Begin typing your search above and press return to search.

శ్రీదేవి వారసురాలు కావడం వల్లే..!

శ్రీదేవి నట వారసురాలిగా జాన్వీ కపూర్‌ ఇండస్ట్రీ జర్నీని 2018లో 'ధడక్‌' సినిమాతో మొదలు పెట్టిన విషయం తెల్సిందే.

By:  Ramesh Palla   |   8 Sept 2025 7:00 PM IST
శ్రీదేవి వారసురాలు కావడం వల్లే..!
X

శ్రీదేవి నట వారసురాలిగా జాన్వీ కపూర్‌ ఇండస్ట్రీ జర్నీని 2018లో 'ధడక్‌' సినిమాతో మొదలు పెట్టిన విషయం తెల్సిందే. ధడక్ సినిమా ప్రారంభం సమయంలో శ్రీదేవి ఉంది, కానీ ఆ సినిమా విడుదల సమయం కు ఆమె చనిపోయారు. శ్రీదేవి కూతురు అనే బ్రాండ్‌ ఇమేజ్ కారణంగా జాన్వీ కపూర్‌కి మంచి గుర్తింపు దక్కింది. ఇండస్ట్రీలో ఎంట్రీ అయితే బాగానే దక్కింది. కానీ ఇండస్ట్రీలో ఆమెకు సక్సెస్‌లు దక్కలేదు. మొదటి సినిమా ధడక్‌ కాస్త పర్వాలేదు అనిపించింది. స్టార్‌ కిడ్‌ కావడంతో ధడక్ సినిమా ఆడింది అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేశారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది, వెబ్‌ సిరీస్‌లు చేసింది, వెబ్‌ మూవీస్‌ తో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఆరు.. ఏడు ఏళ్ల కాలంలో జాన్వీ కపూర్‌ చాలా ఎత్తు పల్లాలను చూసింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఫ్లాప్స్‌ చవి చూసింది.

జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో..

బాలీవుడ్‌లో జాన్వీ కపూర్‌కి వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు అక్కడ మంచి కమర్షియల్‌ బ్రేక్ మాత్రం దక్కలేదు. హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ అందంతో అలరిస్తూ వచ్చింది, పలు సినిమాల్లో నటిగానూ ఆకట్టుకుంది. కానీ కమర్షియల్‌ బ్రేక్‌ మాత్రం దక్కక పోవడంతో కాస్త కెరీర్‌ పరంగా ఇబ్బందిని ఎదుర్కొంటోంది. తెలుగులో దేవర సినిమాతో హిట్‌ అందుకున్న జాన్వీ కపూర్‌ ప్రస్తుతం రామ్‌ చరణ్‌ హీరోగా రూపొందుతున్న పెద్ది సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్‌లో సక్సెస్‌ రాని కారణంగానే టాలీవుడ్‌ మూవీస్ కి ఓకే చెబుతోంది అనే విమర్శలను జాన్వీ కపూర్‌ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ ఇటీవల పరమ్‌ సుందరి సినిమాతో వచ్చింది. ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ విడుదల తర్వాత ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది.

వరుణ్‌ ధావన్‌ హీరోగా సన్నీ సంస్కారీ కి తులసి కుమారి

పరమ్‌ సుందరి వచ్చి కొన్ని వారాలు కూడా కాలేదు, అప్పుడే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు జాన్వీ రెడీ అయింది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా వరుణ్‌ ధావన్‌ హీరోగా రూపొందిన సన్నీ సంస్కారి కి తులసి కుమారి సినిమా విడుదలకు రెడీ అయింది. అక్టోబర్‌ మొదటి వారంలో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్‌లో జాన్వీ కపూర్ పాల్గొంటుంది. ఈ సమయంలో ఆమె నెపొటిజం గురించి ప్రశ్నలు ఎదుర్కొంటుంది. తన కెరీర్‌ ఆరంభంకు బ్యాక్‌గ్రౌండ్‌ హెల్ప్‌ అయిందని, కానీ ఇండస్ట్రీలో కొనసాగడం తన ప్రతిభ వల్లే సాధ్యం అవుతుంది అన్నట్లుగా ఒక చిట్‌ చాట్‌లో జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. కొందరు మాత్రం జాన్వీ కపూర్‌ ఇండస్ట్రీలో హిట్‌ లేకున్నా కొనసాగడంకు కారణం శ్రీదేవి వారసురాలు కావడం అంటున్నారు. సాధారణంగా మరే హీరోయిన్‌ అయినా ఇన్ని ఫ్లాప్స్ పడితే ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అవుతుంది అంటున్నారు.

రామ్‌ చరణ్‌ పెద్ది సినిమాలో జాన్వీ కపూర్‌

జాన్వీ కపూర్‌కి క్రమం తప్పకుండా సినిమా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాతో అయినా జాన్వీ కపూర్‌ నిలుస్తుందని, ఈ సినిమాతో అయినా జాన్వీ కి హిట్‌ దక్కుతుందని ప్రతీ సారి అభిమానులు ,ఇండస్ట్రీ వర్గాల వారు అనుకుంటూ ఉంటారు. కానీ జాన్వీ కపూర్‌ ఎప్పటికప్పుడు నిరాశను మిగుల్చుతూ వచ్చింది. జాన్వీ కపూర్‌ కమర్షియల్‌ హిట్‌ను దక్కించుకోలేక పోయినా తన అందంతో, తన డాన్స్‌ తో ప్రేక్షకులను మెప్పించింది. అంతే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సొంతం చేసుకోవడంలో సక్సెస్‌ అయింది. ఆమె ఇండస్ట్రీలో ఇన్నాళ్లు కొనసాగడానికి కారణం ఆమె వారసత్వం కాదని, ఆమె అందం, ఆమె ప్రతిభ అని చాలా మంది బలంగా వాదించే వారు ఉన్నారు. టాలీవుడ్‌లో పెద్ది సినిమా కమర్షియల్‌ హిట్‌ అయితే ఖచ్చితంగా జాన్వీ కపూర్‌ వారు అందరికీ గట్టి సమాధానం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు సన్నీ సంస్కారి కి తులసి కుమారి సినిమా ఫలితంపై కూడా జాన్వీ ఆశలు పెట్టుకుని ఉంది. మరి ఈ రెండు సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.