Begin typing your search above and press return to search.

రాజ్ కపూర్ - అమితాబ్ బచ్చన్ లా చ‌ర‌ణ్ -తార‌క్!

భారతీయ చలనచిత్ర పరిశ్రమ ప్రాంతీయ హద్దులను దాటి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటోంది.

By:  Srikanth Kontham   |   30 May 2026 1:42 PM IST
రాజ్ కపూర్ - అమితాబ్ బచ్చన్ లా చ‌ర‌ణ్ -తార‌క్!
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమ ప్రాంతీయ హద్దులను దాటి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటోంది. ముఖ్యంగా దక్షిణ భారత సినిమాలు, అందులోనూ తెలుగు చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా సృష్టిస్తున్న ఇంపాక్ట్ సాధారణమైనది కాదు. ఒకప్పుడు బాలీవుడ్ మాత్రమే విదేశాల్లో భారతీయ సినిమాకు ప్రతిరూపంగా నిలిచేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంలో టాలీవుడ్ సినిమాలు సరికొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తున్నాయి. ఈ మార్పును బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత అనుభవం పంచుకున్నారు.

విదేశాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో తనకు ఎదురైన ఓ ఆసక్తికర సంఘటనను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా భారతీయ సినిమాను గుర్తించడానికి సరికొత్త రెఫరెన్స్ పాయింట్ ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన `ఆర్ఆర్ఆర్`సాధించిన ప్రపంచ స్థాయి విజయం.. అందులోని కథానాయకులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల నటన విదేశీయులపై ఎంతటి బలమైన ముద్ర వేసిందో? జాన్వీ అక్షరాలా అంగీకరించారు. విదేశీ విమానాశ్రయాల్లో అంతర్జాతీయ వేదికలపై భారతీయుల గురించి చర్చ జ‌రిగిన‌ప్పుడు ఆర్ ఆర్ ఆర్ చిత్రం ..ఆ ఇద్దరు స్టార్స్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయని జాన్వీ తెలిపింది.

ఒకప్పుడు భారతీయ సినిమా అంటే రాజ్ కపూర్, అమితాబ్ బచ్చన్ , షారుఖ్ ఖాన్ ల పేర్లు మాత్రమే విదేశీయులకు గుర్తొచ్చేవి. కానీ నేడు `నాటు నాటు` పాట ఆస్కార్ గెలుచుకోవడం.. అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాలు రికార్డులు సృష్టించడం తో గ్లోబల్ ఆడియన్స్ చూపు సౌత్ సినిమా వైపు మ‌ళ్లిందన్నారు. రామ్ చరణ్- ఎన్టీఆర్ లు గ్లోబల్ ఐకాన్స్‌గా ఎదగడం అనేది యావత్ భార తీయ సినీ రంగానికి గర్వకారణంగా మారిందని జాన్వీ అభిప్రాయ‌ప‌డింది. తాను ఏ దేశం వెళ్లినా? త‌న‌తో క‌లిసి ప‌ని చేసిన వారి గురించి తెలిసిన వారు క‌న‌బ‌డితే త‌ప్ప‌క అడుగు తార‌ని..ఒక‌ప్పుడు ఇలాంటి చ‌ర్చ రాజ్ కపూర్-అమితాబ‌చ్చ‌న్ ల గురించి జ‌రిగేద‌ని మామ్ శ్రీదేవి చెప్పేవారంది.

మొత్తానికి `ఆర్ఆర్ఆర్` చిత్రం బాక్సాఫీస్ రికార్డులను మాత్రమే తిరగరాయలేదు. ప్రపంచ పటంలో భారతీయ సినిమాకు ఓ కొత్త చిరునామాను అందించింది. రామ్ చరణ్- ఎన్టీఆర్ ల క్రేజ్ ఒక‌ ప్రాంతానికో? దేశానికో ? పరిమితం కాకుండా గ్లోబల్ రెఫరెన్స్‌గా మారడం టాలీవుడ్ సాధించిన చారిత్రాత్మక విజయం. ఈ గ్లోబల్ స్టార్‌డమ్ రాబోయే రోజుల్లో మరిన్ని పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లకు అంతర్జాతీయ వేదికను సులభతరం చేసే అవ‌కాశం లేక‌పోలేదు.