Begin typing your search above and press return to search.

మాస్ ఫార్ములా జాన్వీకి వ‌ర్కౌట్ అయ్యేనా?

అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల త‌న‌య జాన్వీక‌పూర్ బాలీవుడ్ కి ఎలాంటి రోల్స్ తో లాంచ్ అయిందో తెలిసిందే అక్క‌డి ట్రెండ్ కి త‌గ్గ క‌థ‌లు, పాత్ర‌లు ఎంచుకుని ప్ర‌యాణం మొద‌లు పెట్టింది

By:  Srikanth Kontham   |   4 Nov 2025 4:00 AM IST
మాస్ ఫార్ములా జాన్వీకి వ‌ర్కౌట్ అయ్యేనా?
X

అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల త‌న‌య జాన్వీక‌పూర్ బాలీవుడ్ కి ఎలాంటి రోల్స్ తో లాంచ్ అయిందో తెలిసిందే అక్క‌డి ట్రెండ్ కి త‌గ్గ క‌థ‌లు, పాత్ర‌లు ఎంచుకుని ప్ర‌యాణం మొద‌లు పెట్టింది. ఇప్ప‌టి వ‌ర‌కూ చేసిన పాత్ర‌ల‌న్నీ క్లాసిక్ రోల్స్ గానే క‌నిపిస్తున్నాయి. తొలి సినిమా `ధ‌డ‌క్` లో ప్యూర్ ల‌వ్ స్టోరీలో క‌నిపించింది. ప్రేమ కోసం ప‌రిత‌పించే గాళ్ పాత్ర‌లో అల‌రించింది. ఆ త‌ర్వాత జాన్వీ పోషించిన పాత్ర‌ల‌న్నీ మ‌రింత క్లాసిక్ గా క‌నిపిస్తాయి. మధ్య‌లో `గుంజ‌న్ స‌క్సేనా: ది కార్గిల్ గాళ్` లో ఓ కొత్త త‌ర‌హా పాత్ర‌తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకుంది.

మొత్తంగా జాన్వీ బాలీవుడ్ కెరీర్ ఇంత వ‌ర‌కూ చూసుకుంటే క్లాసిక్ రోల్సే హైలైట్ అవుతాయి. అయితే అందుకు భిన్నంగా సౌత్ లో అమ్మ‌డి ప్ర‌యాణం మొద‌లైంద‌ని చెప్పొచ్చు. తొలి సినిమా `దేవర‌` లో మాస్ గాళ్ పాత్ర‌లో అల‌రించింది. తంగ పాత్ర‌లో అమ్మ‌డు మాస్ గా హైలైట్ అయింది. అమ్మ‌డి ఆహార్యం, యాస భాష‌లు త‌న‌కే కొత్త అనుభూతిని పంచాయి. ప్ర‌స్తుతం `పెద్ది`లో న‌టిస్తోంది. ఇందులో అమ్మ‌డు మోడ్ర‌న్ మాస్ అమ్మాయి గా క‌నిపించ‌బోతుంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్తో జాన్వీ పాత్ర ఎలా ఉంటుంద‌న్న‌ది ఓ ఐడియా వ‌చ్చింది. అచ్చియ‌మ్మ అనే పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది.

జాన్వీ లాంటి అంద‌మైన అమ్మాయి ఏకంగా 50 ఏళ్లు వెన‌క్కి వెళ్లి మ‌రీ అచ్చియ‌మ్మ అనే పేరు పెట్టాడంటే? పాత్ర కూడా ఆ పేరుకు త‌గ్గ‌ట్టే ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమా కూడా పీరియాడిక్ నేప‌థ్యంతో కూడుకున్న‌దే. చ‌ర‌ణ్ ఊర మాస్ లుక్.. ఎంచుకున్న క్రీడా నేప‌థ్యం..అందులో హీరో ఆట తీరు చూస్తుంటే? ప‌క్కా మాస్ బొమ్మ‌గా చెప్పొచ్చు. జాన్వీ పాత్ర కూడా అలాగే ఉంటుంది. చ‌ర‌ణ్ ప్రియురాలి పాత్ర‌లో జాన్వీ క‌నిపించ‌నుంది.

చ‌ర‌ణ్ మాస్ ఎలివేష‌న్ ఎలా ఉంటుందో ? చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ పాత్ర‌ను జాన్వీ 100 శాతం మ్యాచ్ చేయాలి. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు ఎగ్జిక్యూష‌న్ ఎలా ఉంటుంది? అన్న‌ది చూడాలి. సుకుమార్ స్కూల్ నుంచి వ‌చ్చిన‌ ద‌ర్శ‌కుడు కావ‌డంతో? ఆ విష‌యంలో ఎక్క‌డా త‌గ్గ‌డు అనే అంచ‌నాలు బ‌లంగా ఉన్నాయి. మరి మాస్ ఎలివేష‌న్ జాన్వీకి మార్కెట్ లో ఎలాంటి ఐడెంటిటీ తీసుకొస్తుందా? అన్న‌ది చూడాలి. ఇలాంటి పాత్ర‌తో క‌నెక్ట్ అయితే రెండు ర‌కాల ఉప‌యోగాలున్నాయి. టాలీవుడ్ స‌హా కోలీవుడ్ లో కూడా అమ్మ‌డికి అవ‌కాశాలు సుల‌భం అవుతాయి.