Begin typing your search above and press return to search.

పింక్ పరికిణీలో తల్లినే మించిపోయిన జాన్వీ.. ఏం అందం రా బాబు!

తాజాగా ఈమె పింక్ కలర్ పరికిణి ధరించి తన అందంతో మెస్మరైజ్ చేసింది.. హెవీ ఎంబ్రాయిడరీ కలిగిన హాఫ్ స్లీవ్ బ్లౌజ్ ధరించి అందుకు కాంబినేషన్లో చాలా చక్కగా డిజైన్ చేసిన పింక్ లెహంగాను ధరించింది.

By:  Madhu Reddy   |   6 Sept 2025 7:43 PM IST
పింక్ పరికిణీలో తల్లినే మించిపోయిన జాన్వీ.. ఏం అందం రా బాబు!
X

జాన్వీ కపూర్.. అప్పట్లో దివంగత నటీమణి శ్రీదేవి ఎలా అయితే అందానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందో.. ఇప్పుడు అదే హవా కొనసాగిస్తోంది ఆమె వారసురాలు. తన అందం, అభినయంతో అందరినీ కట్టిపడేస్తూ అటు నటనతో కూడా అబ్బుర పరుస్తోంది ఈ ముద్దుగుమ్మ. నిజానికి సినిమాల కంటే కూడా సోషల్ మీడియా ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ చిన్నది.. నిత్యం ఫోటోషూట్ తో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు భిన్న విభిన్నమైన వస్త్రధారణతో ప్రేక్షకులను అలరించే జాన్వీ కపూర్ తాజాగా మరో ఔట్ఫిట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది.


తాజాగా ఈమె పింక్ కలర్ పరికిణి ధరించి తన అందంతో మెస్మరైజ్ చేసింది.. హెవీ ఎంబ్రాయిడరీ కలిగిన హాఫ్ స్లీవ్ బ్లౌజ్ ధరించి అందుకు కాంబినేషన్లో చాలా చక్కగా డిజైన్ చేసిన పింక్ లెహంగాను ధరించింది. మెడకు ఎటువంటి నెక్ పీస్ ధరించకుండా.. చేతులకు స్టోన్స్ పొదిగిన బ్యాంగిల్స్ ధరించి ఆ నడుమును మరింత హైలెట్ చేసేలా వడ్డానం కూడా ధరించింది. ఇక చెవి దిద్దులతో తన అందాన్ని మరింత రెట్టింపు చేసిందని చెప్పవచ్చు. మొత్తానికైతే కాటుక కళ్ళతో పింకీ పరికిణీలో తల్లిని మించిన అందంతో మరొకసారి అలరిస్తోంది జాన్వీ కపూర్..


ఈమె అందం చూసి ఏం అందం రా నాయనా.. తల్లినే మించిపోయింది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా నాటి తరానికి శ్రీదేవి ఎలా అయితే తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుందో ఇప్పుడు ఆమె వారసురాలు జాన్వీ కపూర్ కూడా నేటి తరం యువతను అలాగే ఆకట్టుకుంటోంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ కి సంబంధించిన ఈ ఫోటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది.


జాన్వీ కపూర్ కెరియర్ విషయానికి వస్తే.. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్, దివంగత నటీమని శ్రీదేవి దంపతులకు 1997 మార్చి 6న జన్మించింది. శ్రీదేవి కూతురుగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. 2018లో వచ్చిన 'ధడక్' అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. 2018 నుంచే హిందీలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న జాన్వీ కపూర్ తొలిసారి కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. ఇందులో పల్లెటూరి అమ్మాయి పాత్రలో చాలా చక్కగా ఒరిగిపోయింది జాన్వీ కపూర్.


ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'పెద్ది' సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తోంది. మరొకవైపు బాలీవుడ్ లో 'పరమ్ సుందరి' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. ప్రస్తుతం హిందీలో 'సన్నీ సంస్కారీకి తులసి కుమారి' అనే హిందీ చిత్రంలో కూడా నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది విడుదల కాబోతోంది. ఇకపోతే ఒకవైపు తన అందంతో నటనతో ఆకట్టుకుంటున్న ఈమె.. మరొకవైపు పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంటోంది.