మరో ట్రెండీ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చిన జాన్వీకపూర్!
ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న జాన్వీ కపూర్ గత కొన్ని రోజులుగా వినూత్నమైన వస్త్రాలతో అందరినీ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.
By: Madhu Reddy | 8 Oct 2025 10:03 AM ISTప్రస్తుతం పారిస్ లో ఫ్యాషన్ వీక్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు భిన్న విభిన్నమైన దుస్తులతో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటున్నారు. అటు ఫ్యాషన్ డిజైనర్స్ కూడా అద్భుతమైన దుస్తులను డిజైన్ చేసి.. సెలబ్రిటీల ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న జాన్వీ కపూర్ గత కొన్ని రోజులుగా వినూత్నమైన వస్త్రాలతో అందరినీ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈమెతో పాటు ఈమె దుస్తులను డిజైన్ చేసిన ఫ్యాషన్ డిజైనర్స్ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా మరోసారి ఫ్యాషన్ వీక్ ఫెస్టివల్ లో మెరిసిన జాన్వీ కపూర్.. అందులో తన అద్భుతమైన డ్రెస్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది.. తాజాగా రియా కపూర్ తో కలిసి పారిస్ ఫ్యాషన్ వీక్ లో సందడి చేసింది జాన్వీ కపూర్.
ఈ ఫ్యాషన్ వీక్ లో ప్రముఖ ఫ్రెంచ్ ఫ్యాషన్ డిజైనర్ ఇమ్మానుయేల్ ఉంగరో పారలెల్ డిజైన్ చేసిన అద్భుతమైన దుస్తులను ధరించి తమ ఫ్యాషన్ సెన్స్ ను ప్రదర్శించారు. ఫుల్ స్లీవ్ కలిగిన బ్లాక్ అండ్ వైట్ మినీ డ్రెస్ ధరించిన ఈ ముద్దుగుమ్మలు ఇద్దరూ కూడా తమ అద్భుతమైన ప్రదర్శనతో ఫ్యాషన్ వీక్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా జాన్వీ కపూర్ జుట్టును ముడిపెట్టి, FW1987 బ్యాగును ధరించి మరింత స్టైలిష్ గా కనిపించింది.ప్రస్తుతం వింటేజ్ లుక్ లో కనిపిస్తూ అందరి హృదయాలను దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.
జాన్వీ కపూర్ సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఈ మధ్యకాలంలో కథల ఎంపిక విషయంలో తడబడుతోందేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈమధ్య వరుసగా పరమ్ సుందరి, హోమ్ బౌండ్, సన్నీ సంస్కారికీ తులసీ కుమారి అంటూ వరుసగా మూడు చిత్రాలలో నటించింది. కానీ మూడు కూడా డిజాస్టర్ గా నిలిచాయి. అలా హ్యాట్రిక్ ఫ్లాప్ ను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
మరొకవైపు తెలుగులో దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన జాన్వీ కపూర్.. ఇప్పుడు రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబినేషన్లో వస్తున్న పెద్ది సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే నాని ది ప్యారడైజ్ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇంకా దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడలేదు.
అలాగే బాలీవుడ్లో తఖ్తా అనే సినిమాలో కూడా నటిస్తోంది. మరి ఈ సినిమాలైనా ఈమె కెరీర్ కు ఉపయోగపడాలి అని అభిమానులు కోరుకుంటున్నారు. మరొకవైపు బాలీవుడ్ లోనే కాదు ఇటు టాలీవుడ్ లో కూడా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా రికార్డ్ సృష్టించింది.
