Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ తో ఒక్క సాంగ్.. జాన్వీ కపూర్ చెప్పిన క్రేజీ వెయిట్ లాస్ సీక్రెట్!

జాన్వీ మాట్లాడుతూ.. "ఈ సినిమాలో చరణ్ సర్ తో పాటు లీడ్ డ్యాన్సర్లు, చివరకు బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్లు కూడా మూడు నాలుగు రోజుల షూటింగ్ కే బాగా సన్నబడిపోయారు.

By:  M Prashanth   |   26 May 2026 6:48 AM IST
రామ్ చరణ్ తో ఒక్క సాంగ్.. జాన్వీ కపూర్ చెప్పిన క్రేజీ వెయిట్ లాస్ సీక్రెట్!
X

బెంగళూరులో జరిగిన 'పెద్ది' సినిమా ఈవెంట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ జూన్ 4న సినిమా థియేటర్లలోకి రాబోతున్న తరుణంలో, కర్ణాటక ప్రమోషన్స్ లో జాన్వీ పంచుకున్న కొన్ని విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన డ్యాన్స్ ఎక్స్ పీరియన్స్ బెంగళూరు ఫుడ్ గురించి ఆమె మాట్లాడిన తీరు అక్కడి ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది.

ఈవెంట్ లో యాంకర్ జాన్వీ కపూర్ ను ఆమె ఫిట్నెస్ డైట్ సీక్రెట్ గురించి ఒక ప్రశ్న అడిగింది. దానికి జాన్వీ నవ్వుతూ చాలా ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చింది. "నాకు తెలిసిన బెస్ట్ వెయిట్ లాస్ టిప్ ఏంటో తెలుసా.. రామ్ చరణ్ సర్ తో కలిసి ఒక్క పాటలో డ్యాన్స్ చేయండి. కేవలం నాలుగు రోజుల్లోనే మీరంతా చాలా స్లిమ్ గా మారిపోతారు" అంటూ ఒక క్రేజీ సీక్రెట్ ను బయటపెట్టింది. చరణ్ పక్కన డ్యాన్స్ చేయాలంటే ఎంత ఎనర్జీ ఉండాలో, ఆయన స్పీడ్ అందుకోవడం ఎంత కష్టమో జాన్వీ మాటల్లోనే క్లారిటీ వచ్చేసింది.

జాన్వీ మాట్లాడుతూ.. "ఈ సినిమాలో చరణ్ సర్ తో పాటు లీడ్ డ్యాన్సర్లు, చివరకు బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్లు కూడా మూడు నాలుగు రోజుల షూటింగ్ కే బాగా సన్నబడిపోయారు. అంతటి హై ఎనర్జీ ఉన్న సాంగ్స్ ఈ సినిమాలో ఉన్నాయి" అని వెల్లడించింది. చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం తన కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ అని, జూన్ 4న థియేటర్లలో ఆ సాంగ్స్ చూసి ఆడియన్స్ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని ఆమె ధీమా వ్యక్తం చేసింది.

ఇక బెంగళూరు సిటీతో ఉన్న కనెక్షన్ గురించి చెబుతూ.. తనకు ఇక్కడి ఫుడ్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. "నాకు బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ అంటే పిచ్చి. అక్కడ దొరికే ఫిల్టర్ కాఫీ, గడ్ బడ్ ఐస్ క్రీమ్ నా ఫేవరెట్. కాకపోతే ప్రస్తుతం నేను డైట్ లో ఉన్నాను కాబట్టి వాటిని తినలేకపోతున్నాను" అంటూ తన బాధను క్యాజువల్ గా పంచుకుంది. ఒక స్టార్ హీరోయిన్ అయి ఉండి కూడా ఎలాంటి బేషజాలు లేకుండా తన మనసులోని మాటను ఓపెన్ గా చెప్పడం అక్కడి వాళ్లకు నచ్చింది.

ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ తో కలిసి నటించిన అనుభవాన్ని కూడా జాన్వీ గుర్తుచేసుకుంది. " శివన్నతో నాకు కేవలం ఒక్క చిన్న సీన్ మాత్రమే ఉంది. కానీ ఆ ఒక్క సీన్ లోనే ఆయన కళ్లల్లో ఉన్న నటుడి పవర్ ఏంటో నాకు అర్థమైంది. ఒక గొప్ప యాక్టర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం, భవిష్యత్తులో ఆయనతో పూర్తి స్థాయి సినిమా చేయాలని కోరుకుంటున్నాను" అని శివన్నపై తనకున్న గౌరవాన్ని చాటుకుంది. ఇక బెంగళూరు ఈవెంట్ లో జాన్వీ కపూర్ తన స్పీచ్ తో అటు కన్నడ ఫ్యాన్స్ ను, ఇటు మెగా అభిమానులను బాగా ఖుషీ చేసింది. ఒక పక్కా విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న పెద్ది సినిమాలో జాన్వీ క్యారెక్టర్ లో ఒక మంచి సిన్సియారిటీ ఉంటుందని ఇప్పటికే టీమ్ గట్టి నమ్మకంతో ఉంది. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.