'పరమ్ సుందరిని' రౌండప్ చేసారు
అయితే అక్కడి నుంచి వెళ్లేప్పుడు జాన్వీని చుట్టూ ఉన్న జనం రౌండప్ చేసారు. కదలడానికి కూడా వీల్లేనంతగా భక్తులు తనను రౌండప్ చేయడంతో జాన్వీ చాలా కన్ఫ్యూజ్ అయినట్టే కనిపిస్తోంది.
By: Sivaji Kontham | 29 Aug 2025 9:07 AM IST''ఇలా రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి.. కన్ఫ్యూజన్‌లో ఎక్కువ చిక్కుల్లో పడతారు!''.. 'పరమ్ సుందరి' జాన్వీకపూర్ వ్యవహారం చూస్తుంటే అలానే ఉంది. ఇటీవల ముంబై లాల్‌బాగ్చా రాజా సందర్శన సమయంలో పరమ్ సుందరి జాన్వీ కపూర్ సందడి చర్చగా మారింది. విఘ్నవినాయకుని ఆశీస్సులు అందుకుని తన కథానాయకుడు సిద్ధార్థ్ తో కలిసి అక్కడి నుంచి జాన్వీ నిష్కృమిస్తోంది.
అయితే అక్కడి నుంచి వెళ్లేప్పుడు జాన్వీని చుట్టూ ఉన్న జనం రౌండప్ చేసారు. కదలడానికి కూడా వీల్లేనంతగా భక్తులు తనను రౌండప్ చేయడంతో జాన్వీ చాలా కన్ఫ్యూజ్ అయినట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం జాన్వీ చుట్టూ జనం మూగి ఉన్న ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ఒక పెద్ద ఈవెంట్ నుంచి చాలా కష్టంగా జాన్వీ- సిధ్ జంట బయటపడ్డారని కూడా అర్థమవుతోంది.
అయితే లక్షలాదిగా జనం గుమిగూడే చోట సినిమా ప్రచారానికి వెళ్లాలనుకోవడం ఒక రకంగా అవివేకం. పబ్లిక్ గేదరింగ్స్ లో సెలబ్రిటీలను కాపలా కాసే పోలీసులు లేదా సెక్యూరిటీ సిబ్బంది చాలా రిస్కును ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి చోట సరైన సిబ్బంది లేకపోయినా సెలబ్రిటీలకు చుక్కలు కనిపిస్తాయి. అదృష్టవశాత్తూ జాన్వీ అక్కడి నుంచి బయటపడింది.
సినిమా మ్యాటర్ కి వస్తే, పరమ్ సుందరి చిత్రానికి తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. దినేష్ విజన్ నిర్మాత. ఒక అందమైన కేరళ అమ్మాయి ప్రేమలో పడిన దిల్లీ అబ్బాయి కథేమిటన్నది ఈ సినిమాలో చూపిస్తున్నారు. పరమ్ సుందరి విన్యాసాలు, క్రాస్ కల్చర్ లవ్ స్టోరి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆగస్టు 29న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఇది చెన్నయ్ ఎక్స్ ప్రెస్, టూ స్టేట్స్ కథలతో ఎలా వైవిధ్యంగా ఉంటుందో థియేటర్లలో చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమాలో సగం తమిళమ్మాయి, సగం కేరళ అమ్మాయిగా కనిపిస్తానని జాన్వీ కపూర్ చెబుతోంది. జాన్వీ అందచందాలు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ కాగా, సిధ్ ఎనర్జీ కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.
