జాన్వీ ఇస్టయిల్ ఎక్కడి నుంచి కాపీనో తెలుసా?
1986లో గలియానో మొదటిసారి `ఫాలెన్ ఏంజెల్స్` పేరుతో రూపొందించిన ఫ్యాషన్ శైలిని చాలా మంది ఫ్యాషన్ గురువులు తమ క్యాట్ వాక్ మోడల్స్ కోసం ఉపయోగించారు.
By: Sivaji Kontham | 7 Oct 2025 9:32 AM ISTప్యారిస్ అయినా షేక్ అయ్యేలా జాన్వీ ఇస్టయిల్ చూసారా? ఈ స్టయిల్ మునుపెన్నడూ చూడలేదా? కనీవినీ ఎరుగనిది! అంటూ కితాబిచ్చేస్తున్నారా? అయితే ఈ స్టయిల్ వెనక చాలా పెద్ద కథే ఉంది. ఇది ప్యారిస్ ఫ్యాషన్ ప్రపంచంలో అత్యుత్తమమైన ఫ్యాషన్ శైలిగా రికార్డుల్లో ఉంది.
1986లో గలియానో మొదటిసారి `ఫాలెన్ ఏంజెల్స్` పేరుతో రూపొందించిన ఫ్యాషన్ శైలిని చాలా మంది ఫ్యాషన్ గురువులు తమ క్యాట్ వాక్ మోడల్స్ కోసం ఉపయోగించారు. ఇప్పుడు దానిని జాన్వీకపూర్ కూడా అనుకరించింది. స్టెల్లా మోడల్ కి అయినా మతి చెడేలా జాన్వీ విన్యాసాలు చూడతరమా? ఈ స్పెషల్ డిజైనర్ థై స్లిట్ ఫ్రాక్ లో జాన్వీ సంథింగ్ స్పెషల్‌గా కనిపిస్తోంది. పైగా బ్లాక్ కలర్ గ్లాసెస్ ధరించి జాన్వీ విన్యాసాలు రక్తి కట్టిస్తున్నాయి. ఎంపిక చేసుకున్న దుస్తులకు తగ్గట్టుగానే జాన్వీ బ్లాక్ గాగుల్స్, కాంబినేషన్ హై హీల్స్ ధరించింది. ప్యారిస్ వీధుల్లో జాన్వీ క్యాట్ వాక్ ల విన్యాసాల వీడియో కూడా ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.
దీనికి జాన్వీ ఆసక్తికర క్యాప్షన్ ని ఇచ్చింది. ``హాయ్ పారిస్! - జోయిర్ 1-లా వీ పరిసెనే... రెండెజ్-వౌస్, ఫ్యాబులెక్స్.. 1986లో గలియానో తొలి `ఫాలెన్ ఏంజెల్స్` నుండి సిజర్-ప్లీట్ డ్రెస్ ఇది`` అని పరిచయం చేసారు.
జాన్వీకపూర్ తదుపరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన `పెద్ది` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దేవర తర్వాత జాన్వీకి తెలుగులో భారీ చిత్రమిది. ఎన్టీఆర్- కొరటాల `దేవర 2`ని ప్రకటించారు. ఈ చిత్రంలోను జాన్వీకపూర్ నటించేందుకు అవకాశం ఉంది. బాలీవుడ్ లో ఇటీవలే సన్నీ సంస్కారీకి తులసీ కుమారి చిత్రంలో నటించింది. రోమ్ కామ్ జానర్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా ఆడింది.
