అలా మాట్లాడితే జాన్వీకి కోపం వస్తుందట..!
జాన్వీ కపూర్ గురించి సినిమాల్లో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటుంది అనే విమర్శ ఉంది. అయినా పట్టించుకోకుండా జాన్వీ కపూర్ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది.
By: Ramesh Palla | 6 April 2026 12:27 PM ISTబాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా దేశంలోని అన్ని భాషల ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసి, అభిమాన హీరోయిన్‌గా నిలిచిన అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చింది. శ్రీదేవికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరూ హీరోయిన్స్‌గానే ఇండస్ట్రీలో ఉన్నారు. అయినా కూడా అంతా జాన్వీ కపూర్ గురించి మాట్లాడుకుంటారు. అందుకు కారణం ఆమె అందం, ఆమె సోషల్ మీడియా పోస్ట్‌లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయినా కమర్షియల్ బ్రేక్ దక్కించుకోలేక పోయిన జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేసే అందమైన ఫోటోల కారణంగా వార్తల్లో నిలుస్తుంది. దాంతో హీరోయిన్‌గా ఆఫర్లను దక్కించుకుంటూ ఉంటుంది. జాన్వీ కపూర్ గురించి సినిమాల్లో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటుంది అనే విమర్శ ఉంది. అయినా పట్టించుకోకుండా జాన్వీ కపూర్ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది.
ఫోటో షూట్స్ తో జాన్వీ కపూర్ వైరల్...
జాన్వీ కపూర్ ఫోటోలు రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం చూస్తూ ఉంటాం. తన ఫోటో షూట్ ఫోటోలను జాన్వీ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడం లేదంటే, ఏదైనా కార్యక్రమంకు వెళ్లిన సమయంలో మీడియా ఫోటోగ్రాఫర్లకు ఫోజ్‌లు ఇవ్వడం ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. జాన్వీ కపూర్ ఎక్కువగా పాపరాజీల దృష్టిని ఆకర్షించే విధంగా ఔట్ ఫిట్‌ను ధరిస్తుంది అనే టాక్ కూడా ఉంది. గతంలో పలు సార్లు పాపరాజీల గురించి పాజిటివ్‌గా మాట్లాడిన జాన్వీ కపూర్ తాజాగా ఒక చిట్ చాట్ సందర్భంగా వారు అప్పుడప్పుడు చేసే వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేసింది. సందర్భానుసారంగా తాను ధరించిన డ్రెస్‌ను పాపరాజీలు ఇష్టానుసారంగా ఫోటోలు తీసుకుని, అందంగా లేదు అంటూ కామెంట్ చేయడంపై ఆమె తాజా చిట్ చాట్‌లో స్పందించింది.
పాపరాజీలపై జాన్వీ కపూర్ కామెంట్స్...
తన ఫోటోలను కొన్ని యాంగిల్స్‌లో చూసి పాపరాజీలు, నెటిజన్స్ 'ఈమె హాట్‌గా లేదు, అందంగా లేదు' అంటూ కామెంట్ చేయడం వంటివి చేస్తే కోపం వస్తుందని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. తన గురించి ఇతరులు మాట్లాడుకోవడం పర్వాలేదు కానీ, తన గురించి పదే పదే నెగిటివ్‌గా మాట్లాడుకోవడం కోపం తెప్పిస్తుందని జాన్వీ కపూర్ అంది. తాను ఎన్నో ఫోటో షూట్స్‌లో హాట్‌గా అందంగా కనిపించాను. కొన్ని ఫోటోలను యాంగిల్ లేకుండా తీసి, ఇష్టానుసారంగా పోస్ట్ చేసిన పాపరాజీల ఫోటోలను చూసి కొందరు హాట్‌గా లేదని వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు అన్నట్లుగా జాన్వీ కపూర్ అసహనం వ్యక్తం చేసింది. కంఫర్ట్ లేకుండా రకరకాల యాంగిల్స్ నుంచి ఫోటోలు తీయడం అనేది ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ ఫోటోలను వారు హాట్‌గా లేదని కామెంట్ పెట్టి పోస్ట్ చేయడంను జాన్వీ కపూర్ తప్పుబట్టింది.
రామ్ చరణ్, బుచ్చిబాబు పెద్ది సినిమాలో...
జాన్వీ కపూర్ గత ఏడాది మూడు హిందీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ మూడు సినిమాలు సైతం తీవ్రంగా నిరాశ పరిచాయి. గత ఏడాది జాన్వీ కపూర్‌కి శృంగార తారగా మరింత గుర్తింపు దక్కింది. కానీ ఎప్పటిలాగే హిట్ మాత్రం దక్కలేదు. కానీ జాన్వీ కపూర్ ఈ ఏడాది పై చాలా ఆశలు పెట్టుకుంది. ఒకటి రెండు బాలీవుడ్ సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. మరో వైపు రామ్ చరణ్ తో నటించిన పెద్ది సినిమా విడుదలకు ముస్తాబు అవుతుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతున్నట్లుగా ఇప్పటి వరకు విడుదలైన పాటలను బట్టి అర్థం అవుతుంది. ఇప్పటికే జాన్వీ కపూర్ లుక్‌కి, ఆమె యొక్క బాడీ లాంగ్వేజ్‌కి మంచి స్పందన వచ్చింది. సినిమా హిట్ అయితే జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా, అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్‌గా మారే అవకాశం ఉంది. మరో వైపు బాలీవుడ్‌లోనూ ఈమె బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
