంచి పబ్లిసిటీ దక్కింది.
