జాన్వి కపూర్ టాలీవుడ్ ఆశలు..!
ఈలోగా చరణ్ బుచ్చి బాబుతో చేస్తున్న పెద్ది సినిమాలో ఛాన్స్ అందుకుంది అమ్మడు. ఏడాది కాలంగా ఆ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
By: Ramesh Boddu | 9 Jan 2026 3:00 PM ISTశ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్ కెరీర్ ఆశించిన స్థాయిలో కొనసాగట్లేదని చెప్పొచ్చు. దడక్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి రెండు మూడు సినిమాల దాకా హడావిడి చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత ఎందుకో కెరీర్ మీద అంత గ్రిప్ సాధించలేకపోయింది. ఇక సౌత్ ఎంట్రీగా తెలుగులో ఎన్టీఆర్ తో దేవర సినిమా చేసింది ఈ అమ్మడు. ఐతే ఆ సినిమాలో తంగం పాత్రలో జస్ట్ సాంగ్స్ కోసం తప్ప అమ్మడిని సరిగా వాడుకోలేదు. ఐతే దేవర 2 వస్తుందని ఎదురుచూడటం తప్ప చేసేదేమి లేకుండా పోయింది.
చరణ్, జాన్వి కపూర్ జోడీ.. చిరంజీవి, శ్రీదేవి జంట..
ఈలోగా చరణ్ బుచ్చి బాబుతో చేస్తున్న పెద్ది సినిమాలో ఛాన్స్ అందుకుంది అమ్మడు. ఏడాది కాలంగా ఆ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. చరణ్, జాన్వి కపూర్ జోడీ చిరంజీవి, శ్రీదేవి జంటని తలపించేలా ఉంటుందని అంటున్నారు. జాన్వి కపూర్ కూడా పెద్దితో ఒక మంచి బ్రేక్ రావాలని కోరుకుంటుంది. అమ్మడు లాస్ట్ ఇయర్ హిందీలో 3 సినిమాలు చేసింది. అందులో హోం బాండ్ కాస్త క్లిక్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన పరం సుందరి, సన్నీ సన్స్కారి కి తులసి కుమారి కూడా డిజప్పాయింట్ చేసింది.
ప్రస్తుతం పెద్ది తప్ప అమ్మడి ఖాతాలో మరో సినిమా లేదు. బాలీవుడ్ కన్నా టాలీవుడ్ ని నమ్ముకుంటే బెటర్ అని భావిస్తుందట జాన్వి కపూర్. ఎందుకంటే శ్రీదేవి తనయురాలిగా జాన్వికి ఆల్రెడీ తెలుగులో సూపర్ క్రేజ్ ఉంది. తను చేస్తా అంటే చాలు కానీ వరుస ఛాన్స్ లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు మేకర్స్. ఆమధ్య నాని సినిమాలో జాన్వి నటిస్తుందని వార్తలు వచ్చాయి కానీ అది జస్ట్ రూమర్ అని తెలిసింది.
పెద్దిలో అచ్చియమ్మ రోల్ లో..
ఐతే కాస్త కాన్సెంట్రేట్ చేస్తే జాన్వికి తెలుగులో మంచి అవకాశాలు వస్తాయి. పెద్ది హిట్ పడితే జాన్వి తెలుగులో బిజీ అవ్వడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. పెద్దిలో అచ్చియ్యమ్మ రోల్ లో నటిస్తున్న జాన్వి కపూర్ ఈసారి కేవలం గ్లామర్ పరంగానే కాకుండా యాక్టింగ్ తో కూడా తెలుగు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తుందని అంటున్నారు. బుచ్చి బాబు హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ని కూడా ఇంట్రెస్ట్ గా ఉండేలా రాసుకున్నాడట.
సో పెద్దితో బ్రేక్ వస్తే కచ్చితంగా జాన్వికి టాలీవుడ్ లో ఛాన్స్ లు క్యూ కట్టేస్తాయని చెప్పొచ్చు. జాన్వి కపూర్ కూడా తెలుగులో సినిమా అంటే కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా మంచి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఆశిస్తుంది. ఛాలెంజింగ్ రోల్స్ తో తనని ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటుంది అమ్మడు.
ఎలాగు ఎన్టీఆర్, చరణ్ లతో నటించింది కాబట్టి స్టార్ ఛాన్స్ లు క్యూ కడతాయి. ఐతే తెలుగులో టైర్ 2 హీరోలతో కూడా జాన్వి చేస్తే మాత్రం మంచి కథలు ఆమె దగ్గరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి జాన్వి ప్లానింగ్ అయితే బాగానే ఉంది కానీ పెద్ది తర్వాత కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.
