పెద్ది కంటే అచ్చియమ్మే హాట్ టాపిక్.. ఎందుకలా?
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ రోల్ హాట్ టాపిక్ గా మారింది. విడుదలైన తొలి రోజు నుంచే సోషల్ మీడియాలో అచ్చియమ్మ నేమ్ ట్రెండింగ్ లో ఉండటం విశేషం.
By: M Prashanth | 5 Jun 2026 2:45 PM ISTరామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమా విడుదలై థియేటర్స్ లో ఓ రేంజ్ లో సందడి చేస్తోంది. అయితే సినిమా రిలీజ్ అయ్యాక కేవలం సినిమా కథ, రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రమే కాకుండా.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ రోల్ హాట్ టాపిక్ గా మారింది. విడుదలైన తొలి రోజు నుంచే సోషల్ మీడియాలో అచ్చియమ్మ నేమ్ ట్రెండింగ్ లో ఉండటం విశేషం.
అయితే అచ్చియమ్మ రోల్ కు వచ్చిన రెస్పాన్స్ కంప్లీట్ గా పాజిటివ్ గా లేదు. ఎందుకంటే జాన్వీ క్యారెక్టరైజేషన్ పై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కొందరు ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం, పాత్రలోని కొన్ని విషయాలు టాలీవుడ్ కల్చర్ కు భిన్నంగా ఉన్నాయని అంటున్నారు. కథలో రోల్ ఇంపార్టెన్స్ కంటే కొన్ని సందర్భాల్లో బాడీ స్ట్రక్చర్ ను ఎక్కువ చూపించినట్లు అనిపించిందని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా కొన్ని సీన్స్ పై పలువురు నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నేటి ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టు ఉమెన్ లీడ్ రోల్స్ ను మరింత స్ట్రాంగ్ గా, ఇండిపెండెంట్ గా చూపించాల్సిన అవసరం ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో అచ్చియమ్మ రోల్ పై చర్చలు.. మెల్లగా ఉమెన్ రోల్స్ ఇంపార్టెన్స్, కమర్షియల్ సినిమాల్లో వారి క్యారెక్టరైజెషన్ వంటి అంశాల వైపు మళ్లుతున్నాయి.
ఇదిలా ఉండగా, జాన్వీ కపూర్ తన రోల్ కు సంబంధించి ఓ నెటిజన్ మేకర్స్ ను విమర్శిస్తూ పెట్టిన పోస్టును సోషల్ మీడియాలో లైక్ చేశారంటూ కొన్ని స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి. ఆ ప్రచారం మరింత చర్చకు కారణమైనప్పటికీ, దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయినప్పటికీ ఆ విషయం కూడా అచ్చియమ్మ చుట్టూ జరుగుతున్న చర్చలను మరింత పెంచింది.
సినిమా విడుదలైన రోజంతా సోషల్ మీడియాలో పెద్ది హ్యాష్ ట్యాగ్ తో పాటు అచ్చియమ్మ నేమ్ కూడా పెద్ద ఎత్తున ట్రెండ్ అవ్వడం గమనార్హం. సాధారణంగా హీరో పాత్రలు, స్టోరీ ఎక్కువ చర్చకు వస్తుంటాయి. కానీ ఈసారి ఒక ఫిమేల్ లీడ్ రోల్ అదే రేంజ్ లో చర్చనీయాంశంగా మారడం గమనార్హం. ఏదేమైనా అచ్చియమ్మ రోల్ పై ప్రశంసలు వచ్చినా, విమర్శలు వచ్చినా ప్రేక్షకుల్లో చర్చలు రేకెత్తించిందనేది మాత్రం నిజం. ఒక పాత్ర గురించి ఇంత చర్చ జరగడమంటే. ఆ రోల్ ఎఫెక్ట్ ఆడియన్స్ పై ఫుల్ గా ఉన్నట్లేనని మూవీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.
