Begin typing your search above and press return to search.

ఈవెంట్లో క‌ళ్ల‌న్నీ జాన్వీ క‌ట్టుకున్న‌ చీరపైనే.. నెట్టింట ఒక‌టే ఆరాలు!

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన‌ మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ `పెద్ది` విజ‌యవాడ ఈవెంట్ బంప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   2 Jun 2026 12:29 PM IST
ఈవెంట్లో క‌ళ్ల‌న్నీ జాన్వీ క‌ట్టుకున్న‌ చీరపైనే.. నెట్టింట ఒక‌టే ఆరాలు!
X

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన‌ మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ `పెద్ది` విజ‌యవాడ ఈవెంట్ బంప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. వేలాది మంది మెగా ఫ్యాన్స్ స‌మ‌క్షంలో జ‌రిగిన‌ ఈ భారీ ఈవెంట్‌లో చిత్ర కథానాయిక జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా వేడుకలో అందరి కళ్లూ ఈ కుర్ర బ్యూటీ కట్టుకున్న అందమైన చీరపైనే.. విజయవాడ ఈవెంట్ కోసం జాన్వీ కట్టుకున్న ఆ చీర ఖరీదు ఎంత? ఆ స్పెషల్ డిజైనర్ చీరను ఎవరు డిజైన్ చేసి ఉంటారు? అన్న ఆరాలే సోషల్ మీడియాలో ఎక్కువగా క‌నిపిస్తున్నాయి.




జాన్వీ కపూర్ ఈ ఈవెంట్ కోసం ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా కలెక్షన్ నుండి ఎంచుకున్న ఒక లగ్జరియస్ చాక్లెట్ బ్రౌన్ కలర్ శారీని ధరించారు. ఈ చీరను షీర్ నెట్ .. జార్జెట్ ఫ్యాబ్రిక్‌తో ఎంతో అద్భుతంగా రూపొందించారు. చీర బోర్డర్ అంతటా కొన్ని ప్ర‌దేశాల‌లో సాంప్రదాయ మోటిఫ్స్‌తో కూడిన హెవీ ఎంబ్రాయిడరీ.. సీక్విన్స్ (మెరిసే పూసలు) - జరి వర్క్ తో చాలా రిచ్‌గా డిజైన్ చేసారు. అలాగే చీర బాడీ అంతటా చిన్న చిన్న సీక్విన్ ఛ‌మ్కీలు మెరుస్తూ మోడ్ర‌న్ స్టైల్ గ్లామర్‌ను అద్దాయి.




ఈ చీరకు మరింత రాయల్ లుక్ తీసుకొచ్చేలా బ్రౌన్ కలర్ హై-నెక్ (క్లోజ్డ్ నెక్) బ్లౌజ్ ధరించిన తీరు హృద‌యాల‌ను హ‌త్తుకుంది. బ్లౌజ్ మెడ భాగంలో.. చేతులపై చీర బోర్డర్‌కు మ్యాచ్ అయ్యేలా ఎంబ్రాయిడరీ వర్క్ హైలైట్. ఈ క్లాసిక్ ఎత్నిక్ లుక్‌కు త‌గ్గ‌ట్టుగా హెవీ గోల్డెన్ స్టేట్‌మెంట్ జుంకాలు, మ్యాచింగ్ గాజులు.. వింటేజ్ రింగ్స్ జాన్వీ అందాన్ని మరింత రెట్టింపు చేశాయి. సాంప్రదాయంలోని హుందాతనాన్ని, మోడ్రన్ స్టైల్‌ను బ్యాలెన్స్ చేస్తూ ఈ డిజైన్ పెద్ది వంటి భారీ సినిమా ఈవెంట్స్‌కు పర్ఫెక్ట్ ఛాయిస్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఏది ఏమైనా ఈవెంట్లో క‌ళ్ల‌న్నీ జాన్వీపైనే!




ఈ వేడుకలో జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. ప్రేక్షకులు త‌న‌పై చూపిస్తున్న ప్రేమ, ఆదరణ పై ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. రామ్ చరణ్ తో కలిసి నటించే అవకాశం రావడం తన అదృష్టమని.. అత‌డు అద్భుతమైన నటుడు .. గొప్ప వ్యక్తి అని కొనియాడారు. దర్శకుడు బుచ్చిబాబు అత్యంత ప్యాషనేట్ డైరెక్టర్ అని... రెహమాన్ ఒక లెజెండ్ అని ప్రశంసించారు. `పెద్ది` ఒక గ్రాండ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అని...ఈ సినిమా త‌ర్వాత తనకు మ‌రింత‌ గుర్తింపు పెరుగుతుంద‌ని జాన్వీ న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేసారు. జూన్ 4న ఈ స్పెషల్ సినిమాను బిగ్ స్క్రీన్‌పై ఆస్వాధించాలని కోరారు.