Begin typing your search above and press return to search.

జాన్వీపై పెరుగుతున్న ట్రోలింగ్.. ఏమైందంటే?

అంతేకాదు మలయాళీ పాత్రలో జాన్వీ కపూర్ కాస్త అతి చేసినట్టు అనిపిస్తుంది అని,ఆమె భాష కూడా అంత బాగా లేదని డైలాగ్స్ అస్సలు సెట్ కాలేదని అంటున్నారు చాలామంది అభిమానులు.

By:  Madhu Reddy   |   26 Oct 2025 10:00 PM IST
జాన్వీపై పెరుగుతున్న ట్రోలింగ్.. ఏమైందంటే?
X

జాన్వీ కపూర్ - సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన ' పరమ్ సుందరి' మూవీ ఆగస్టు 29న విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా తాజాగా అక్టోబర్ 24న ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే చాలా సినిమాలు థియేటర్లలో ఫ్లాప్ అయినప్పటికీ ఓటీటీలో మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్నాయి. కానీ ఈ సినిమాకి మాత్రం థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా ఊహించని టాక్ వచ్చింది. అసలు ఈ సినిమా చూడడానికి ఎవరు ఇష్టపడడం లేదు.. ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందనే ఉత్సాహం కంటే చాలామంది అభిమానుల్లో నిరాశనే కనిపిస్తోంది. ఎక్కువ మంది సినీ ప్రేక్షకులు ఈ సినిమా పట్ల నిరాశను కలిగి ఉన్నారు. దానికి కారణం ఈ సినిమాలో జాన్వీ కపూర్ నటనపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

ముఖ్యంగా జాన్వీ కపూర్ ఈ మూవీలో మలయాళీ అమ్మాయిగా కనిపించింది. అయితే మలయాళ అమ్మాయిగా జాన్వీ కపూర్ చేసిన ప్రయత్నం అస్సలు ఫలించలేదని, మలయాళీ అమ్మాయిగా జాన్వీ కపూర్ సెట్ అవ్వలేదని ఆమె ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఆ పాత్రలో జాన్వీ కపూర్ ఏదో బలవంతంగా నటించినట్టు, భయంకరంగా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. జాన్వీ కపూర్ యాక్టింగ్ కి తోడు కథ కూడా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రల పాత్రలు అస్సలు కనెక్ట్ కాలేదని అంటున్నారు.ముఖ్యంగా వారు పోషించిన పాత్రలు బలంగా లేవని.. ఏదో వారి మీద బలంగా రుద్దినట్టుగా కనిపిస్తున్నాయి.కానీ సహజంగా నటించలేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

అంతేకాదు మలయాళీ పాత్రలో జాన్వీ కపూర్ కాస్త అతి చేసినట్టు అనిపిస్తుంది అని,ఆమె భాష కూడా అంత బాగా లేదని డైలాగ్స్ అస్సలు సెట్ కాలేదని అంటున్నారు చాలామంది అభిమానులు. జాన్వీ ని మలయాళీ పాత్రలో ఊహించుకోలేకపోతున్నామని కామెంట్స్ చేస్తున్నారు. అలా చాలామంది సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసే నెటిజన్స్ జాన్వీ కపూర్ పై విమర్శలు చేయడానికి అస్సలు వెనకడుగు వేయడం లేదు.ముఖ్యంగా మలయాళీ పాత్రకు తగ్గట్టుగా జాన్వీ కపూర్ రెడీ కాలేదని,భాష మరియు సంస్కృతిని హేళన చేసినట్లుగా, అగౌరవపరిచినట్లుగా ఉందని అంటున్నారు.ఎవరైనా సరే సాంస్కృతిక పాత్రల్లో నటించాలంటే కచ్చితంగా ముందే ఆ పాత్రల గురించి పూర్తిగా తెలుసుకొని ఆ పాత్రలు పోషించడం బెటర్ అంటూ గుర్తు చేస్తున్నారు.ఏది ఏమైనప్పటికి జాన్వీ కపూర్ పరమ్ సుందరి మూవీతో సౌత్ ఇండస్ట్రీలో చాలా విమర్శలు మూటగట్టుకుంది.అలా ఈ సినిమాని ఓటీటీలో చూడడానికి కూడా చాలా మంది ప్రేక్షకులు ఆసక్తి కనబరచడం లేదు.

ఇక పరమ్ సుందరి మూవీ కథ ఏంటంటే.. ఢిల్లీకి చెందిన సిద్ధార్థ్ మల్హోత్రా తన తండ్రి సంపాదించిన డబ్బులతో కొన్ని కంపెనీలలో పెట్టుబడి పెట్టాలనుకుంటారు. అలా ఓ డేటింగ్ యాప్ పై పెట్టుబడి పెట్టాలనుకున్న సమయంలో తన తండ్రి ఒక కండిషన్ పెడతారు. ఆ కండిషన్ మేరకు ఆయన కేరళ వెళ్ళిపోతారు. అలా కేరళ వెళ్లి జాన్వీ కపూర్ ఇంట్లో రెంట్ కు దిగిన సమయంలో జాన్వీ కపూర్ తో ప్రేమలో పడతారు. కానీ ఆ తర్వాత తన తండ్రి పెట్టిన కండిషన్ డేటింగ్ యాప్ గురించి సిద్ధార్థ్ మల్హోత్రా చెప్పడంతో జాన్వీ అతనికి బ్రేకప్ చెబుతుంది.అయితే సిద్ధార్థ్ మల్హోత్రా కి ఆయన తండ్రి పెట్టిన కండిషన్ ఏంటి.. ? జాన్వీ కపూర్ ఎందుకు బ్రేకప్ చెబుతుంది..? ఆ తర్వాత మళ్లీ వీళ్ళు కలుస్తారా? అనేది కథ.. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరో హీరోయిన్ లు తమ పాత్రలని సరిగ్గా పండించలేదని సినిమా విడుదలైన మొదటి షో తోనే చాలామంది పసిగట్టారు.