Begin typing your search above and press return to search.

జాన్వీ కపూర్ హోమ్ బౌండ్ మూవీకి ఎదురుదెబ్బ.. అసలేం జరిగిందంటే?

తాజాగా ట్రేడ్ నివేదికల ప్రకారం హోమ్ బౌండ్ మొదటి రోజు కేవలం రూ.30లక్షల నికర వసూలు మాత్రమే రాబట్టినట్లు సమాచారం.

By:  Madhu Reddy   |   28 Sept 2025 1:00 PM IST
జాన్వీ కపూర్ హోమ్ బౌండ్ మూవీకి ఎదురుదెబ్బ.. అసలేం జరిగిందంటే?
X

ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీకపూర్ తాజాగా నటించిన చిత్రం హోమ్ బౌండ్. నీరజ్ ఘయ్వాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశాల్ జెత్వా , ఇషాన్ ఖట్టర్, జాన్వి కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. హిందీ భాషా చిత్రంగా విడుదలైన ఈ సినిమా ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిలిం విభాగంలో ఏకంగా భారతదేశము నుండి అధికారిక ఆస్కార్ కు ఎంట్రీ కూడా అందుకుంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఆస్కార్ కి ఎంపికైంది అంటే.. కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని.. కలెక్షన్లతో రికార్డ్స్ తిరగా రాస్తుందని అందరూ ఫిక్స్ అయిపోయారు.

దీనికి తోడు నిన్న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా విమర్శకుల నుండి ప్రశంసలు కూడా అందుకుంది. కానీ మొదటి రోజు కలెక్షన్లు మాత్రం భారీగా దెబ్బ కొట్టినట్లు కనిపిస్తోంది. తాజాగా ట్రేడ్ నివేదికల ప్రకారం హోమ్ బౌండ్ మొదటి రోజు కేవలం రూ.30లక్షల నికర వసూలు మాత్రమే రాబట్టినట్లు సమాచారం. దీనికి కారణం ఈ సినిమా గురించి పెద్దగా ప్రమోషన్స్ చేపట్టకపోవడమే అని తెలుస్తోంది. ఇందులో ప్రముఖ నటులు నటించినప్పటికీ సరైన ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టకపోవడం వల్లే.. ఈ సినిమా ప్రజలకు పెద్దగా తెలియక ఓపెనింగ్స్ పేలవంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఆస్కార్ ప్రదర్శనకు ఎంపికైన ఈ చిత్రం ఇప్పుడు ఇలా కలెక్షన్లు రాబట్ట లేకపోవడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి.

హోమ్ బౌండ్ మూవీను ఇదివరకే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రపంచ ప్రీమియర్ ను ప్రదర్శించిన విషయం తెలిసిందే. అటు టొరంటో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో కూడా ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ హోమ్ బౌండ్ అనే సినిమా జర్నలిస్ట్ బషరత్ పీర్ రాసిన 'ఏ ఫ్రెండ్షిప్, ఏ పాండమిక్ అండ్ ఎ ద్వాత్ డిసైడ్ ది హైవే ' అనే వ్యాసం నుండి ప్రేరణ పొంది దీనిని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక ముస్లిం, దళితుడి మధ్య బాల్య స్నేహాన్ని ప్రదర్శిస్తుంది. వీరిద్దరూ తమ ఇంటి పేర్ల కారణంగా చాలా కాలంగా తిరస్కరించబడిన గౌరవాన్ని.. తిరిగి పోలీసు ఉద్యోగం ద్వారా పొందగలుగుతారు. హాలీవుడ్ లెజెండ్ మార్టిన్ కోర్సెస్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించగా కరణ్ జోహార్, అదార్ పూనవల్ల ఈ చిత్రానికి నిర్మాణంలో సహాయం అందించారు.

ఏదేమైనా జావ్వీ కపూర్ మూవీకి ఇలా మొదటి రోజే ఘోర అవమానం జరగడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. జాన్వీ కపూర్ విషానికి వస్తే ఇటీవల పరమ్ సుందరి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. ఈ సినిమాతో కూడా పెద్దగా సక్సెస్ ను అందుకోలేదు ఇప్పుడు సన్నీ సంస్కారికి తులసి కుమారి అనే సినిమాలో నటిస్తోంది. మరి ఈ సినిమా నైనా ఈమెకు మంచి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి. అటు తెలుగులో రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న పెద్ది సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.