బెడిసి కొట్టిన జాన్వీ స్ట్రాటజీ.. జాగ్రత్త పడకపోతే?
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఓ పక్క సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో నటిస్తూనే.. మరోవైపు బాలీవుడ్ లో టైర్ 2 హీరోలతో నటిస్తోంది.
By: Madhu Reddy | 3 Oct 2025 6:00 PM ISTబాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఓ పక్క సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో నటిస్తూనే.. మరోవైపు బాలీవుడ్ లో టైర్ 2 హీరోలతో నటిస్తోంది. సౌత్ ఇండస్ట్రీలో ఈ హీరోయిన్ నటించిన సినిమా హిట్ అయినా క్రెడిట్ మాత్రం దక్కలేదు. ఇప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసినప్పటికీ ఒక్క సినిమా కూడా పేరు తెచ్చిపెట్టడం లేదు. దానికి కారణం అవుట్ డేటెడ్ కథలను ఎంచుకోవడమే. అన్నీ పాత చింతకాయ పచ్చడి కథలను ఎంచుకోవడం వల్లే జాన్వీకపూర్ కి బాలీవుడ్ లో వరుస ఫ్లాప్ లు ఎదురవుతున్నాయి అని సినీ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.. అలా అని యాక్టింగ్ బాలేదని కాదు. తనకు ఇచ్చిన పాత్రకి 100% న్యాయం చేస్తుంది. కానీ ఎందుకో ఈమె ఎంచుకునే కథలు ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు. ఫలితంగా సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ గా నిలుస్తున్నాయి. అయితే రీసెంట్ గానే ఈ హీరోయిన్ పరమ్ సుందరి అనే మూవీతో మన ముందుకు వచ్చింది.కానీ ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో చెప్పనక్కర్లేదు.
మళ్లీ బెడిసి కొట్టిన మూవీ..
దీనికి తోడు ఇటీవల హోమ్ బౌండ్ అనే సినిమా కూడా విడుదలయ్యింది. ఈ సినిమా ఏకంగా ఆస్కార్ ప్రదర్శనకి కూడా ఎంపికైంది. కానీ ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన విషయం కూడా తెలియదు. అలా మొదటి రోజు కేవలం 30 లక్షల కలెక్షన్స్ మాత్రమే వసూలు చేసింది. దసరా సందర్భంగా విడుదలైన సన్నీ సంస్కారికీ తులసీ కుమారి సినిమా కూడా పాత చింతకాయ పచ్చడి లాగే ఉంది. ఈ సినిమా అక్టోబర్ 2న కాంతార: చాప్టర్ 1 మూవీకి పోటీగా విడుదలైనప్పటికీ.. ఆ సినిమా కలెక్షన్ల ముందు ఈ సినిమా నిలవలేకపోయింది. ముఖ్యంగా ఈ సినిమా కోసం జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ లు ఇద్దరు గట్టి ప్రమోషన్స్ చేసినప్పటికీ సినిమాకి ఫలితం లేకుండా పోయింది.
రొటీన్ కథతో బోర్ కొట్టించారుగా..
ముఖ్యంగా ఈ సినిమా స్టోరీ చూసుకుంటే ప్రేమించిన వాళ్లపై రివేంజ్ తీర్చుకునే నేపథ్యంలో తెరకెక్కిన స్టోరీ.. ఇందులో సన్నీ పాత్రలో వరుణ్ ధావన్, తులసి కుమారి పాత్రలో జాన్వీ కపూర్ నటించారు. ఇందులో సన్నీ పాత్రలో చేసిన వరుణ్ ధావన్ మొదట హీరోయిన్ సన్యా మల్హోత్రాని ప్రేమిస్తాడు. కానీ సన్యా మల్హోత్రా మాత్రం వాడుకొని వదిలేసి కోటీశ్వరుడిని వివాహం చేసుకోవాలని ఫిక్స్ అవుతుంది. దాంతో వరుణ్ ధావన్ ఎలాగైనా ప్రేమించిన అమ్మాయిపై రివేంజ్ తీర్చుకోవడం కోసం తన గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి మాజీ గర్ల్ ఫ్రెండ్ అయినా తులసి కుమారి అంటే జాన్వీ కపూర్ తో చేతులు కలిపి రివేంజ్ తీర్చుకోవడానికి ఇద్దరు ప్లాన్ వేస్తారు.
మండిపడుతున్న జాన్వీ ఫ్యాన్స్..
ఆ సమయంలో కొంచెం కామెడీ తప్ప సినిమాలో అంతగా ఏమీ లేదు. కథ పూర్తిగా అవుట్ డేటెడ్.. చూసేవాళ్ళకి బోరింగ్ గా అనిపించడమే కాదు విసుగు పుట్టిస్తుంది.. ఈ సినిమాలో ఉండే ప్రతి ఒక్క సన్నివేశం ఊహించేదిగానే ఉండడంతో మైనస్ అయింది.. ఈ సినిమాకి నిర్మాతగా కరణ్ జోహార్ చేశాడనే గొప్ప తప్ప సినిమా మొత్తం డొల్ల.. ఏమీ లేదు అని ప్రేక్షకులు రివ్యూ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది జాన్వీ కపూర్ అభిమానులు జాన్వీని హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోతే కెరీర్ నాశనం చేసుకోవాల్సిందే అంటూ కామెంట్లు పెడుతున్నారు.
జాన్వీకి సలహాలు ఇస్తున్న ఫ్యాన్స్..
అంతేకాదు పర్ఫామెన్స్ ఇవ్వడం కాదు కథలు మంచిగా ఎంచుకో.. మంచి కథలు ఎంచుకుంటేనే పేరు వస్తుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇప్పటికైనా జాన్వీ కపూర్ మంచి ప్రాజెక్టులను ఎంచుకొని ముందుకు వస్తుందా.. లేక మళ్ళీ అలాంటి రొటీన్ కథలను ఎంచుకుంటుందా అనేది చూడాలి. ఏది ఏమైనా కథల ఎంపిక విషయంలో జాన్వీ కపూర్ స్ట్రాటజీ పూర్తిగా బెడిసి కొట్టింది. ఇకనైనా జాగ్రత్త పడాలి అని, లేకపోతే ఇండస్ట్రీలో కెరియర్ కొనసాగించడం కష్టం అని కూడా చెబుతున్నారు ఫ్యాన్స్.
జాన్వీ కపూర్ సినిమాలు..
ప్రస్తుతం జాన్వీ కపూర్ రాంచరణ్ తో నటిస్తున్న పెద్ది మూవీ తో పాటు అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతున్న సినిమాలో కూడా కీ రోల్ చేస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ లో తఖ్త్, టాలీవుడ్ లో నాని హీరోగా చేస్తున్న ది ప్యారడైజ్ మూవీలో హీరోయిన్గా నటిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.అలా సౌత్ లో మంచి ప్రాజెక్టులు ఎంచుకున్నప్పటికీ నార్త్ లో మాత్రం రొటీన్ కథలను ఎంచుకుంటుందనే విమర్శలు జాన్వీ కపూర్ పై వస్తున్నాయి.
