Begin typing your search above and press return to search.

ఈ రొమాంటిక్‌ నెంబర్‌తో జాన్వీ బాలీవుడ్‌లోనూ..!

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలుగా 'ధడక్‌' సినిమాతో 2018లో బాలీవుడ్‌లో అడుగు పెట్టిన జాన్వీ కపూర్‌ మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.

By:  Ramesh Palla   |   9 Aug 2025 4:10 PM IST
ఈ రొమాంటిక్‌ నెంబర్‌తో జాన్వీ బాలీవుడ్‌లోనూ..!
X

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలుగా 'ధడక్‌' సినిమాతో 2018లో బాలీవుడ్‌లో అడుగు పెట్టిన జాన్వీ కపూర్‌ మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఆ సినిమా కమర్షియల్‌గా పెద్దగా ఆడలేదు. నటిగా జాన్వీ కపూర్‌కి పర్వాలేదు అన్నట్లుగా రివ్యూలు దక్కించుకుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో కమర్షియల్‌ హిట్‌ కోసం అప్పటి నుంచి ఇప్పటి వరకు వెయిట్‌ చేస్తూనే ఉంది. ఆ ఏడు ఏళ్ల కాలంలో జాన్వీ కపూర్‌ నటించిన పలు హిందీ సినిమాలు వచ్చాయి. వాటిల్లో ఏ ఒక్కటి కమర్షియల్‌గా బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలవలేదు. అలాంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాల కోసం ఈ అమ్మడు ఎదురు చూస్తుంది. ఈ సమయంలో జాన్వీ కపూర్‌ కి టాలీవుడ్‌లో దేవరతో భారీ విజయం దక్కింది. కానీ హిందీలో మాత్రం హిట్‌ కోసం ఇంకా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొన్ని విషయం తెల్సిందే.

భీగీ శ్రీ రెయిన్‌ సాంగ్‌తో అంచనాలు పైపైకి..!

జాన్వీ కపూర్ ప్రస్తుతం నటిస్తున్న పరమ్‌ సుందరి సినిమాతో ఆ ఎదురు చూపులకు తెర పడేలా ఉంది. సిద్దార్థ్‌ మల్హోత్ర హీరోగా జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా రూపొందిన పరమ్‌ సుందరి సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అంచనాలను అందుకునే విధంగా మేకర్స్ సినిమాను రూపొందించారు అనేది టాక్‌. తాజాగా విడుదలైన రెయిన్ రొమాంటిక్‌ నెంబర్‌ భీగీ శ్రీ కి మంచి రెస్పాన్స్ దక్కింది. జాన్వీ కపూర్‌ను సాధారణంగానే చాలా అందంగా చూస్తూ ఉంటాం. ఈ సాంగ్‌ లో రెట్టింపు అందంతో జాన్వీ కపూర్ కనిపిస్తుందని పలువురు అంటున్నారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ పాట మారుమ్రోగుతున్న విషయం తెల్సిందే. ఈ పాట కారణంగా పరమ్‌ సుందరి సినిమాపై అంచనాలు పెరిగాయి.

సిద్దార్థ్‌ మల్హోత్ర, జాన్వీ కపూర్‌ల రొమాంటిక్‌ నెంబర్‌

కేరళ బ్యాక్‌డ్రాప్‌ లో రూపొందిన పరమ్‌ సుందరి సినిమా నుంచి అప్‌డేట్‌ వచ్చిన ప్రతిసారి అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఈ పాట ఆన్ లైన్ ద్వారా విడుదలైనప్పటి నుంచి ఎప్పుడు ఈ సినిమా విడుదల కాబోతుందని మరీ సోషల్‌ మీడియాలో సెర్చ్ చేస్తున్నారట. ఈ సినిమా గురించిన విషయాలను తెలుసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి జాన్వీ కపూర్‌ సోషల్‌ మీడియా ద్వారా ఎంతటి పాపులర్ అయిందో, ఈ పాట కూడా అంతకు మించిన పాపులారిటీని సొంతం చేసుకుందని చెప్పుకోవచ్చు. బాక్సాఫీస్‌ను షేక్ చేసే విధంగా పరమ్‌ సుందరి ఉండబోతుంది అనే విధంగా సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్‌ ఉంటుంది. ఈ పాటలో సిద్దార్థ్‌, జాన్వీల రొమాన్స్ పీక్స్‌కి చేరింది. ఇద్దరి కాంబోకి మొదటి సినిమా అయినప్పటికీ మంచి కమర్షియల్‌ సినిమాగా పరమ్‌ సుందరి నిలిచే అవకాశాలు ఉన్నాయి.

పెద్ది సినిమాలో జాన్వీ కపూర్‌

బాలీవుడ్లో చాలా కాలంగా హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్న జాన్వీ కపూర్ కి ఖచ్చితంగా పరమ్‌ సుందరి సినిమా భారీ హిట్‌ ను కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా సాధించిన వసూళ్లతో జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లోనూ టాప్‌ హీరోయిన్‌గా నిలవడంతో పాటు, అక్కడ ముందు ముందు పెద్ద హీరోల సినిమాల్లోనూ నటించే అవకాశాలు ఉన్నాయి. జాన్వీ కపూర్‌కు సంబంధించిన ప్రతి సినిమాను ఒక వర్గం ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు. కానీ ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు చూసి ఆనందించడం ఖాయంగా కనిపిస్తుంది. జాన్వీ కపూర్‌ తెలుగులో పెద్ది సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాలో రామ్‌ చరణ్‌ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ సినిమాలోనూ కనిపించబోతుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఆ విషయమై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.