Begin typing your search above and press return to search.

అందాలతో ఆకట్టుకుంటున్న చికిరి.. రాత్రి వేళల్లో!

ఇందులో తన అందాలతో ఆకట్టుకుంది జాన్వి కపూర్..ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ.." మీ చికిరి" అంటూ క్యాప్షన్ కూడా జోడించింది.

By:  Madhu Reddy   |   9 Nov 2025 10:31 AM IST
అందాలతో ఆకట్టుకుంటున్న చికిరి.. రాత్రి వేళల్లో!
X

ఈమధ్య కాలంలో హీరోయిన్లు గ్లామర్ తో అభిమానులను కట్టిపడేయడమే కాకుండా తమ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు అప్పుడప్పుడు తమ పాత్రలను ఇలా సోషల్ మీడియా ద్వారానే రివీల్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అందాల తార అతిలోకసుందరి కూతురు నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ సోషల్ మీడియాను ఏ రేంజ్ లో ఉపయోగిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.





ముఖ్యంగా గ్లామర్ తో ఫాలోవర్స్ ను పెంచుకోవడమే కాకుండా తన సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా అభిమానులతో పంచుకోవడానికి సోషల్ మీడియాను అధికంగా ఉపయోగిస్తోంది. మొన్నటి వరకు పరమ్ సుందరి, సన్నీ సంస్కారీకి తులసి కుమారి వంటి చిత్రాలను సోషల్ మీడియా ద్వారా జోరుగా ప్రమోట్ చేసిన ఈమె.. అప్పుడే పెద్ది సినిమాని కూడా ప్రమోట్ చేయడం మొదలుపెట్టింది అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.





విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న చిత్రం పెద్ది. వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇకపోతే భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయడానికి మేకర్స్ ఇప్పటి నుంచే అప్డేట్స్ వదులుతున్న విషయం తెలిసిందే . అందులో భాగంగానే జాన్వి కపూర్ పై రాసిన "చికిరి చికిరి" అనే పాటను విడుదల చేశారు.. నిజానికి లిరికల్ సాంగ్ విడుదల చేస్తారన్నారు కానీ ఏకంగా వీడియో సాంగ్ ని రిలీజ్ చేసేసరికి అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు.





ఇందులో తన అందాలతో ఆకట్టుకుంది జాన్వి కపూర్..ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ.." మీ చికిరి" అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోల విషయానికి వస్తే.. గోల్డెన్ గ్లిట్టర్ కలిగిన వన్ స్లీవ్ లెస్ హ్యాండ్ కలిగిన లెహంగా ధరించిన ఈమె రాత్రి వేళల్లో ఈ గ్లిట్టర్ వెలుగుల్లో తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంది.





అంతేకాదు మరికొన్ని ఫోటోలలో రెడ్ అండ్ క్రీం కలర్ కాంబినేషన్ లో ఉన్న హెవీ ఎంబ్రాయిడరీ శారీ ధరించి తన అందాలతో మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా బ్లౌజ్ ను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న జాన్వీ.. అందమైన ఆభరణాలు ధరించి మరీ తన మేకోవర్ ను ఫుల్ ఫిల్ చేసింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. అమ్మడి అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఏది ఏమైనా తన అందంతో ఆకట్టుకుంటున్న జాన్వీ కపూర్ పెద్ది సినిమాతో సక్సెస్ అందుకోవాలని అభిమానులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.