జాన్వీ కపూర్ లిస్ట్ లో ఉన్న తెలుగు హీరోలు!
మరి తదుపరి జాన్వీ నటించాల్సిన పాన్ ఇండియా హీరోలు ఎవరు? అంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డార్లింగ్ ప్రభాస్ మాత్రమే. తెరపై బన్నీకి అమ్మడు పర్పెక్ట్ జోడీగా సెట్ అవుతుంది.
By: Srikanth Kontham | 8 March 2026 5:00 AM ISTఅతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా వెండి తెరకు పరిచయం అయిన జాన్వీ కపూర్ తెలుగు పరిశ్రమలో టాప్ స్టార్లే టార్గెట్ గా అవకాశాలు అందుకుంటోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి చిత్రం `దేవర`లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడీగా నటించింది. ఈ సినిమా సెట్స్ లో ఉండగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన `పెద్ది`లో ఛాన్స్ అందు కుంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఇద్దరు బిగ్ స్టార్స్ ను జాన్వీ కవర్ చేసినట్లు అయింది. మరోసారి `దేవర 2` లో ఎన్టీఆర్ సరసన కనిపించనుంది. ఇది పూర్తి చేయగల్గితే తారక్ కో రెండు సార్లు పనిచేసినట్లు అవుతుంది.
మరి తదుపరి జాన్వీ నటించాల్సిన పాన్ ఇండియా హీరోలు ఎవరు? అంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డార్లింగ్ ప్రభాస్ మాత్రమే. తెరపై బన్నీకి అమ్మడు పర్పెక్ట్ జోడీగా సెట్ అవుతుంది. కానీ ప్రభాస్ కటౌట్ ను మ్యాచ్ చేయడం అంత సులభం కాదు. అదంతా కెమెరా మెన్ మీద ఆధారపడి ఉంటుంది. `వారణాసి`తో సూపర్ స్టార్ మహేష్ కూడా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నారు. జాన్వీ లిస్ట్ లో మహేష్ కూడా చేరుతాడు. దీంతో టైర్ వన్ లో పాన్ ఇండియా స్టార్లు పూర్తయినట్లే. అయితే జాన్వీ కపూర్ కోరుకుంటోన్న ఓ హీరో ఉన్నాడు. అతడే విజయ్ దేవరకొండ.
`అర్జున్ రెడ్డి` సినిమాతో అమ్మడు విజయ్ కి అభిమానిగా మారిపోయింది. ఆ సమయంలోనే విజయ్ తో కలిసి సినిమా చేయాలని ఆసక్తిని వ్యక్తం చేసింది. అప్పటి నుంచి ఆ కోరిక అలాగే ఉండిపోయింది. పాన్ ఇండియా స్టార్స్ తో అవకా శాలు అందుకుంటుంది గానీ, విజయ్ తో కలిసి నటించే అవకాశం మాత్రం రాలేదు. తర్వాత తరం పాన్ ఇండియా స్టార్లు అంటే నాగచైతన్య, అఖిల్, నిఖిల్, తేజ సజ్జా లాంటి వాళ్లకు ఛాన్స్ ఉంది. సీనియర్ హీరోలైన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి లాంటి స్టార్స్ చిత్రాల్లో జాన్వీ కీలక పాత్రల వరకే పరిమితం అవుతుంది.
అలాగే అమ్మడు ఇంత వరకూ కోలీవుడ్ లో కూడా లాంచ్ అవ్వలేదు. అక్కడా సరైన సమయం కోసం ఎదురు చూస్తుంది. సిస్టర్ ఖుషీ కపూర్ తమిళ్ లో లాంచ్ అవుతుందనే ప్రచారం ఆ మద్య జరిగింది గానీ మళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు. ప్రస్తుతం ఖుషీ కూడా బాలీవుడ్ సినిమాలపైనే ఫోకస్ పెట్టి పని చేస్తోంది. అమ్మడు ఇంకా అక్కడ సరైన విజయాన్ని అందుకోలేదు. జాన్వీ కపూర్ కు దక్కిన బజ్ ఖుషీ కి రావడం లేదు. ఈ విషయంలో డాడ్ బోనీ కపూర్ చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు.
