బాలీవుడ్ స్టార్ బ్యూటీకి వింత ఫోబియా
అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు
By: Sravani Lakshmi Srungarapu | 2 Aug 2025 2:09 PM ISTఅతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం జాన్వీ చేతిలో పలు సినిమాలున్నాయి. అయితే ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్లవుతున్నా జాన్వీకి కోరుకున్న బ్లాక్ బస్టర్ మాత్రం పడలేదు. టాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ చేసిన దేవర సినిమా హిట్ అయింది కానీ ఆ సక్సెస్ మొత్తం ఎన్టీఆర్ అకౌంట్ లోనే పడిపోయింది.
జాన్వీ ఫోకస్ మొత్తం పెద్ది పైనే!
అయితే జాన్వీకి అదృష్టం కారణంగా అవకాశాలైతే క్యూ కడుతున్నాయి కానీ సాలిడ్ సక్సెస్ మాత్రం దక్కడం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న జాన్వీ కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీపైనే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమపై కూడా ఫోకస్ చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాతో బిజీగా ఉన్న జాన్వీ ఆ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు.
జాన్వీకి పిల్లో ఫోబియా
ఇక అసలు విషయానికొస్తే జాన్వీ కపూర్ కు పిల్లో ఫోబియా ఉంది. అందుకే ఆమె ఎక్కడికెళ్లినా తనతో పాటూ తన దిండును కూడా తీసుకెళ్తూ ఉంటారు. షూటింగ్ కోసం జాన్వీ ఓ ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లే ప్రతీసారీ ఓ సెక్యూరిటీ ఆఫీసర్ ఆమె తో పాటూ దిండును పట్టుకుని కనిపిస్తూ ఉంటారు. తనకు పిల్లో ఫోబియా ఉందనే విషయాన్ని జాన్వీ కూడా ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో ఒప్పుకున్నారు.
దిండు విషయంలో జాన్వీపై ట్రోల్స్
ఆ భయం కారణంగానే ఎప్పుడూ తను రెగ్యులర్ గా వాడే దిండును తన వెంట తీసుకెళ్తూ ఉంటానని చెప్పారు. జాన్వీకి ఉన్న ఈ వింత ఫోబియా బయట పడకముందు జాన్వీ ఎందుకు ఇలా దిండును తీసుకెళ్తుంది? హోటల్లోని దిండును ఆమె దొంగతనంగా తీసుకెళ్తుందా అని నెటిజన్లు ఈ విషయంలో ఆమెను ట్రోల్ కూడా చేశారు. అయినా జాన్వీ అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు.
అట్లీ సినిమాలోనూ...?
ఇక కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం భారీ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ల లిస్ట్ లో జాన్వీ కూడా ఒకరు. ఇప్పటివరకు జాన్వీ సాలిడ్ హిట్ అందుకోకపోయినా ఆమెకు ఇండియన్ సినిమాలో మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ తోనే అల్లు అర్జున్- అట్లీ సినిమాలో కూడా జాన్వీ ఓ హీరోయిన్ గా ఎంపికయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తన దృష్టంతా పెద్దిపైనే పెట్టిన జాన్వీ కపూర్ నుంచి త్వరలోనే పరమ్ సుందరి సినిమా రిలీజ్ కానుంది.
