Begin typing your search above and press return to search.

పర్పుల్ డ్రెస్‌లో సెల్ఫీలతో హీటెక్కిస్తున్న జాన్వీ.. కొత్త అబ్సెషన్ అదేనట!

లేటెస్ట్ ఫొటోషూట్‌లో జాన్వీ కపూర్ డీప్ లైలాక్ పర్పుల్ కలర్ రఫుల్-ట్రిమ్డ్ డ్రెస్‌లో దేవకన్యలా కనిపిస్తోంది.

By:  Madhu Reddy   |   23 Jun 2026 8:55 PM IST
పర్పుల్ డ్రెస్‌లో సెల్ఫీలతో హీటెక్కిస్తున్న జాన్వీ.. కొత్త అబ్సెషన్ అదేనట!
X

గ్లామర్ బ్యూటీ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని క్యాండిడ్, మిర్రర్ సెల్ఫీలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. గ్లోబల్ ఫ్యాషన్ బ్రాండ్ 'జారా' కి చెందిన పర్పుల్ రఫుల్ డ్రెస్‌లో మెరిసిపోతూ.. "నేను, నా సెల్ఫీలు.. నా కొత్త అబ్సెషన్" అంటూ పెట్టిన ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆ క్యూట్ అండ్ హాట్ లుక్స్ విశేషాలు ఇప్పుడు చూద్దాం..

పర్పుల్ లుక్‌లో అదిరిపోయిన జాన్వీ:

లేటెస్ట్ ఫొటోషూట్‌లో జాన్వీ కపూర్ డీప్ లైలాక్ పర్పుల్ కలర్ రఫుల్-ట్రిమ్డ్ డ్రెస్‌లో దేవకన్యలా కనిపిస్తోంది. అసిమెట్రికల్ మిడి డిజైన్, వి-నెక్ లైన్, షీర్ ఫ్యాబ్రిక్‌తో ఉన్న ఈ స్లీవ్‌లెస్ డ్రెస్ ఆమె గ్లామర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది.ఇక అద్దం ముందు నిలబడి చేతిలో వైట్ స్మార్ట్‌ఫోన్ పట్టుకుని, మెరిసే నవ్వుతో ఆమె ఇచ్చిన క్యాండిడ్ పోజులు ఫ్యాన్స్‌కు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇక ఈ లుక్‌కు మ్యాచింగ్‌గా చేతికి బ్రాస్‌లెట్స్, పక్కన ఒక పెద్ద టాన్ టోట్ బ్యాగ్‌ను యాక్సెసరీస్‌గా స్టైల్ చేసింది.

టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్:

ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించిన ‘పెద్ది’ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఇక బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి భారీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో జాన్వీ నటనకు, గ్లామర్‌కు తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. భవిష్యత్తులో ఎన్టీఆర్ సరసన 'దేవర: పార్ట్ 2' లో కూడా ఈమె సందడి చేయబోతోంది.

బాలీవుడ్‌లోనూ ఫుల్ బిజీ:

కేవలం సౌత్ మాత్రమే కాదు, అటు నార్త్‌లోనూ జాన్వీ చేతి నిండా క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ సరసన 'లగ్ జా గలే' సినిమాలో నటిస్తోంది. ఇక వీటితో పాటు 'పరమ్ సుందరి', 'హోమ్‌బౌండ్', మరియు వరుణ్ ధావన్‌తో కలిసి 'సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి' వంటి హై-ప్రొఫైల్ చిత్రాల్లో నటిస్తూ 2026-2027 లో బిగ్గెస్ట్ లైనప్‌ను సెట్ చేసుకుంది.

గ్లామర్ పరంగానే కాకుండా నటిగా కూడా జాన్వీ కపూర్ రోజురోజుకూ తన వర్సటాలిటీని నిరూపించుకుంటూ ఇండియన్ సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక స్ట్రాంగ్ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకుంటోంది. ఇక ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఈ పర్పుల్ డ్రెస్ సెల్ఫీలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. మరి ఈ బ్యూటీ మరిన్ని తెలుగు సినిమాలకు సైన్ చేసి టాలీవుడ్ ప్రేక్షకులను ఎప్పుడు అలరిస్తుందో చూడాలి.