Begin typing your search above and press return to search.

జాన్వీ రేంజ్ అదుర్స్.. రిసార్ట్ ను తలపిస్తున్న పూల్!

ఎప్పుడు ఏదో ఒక విషయంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచే జాన్వీ కపూర్ తాజాగా తన పర్సనల్ స్విమ్మింగ్ పూల్ ప్రత్యేకతలతో మరోసారి వార్తల్లో నిలిచింది.

By:  Madhu Reddy   |   13 Sept 2025 11:51 AM IST
జాన్వీ రేంజ్ అదుర్స్.. రిసార్ట్ ను తలపిస్తున్న పూల్!
X

అతిలోక సుందరి కూతురిగా జాన్వీ కపూర్ కి సినిమాల్లోకి రాకముందే పాపులారిటీ ఉంది. అలాంటి జాన్వీ కపూర్ తల్లి బాటలోనే సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఎప్పుడు ఏదో ఒక విషయంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచే జాన్వీ కపూర్ తాజాగా తన పర్సనల్ స్విమ్మింగ్ పూల్ ప్రత్యేకతలతో మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే చాలామంది సినీ సెలెబ్రిటీలు సినిమాలో నటించగా వచ్చిన డబ్బులతో లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. అలా తమకంటూ లగ్జరీ ఇళ్లతో పాటు లగ్జరీ కార్లు ఇలా ప్రతి ఒక్కటి ఉంటాయి.

8,669 చదరపు అడుగుల విస్తీర్ణంలో జాన్వీ అందమైన బంగ్లా..

వీటన్నింటిలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే విలాసవంతమైన బంగ్లాలు.. చాలామంది సెలబ్రిటీలకు విలాసవంతమైన బంగ్లాలు,విల్లాలు ఉంటాయి. అంతేకాదు వారి ఇల్లు రాజభవనం లాగా ఉంటాయి. వారి ఇళ్ళలో ఉండే గదులు ఒక్కొక్కటి ఎంత విశాలంగా ఉంటాయి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఆ ఒక్క గది ఉన్న స్థలంలోనే పూర్తి ఇల్లుని నిర్మించుకుంటారు. ఆ రేంజ్ లో ఉంటాయి. అయితే తాజాగా జాన్వీ కపూర్ కి ఉన్న విలాసవంతమైన ఇల్లు, ఆమె స్పెషల్ స్విమ్మింగ్ పూల్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే.. జాన్వీకపూర్ కి ముంబైలోని రిచ్ ఏరియా అయినటువంటి బాంద్రాలో 8,669 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.65 కోట్ల విలువ చేసే ఓ లగ్జరీ ఇల్లు ఉంది. ఈ లగ్జరీ ఇంట్లో ఉండే ప్రతి ఒక్క గది చాలా ప్రత్యేకంగా ఉంటుందట.

స్విమ్మింగ్ పూల్ అంటే చాలా ఇష్టం..

కిచెన్ మొదలు బెడ్ రూమ్,హాల్,లివింగ్ రూమ్ ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా ప్రత్యేకతలతో కూడుకొని ఉంటుందట. అయితే.. ఆ ఇంట్లో తనకు ఎక్కువగా నచ్చిన ప్లేస్ స్విమ్మింగ్ పూల్ అంటూ జాన్వీ కపూర్ తాజా ఇంటర్వ్యూలో బయట పెట్టింది. జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. "నా ఇంట్లో ఉండే పర్సనల్ స్విమ్మింగ్ పూల్ అంటే నాకు ఎంతో ఇష్టం. ప్రైవేట్ గార్డెన్ తో రిసార్ట్ ను తలపించేలా ఉండే ఆ పర్సనల్ స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేయడానికి నేను ఎక్కువగా ఇష్టపడతాను. స్విమ్మింగ్ పూల్ చుట్టూ పచ్చదనం ఉండడంతో పాటు చాలా ప్రశాంత వాతావరణాన్ని తలపిస్తుంది. అందుకే టైం దొరికినప్పుడల్లా ఆ స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేస్తూ మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటాను.

స్విమ్మింగ్ పూల్ ప్రత్యేకతలు..

అయితే ఈ స్విమ్మింగ్ పూల్ కి మరో ప్రత్యేకత కూడా ఉంది . అది ఏంటంటే.. ఈ స్విమ్మింగ్ పూల్ కి ఒక ఆకారం అంటూ ఉండదు. ఏ వైపు నుండి చూసినా ఒకే రకమైన షేప్ కనిపిస్తుంది. అలా చాలా స్పెషల్ గా ఈ స్విమ్మింగ్ పూల్ ని డిజైన్ చేయించుకున్నాను". అంటూ తన స్పెషల్ స్విమ్మింగ్ పూల్ గురించి చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాకుండా ఆ లగ్జరీ ఇంట్లో ఉండే ఫర్నిచర్ అన్ని పూర్తిగా తన అభిరుచులకు తగ్గట్టుగా జాన్వీ కపూర్ డిజైన్ చేయించుకుందట. మొత్తానికి అయితే తనకు నచ్చినట్లుగా ఆ ఇంటిని డిజైన్ చేయించుకుని మళ్ళీ వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ..

జాన్వీ కపూర్ సినిమాలు..

జాన్వీ కపూర్ సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో దేవర సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది మూవీలో నటిస్తోంది. రీసెంట్ గానే బాలీవుడ్ లో పరమ్ సుందరి మూవీతో వచ్చినప్పటికీ ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయినా సరే బాలీవుడ్ లో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.