Begin typing your search above and press return to search.

జాన్వీ క‌పూర్ మ‌ళ్లీ అత‌డికి ట‌చ్ లో!

జాన్వీ కపూర్ కెరీర్ పరంగా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న తరుణంలో నాగరాజ్ మంజులేతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

By:  Srikanth Kontham   |   26 July 2026 3:00 PM IST
జాన్వీ క‌పూర్ మ‌ళ్లీ అత‌డికి ట‌చ్ లో!
X

అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ క‌పూర్ ప్ర‌యాణంలో ఎలా సాగుతుంద‌న్న‌ది చెప్పాల్సి ప‌నిలేదు.

శ్రీదేశి భౌతికంగా ప్రేక్ష‌కుల మ‌ధ్య‌లో లేక‌పోయినా? అభిమానుల గుండెల్లో మాత్రం ఎప్ప‌టికీ నిలిచే ఉంటుంది. అదే ఇమేజ్ తో జాన్వీ ప్ర‌యాణం బాలీవుడ్ స‌హా టాలీవుడ్ లో దేదీప్య‌మానంగా సాగిపోతుంది. వెనుక నుంచి తండ్రి బోనీ క‌పూర్ ప్రోత్సాహం ఉండ‌నే ఉంది. డాడ్ సూచ‌న‌లు..స‌ల‌హాలు పాటిస్తూ రెండు ప‌రిశ్ర‌మ‌ల్లోనూ మంచి అవ‌కాశాలు అందుకుంటుంది. ఇప్ప‌టికే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్..మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల‌తో రొమాన్స్ చేసింది. త‌దుప‌రి హీరో ఎవ‌రరా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఆ ఛాన్స్ టాలీవుడ్ లో ఏ హీరో అందుకుంటాడు? అన్న దానిపై రోజు చ‌ర్చ జ‌రుగుతూనే ఉంది. ఆసంగ‌తి ప‌క్క‌న బెడితే తాజాగా జాన్వీ క‌పూర్ డెబ్యూ డైరెక్ట‌ర్ తో మ‌రోసారి చేతులు క‌ల‌ప‌డానికి రెడీ అవుతున్న‌ట్లు బాలీవుడ్ మీడియాలోప్ర‌చారం మొద‌లైంది. `సైరత్` రీమేక్ ( ధ‌డ‌క్) చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జాన్వీ క‌పూర్ అదే దర్శకుడు నాగరాజ్ మంజులేతో సినిమా కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

జాన్వీ కపూర్ కెరీర్ పరంగా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న తరుణంలో నాగరాజ్ మంజులేతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మ‌రాఠీ సినిమా `సైర‌త్` ను బాలీవుడ్ లో రీమేక్ చేసింది శ‌శాంక్ ఖైతాన్. `ధ‌డ‌క్` టైటిల్ తో రీమేక్ అయిన సినిమా జాన్వీకి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ నేప‌థ్యంలో నేరుగా సైర‌త్ ద‌ర్శ‌కుడితోనే ప‌ని చేయ‌డానికి జాన్వీ సిద్ద‌మ‌వుతుండ‌టం విశేషం. ఇటీవ‌లే జాన్వీ -నాగ‌రాజ్ మ‌ధ్య స్టోరీ డిస్క‌ష‌న్ జ‌రిగిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. అయితే ఇక్క‌డ మ‌రో సందేహం కూడా వ్య‌క్త‌మ‌వుతోంది.

ఈ ప్రాజెక్ట్ పూర్తిగా జాన్వీ కోసమేనా లేక చెల్లెలు ఖుషీ కపూర్ ఎంట్రీ కోసమా అనే చర్చ కూడా సాగుతోంది. ఖుషీ కపూర్ కూడా నటనపై దృష్టి పెట్టిన నేపథ్యంలో నాగరాజ్ మంజులే దర్శకత్వంలో ఆమె కోసం ప్రాజెక్ట్ ను సెట్ చేస్తుందా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నాగరాజ్ మంజులే సహజసిద్ధమైన కథాంశాలతో, బలమైన సామాజిక నేపథ్యంతో సినిమాలను తెరకెక్కించడంలో దిట్ట. ఆయన టేకింగ్‌లో నటించడం ఏ నటుడికైనా మంచి అనుభవాన్ని ఇస్తుంది. ఈనేప‌థ్యంలో కపూర్ సిస్టర్స్ కెరీర్‌ను మరింత బలోపేతం చేయడానికి కాంబినేషన్‌ను ఎంచుకుంటుందా? అన్న‌ది తెర‌పైకి వ‌స్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.