Begin typing your search above and press return to search.

లెహంగా లుక్‌లో పెద్ది పాప.. హీటెక్కించేసిందిగా..

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం సినిమాలతో పాటు ఫ్యాషన్ వేదికలపై కూడా ట్రెండింగ్ గా మారింది. ఇటీవల ఆమె ధరించిన పింక్ కలర్ లెహంగా లుక్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.

By:  M Prashanth   |   29 July 2025 9:34 AM IST
లెహంగా లుక్‌లో పెద్ది పాప.. హీటెక్కించేసిందిగా..
X

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం సినిమాలతో పాటు ఫ్యాషన్ వేదికలపై కూడా ట్రెండింగ్ గా మారింది. ఇటీవల ఆమె ధరించిన పింక్ కలర్ లెహంగా లుక్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ప్రముఖ డిజైనర్ జయంతి రెడ్డి లేబుల్ కోసం వాక్ చేసిన జాన్వీ, తన రాయల్ లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ట్రెడిషినల్ డిజైన్‌కి గ్లామర్ టచ్ జత చేస్తూ జాన్వీ ఈ లుక్‌లో తన అందాన్ని మరింత ఎలివేట్ చేసింది.


బ్లష్ పింక్ షేడ్స్‌లో మెరిసే లెహంగా, స్టోన్ వర్క్ మేకప్ అన్నీ కలిసి ఆమెను ఈ లుక్‌లో డ్రీమ్ గర్ల్‌లా చూపించాయి. జాన్వీ కపూర్ స్టైలింగ్ పరంగా ఎప్పుడూ ట్రెండ్స్‌కు తగ్గట్టే ముందుంటుంది. ఈ ఫోటోషూట్ కూడా అలాంటిదే. క్లాస్ మరియు గ్లామర్ రెండింటి మిక్స్ లో ఈ అవుట్‌ఫిట్‌పై అభిమానుల నుంచి పొగడ్తల వర్షం కురుస్తోంది. ఫొటోస్‌కు అద్భుతమైన లైక్స్ వస్తుండటమే దీనికి నిదర్శనం.


శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీకి వచ్చిన జాన్వీ, మొదటి సినిమా 'ధడక్'తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'గంజన్ సక్సేనా', 'రూహి', 'మిలి' లాంటి సినిమాల్లో నటిస్తూ నటన పరంగా తనను నిరూపించుకుంది. ఆమె అందం కంటే ఎక్కువగా ఎక్స్‌ప్రెషన్ల పైనా ఫోకస్ చేస్తూ తన నటనకు ఒక ప్రత్యేక శైలి ఏర్పరచుకుంది. ఇదే కారణంగా ఇప్పుడు ఆమెను దక్షిణాది దర్శకులు కూడా గమనిస్తున్నారు.


ప్రస్తుతం జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో బిజీ అవుతోంది. రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలోనూ ఆమె కథానాయికగా నటిస్తోంది. ఈ ప్రాజెక్టులతో ఆమె తెలుగు పరిశ్రమలో తన స్థానం బలపరచుకునే అవకాశముంది. అంతేకాకుండా, ఆమె రెమ్యునరేషన్ కూడా ఒక్కొక్క సినిమాకు పెరిగిపోతుండటంతో, ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ ఫేవరెట్‌గా నిలుస్తోంది.