Begin typing your search above and press return to search.

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

అందాలతార , అభినయ సుందరి దివంగత నటీమణి శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్.

By:  Madhu Reddy   |   6 Nov 2026 11:15 AM IST
కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!
X

అందాలతార , అభినయ సుందరి దివంగత నటీమణి శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె తొలిసారి శ్రీదేవి కోరిక మేరకు సీనియర్ ఎన్టీఆర్ వారుసుడైన జూనియర్ ఎన్టీఆర్ తో 'దేవర' అనే సినిమా చేసి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల చేత పరవాలేదనిపించుకున్న ఈమె.. మళ్లీ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' సినిమాలో నటించింది.





ఇదిలా ఉండగా ఒకవైపు పెద్ద సినిమాలో జాన్వీ కపూర్ ను గ్లామర్ పాత్రకే పరిమితం చేశారు అంటూ కొంతమంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయం 'కాఫీ విత్ కరణ్ సీజన్ 9' లో ఆ అనుభవాన్ని ఆమె ప్రస్తావిస్తూ.. తనకు అది అవమానకరమైనది అని చెబుతూనే.. ఆ సమయంలో మాట్లాడడానికి నాకున్న హక్కును ఉపయోగించుకోవాల్సింది.. దర్శకులు చెప్పినట్లు కాకుండా నా హక్కులు ఏంటో ఆ సమయంలో నేను వారి ముందు పెట్టుంటే.. నేడు ఈ ఇబ్బందులు ఎదుర్కొనే దాన్ని కాదేమో" అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది.అలా పెద్ది సినిమాలో తన నడుము ,నాభి పైన అతిగా దృష్టి పెట్టడంపై నెలకొన్న వివాదాస్పద విషయాలపై ఈ విధంగా స్పందించింది.





ఇదిలా ఉండగా మరొకవైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఈమె.. తాజాగా మరో ట్రెండీ అవుట్ ఫిట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. మొదటి వీడియోలోనే కన్ను గీటుతూ కుర్ర కారుకు నిద్ర లేకుండా చేసిన జాన్వీ.. తాను లేడీ పులిని అన్నట్టుగా క్యాప్షన్ ద్వారా అభివర్ణించింది. జాన్వీ కపూర్ ధరించిన అవుట్ ఫిట్ విషయానికి వస్తే.. గ్లామరస్ వెస్ట్రన్ స్టైల్లో రూపొందించబడిన టూ పీస్ కోఆర్డ్ సెట్ ను ఈమె ధరించింది.





ఈ అవుట్ ఫిట్ ప్యాట్రన్ విషయానికి వస్తే క్రాప్డ్ బ్రాలెట్ టాప్ ధరించగా.. దీనిపై గోల్డ్ కలర్ తో టైగర్ స్త్రైప్స్ లాంటి యానిమల్ ప్రింట్ తరహా లైన్లతో దీనిని చక్కగా డిజైన్ చేశారు. ఇక బాటమ్ విషయానికి వస్తే హై వేస్టేడ్ స్టైల్ లో ఉన్న బాడీ ఖాన్ లాంగ్ స్కర్ట్ ను ఈమె ధరించింది. బ్రాలెట్ టాప్ ను డిజైన్ చేసినట్టుగానే ..బాటమ్ ని కూడా అదే తరహాలో డిజైన్ చేశారు. మొత్తానికి అయితే ఈమె ధరించిన ఈ కోఆర్ టూ పీస్ సెట్ ఈమె అందాన్ని మరింత రెట్టింపు చేసింది.





ఒక ఫోటోలో సెల్ఫీ ఫోజులతో ఆకట్టుకున్న ఈమె.. మరొకవైపు లిప్ లైనర్ అద్దుతూ క్రేజీగా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇక మరికొన్ని ఫోటోలలో బుంగమూతి పెట్టిన ఈమె.. ఇలా తన గ్లామర్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేసింది.





ఈమె తదుపరి చిత్రాల విషయానికి వస్తే లగ్ జా గలే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది మే 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది . అలాగే అమిత్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఒక చిత్రంలో కూడా ఈమె నటిస్తోంది. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అలాగే మరో రెండు హిందీ ప్రాజెక్టులలో కూడా ఈమె భాగమైంది.ఇకపోతే ప్రస్తుతం ఒక తమిళ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.