Begin typing your search above and press return to search.

ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్ లో జాన్వీ.. అందానికే సరికొత్త నిర్వచనం!

ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలు ఫాలోవర్స్ ను పెంచుకునే దిశగా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్నారు.

By:  Madhu Reddy   |   1 Sept 2025 9:00 PM IST
ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్ లో జాన్వీ.. అందానికే సరికొత్త నిర్వచనం!
X

ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలు ఫాలోవర్స్ ను పెంచుకునే దిశగా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్నారు. అందులో భాగంగానే జూనియర్స్ మొదలుకొని సీనియర్ స్టార్ హీరోయిన్ ల వరకు చాలామంది గ్లామర్ ఒలకబోస్తూ అందాలతో కట్టిపడేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది గ్లామర్ తో ఆకట్టుకుంటే.. మరికొంతమంది తమ పర్సనల్, ప్రొఫెషనల్ కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. ఇంకొంతమంది ఫ్యాషన్ దుస్తులతో కూడా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే .


ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక బాలీవుడ్ బ్యూటీ కూడా ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్ ధరించి అందరిని ఆకట్టుకోవడమే కాకుండా ఫ్యాషన్ కే కాదు ఆ డ్రెస్ తో అందానికి సరికొత్త నిర్వచనం చూపించింది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. దివంగత నటీమని శ్రీదేవి.. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అటు బాలీవుడ్ లో అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటు తెలుగులో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ మరింత బిజీగా మారిపోయింది.


ఇటీవల ఎన్టీఆర్ - కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'దేవర' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది జాన్వీ కపూర్. ఈ సినిమాలో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'పెద్ది' సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఇటు సౌత్ లోనే కాకుండా అటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా సిద్ధార్థ్ మల్హోత్రాతో 'పరమ్ సుందరి' సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.ఇకపోతే ఈ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్న జాన్వీ కపూర్ తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెటిజెన్స్ ను ఆకట్టుకుంటున్నాయి.


ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్ చాలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన మల్టీకలర్ వన్ పీస్ డ్రెస్ ను ధరించింది జాన్వీ కపూర్. ఈమె ధరించిన ఈ డ్రెస్ ప్రత్యేకతల విషయానికి వస్తే.. మల్టీకలర్ రంగులతో కూడిన ఈ వస్త్రాన్ని కాలిడోస్కోప్ లో ముంచి ఆధునిక సిల్హౌట్ లో కొత్తదనాన్ని తీసుకొచ్చారు. దీనికి తోడు ఇదే వస్త్రాన్ని రెజిన్ లో ముంచి కొత్త షైనింగ్ ను తీసుకురావడం జరిగింది.అంతేకాదు జాన్వి కపూర్ ధరించిన ఈ డ్రెస్ ను ఎలా తయారు చేశారు అనే విషయాన్ని కూడా వీడియో రూపంలో పంచుకున్నారు.

ప్రస్తుతం ఈ డ్రెస్ చాలా ప్రత్యేకంగా నిలవడమే కాకుండా ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలుస్తోంది. ఏది ఏమైనా ఇలాంటి వినూత్నమైన డ్రెస్ లతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి జాన్వి కపూర్ చేస్తున్న ఈ ప్రయత్నం మరింత సక్సెస్ అయ్యేలా కనిపిస్తోందని చెప్పవచ్చు.